టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో ఉండే ప్రవాస భారతీయుల కోసం టెంపాలో షరిఫ్స్ ఇండియన్ అడ్వైజరీ కౌన్సిల్ 'బిల్డింగ్ ఎ స్ట్రాంగర్ కమ్యూనిటీ టుగెదర్' అనే సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి ఉత్తర అమెరికా తెలుగు
సంఘం (నాట్స్) సలహా కమిటీ సభ్యులు శేఖరంతో పాటు నాట్స్ సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అమెరికాలో ఉండే సవాళ్లు.. వాటిని అధిగమించే మార్గాలపై చర్చించారు. భారతీయులంతా కలిసి ఉంటే అమెరికాలో భారతజాతి సాధించుకునే ప్రయోజనాలపై సమీక్షించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులకు అవార్డులు ప్రదానం చేశారు.
మరోవైపు టెంపాలో విద్యార్ధుల కోసం నాట్స్ కాలేజ్ ప్రిపరేషన్ సెమినార్ నిర్వహించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమీనార్ లో కాలేజ్ చేరబోయే విద్యార్ధులకు ఉపయోగపడే అనేక అంశాలు
వివరించారు. అసలు కాలేజ్ లో చేరడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీల్లో ప్రవేశానికి రాయాల్సిన వ్యాసాలు, స్టోరీలైన్స్ ఎలా ఉండాలి. వాటిని అర్థవంతంగా ఉండాలి అనే అంశాలపై ఈ సెమీనార్ లో నిపుణులు
వివరించారు. కాలేజీలో ప్రవేశానికి చేయాల్సిన అంశాలు.. చేయకూడని అంశాలపై కూడా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తమకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఈ సెమీనార్ ద్వారా
తెలుసుకున్నామని విద్యార్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల కాలేజీ అడ్మిషన్ల గురించి తమకు కూడా అవగాహన పెరిగిందని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment