Hurricane Milton
-
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
‘ఈవీ’లు... టైంబాంబులు!
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.తొలుత వేడి... తర్వాత మంటలు! ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider) -
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్‌గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.