టెంపా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణతో పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి ఈ నిత్యావసరాల పంపిణీ చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది. అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రు లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
నాట్స్ టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరాల ఉచిత పంపిణీలో కీలక పాత్ర పోషించారు. అటు బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ నిత్యావసరాల పంపిణికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ నిత్యావసరాల పంపిణి జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment