High winds
-
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
నేడు, రేపు పలు రాష్ట్రాల్లో గాలి వానలు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం వెల్లడించింది. రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గాలి దుమారం చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురవొచ్చనీ, ఆ సమయంలో పెనుగాలులు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గాలివానలు పడే అవకాశం ఉందని ఓ ప్రకటనలో వెల్లడించింది. గత పక్షం రోజుల్లో వర్షాలు, భీకర గాలి దుమారం కారణంగా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలోనే 120 మందికి పైగా చనిపోయారు. -
యూపీలో మరో తుపాను
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను మరో తుపాను కుదిపేసింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన పెనుగాలులు, భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 18 మంది మరణించారు. 27 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమ యూపీలోని 9 జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇటావాలో ఐదుగురు, మథుర, అలీగఢ్, ఆగ్రాల్లో ముగ్గురు చొప్పున, ఫిరోజాబాద్‌లో ఇద్దరు, హతరాస్, కాన్పూర్ దెహాత్‌లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. మథుర జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శనివారం, ఆదివారం పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ యూపీలో మరో ఇసుక తుపాను సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. -
ఈదురు గాలులు : నేలకొరిగిన ధ్వజ స్తంభం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ఓ ధ్వజ స్తంభం నేలకొరిగింది. ఈ ఘటన కమ్మరిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వుప్లూరు గ్రామంలోని బాల రాజేశ్వరి ఆలయంలోని ధ్వజ స్తంభం పడిపోయింది. అలాగే మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరగింది. చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో ప్రోక్లెయన్‌తో చెట్టును తొలిగించారు. -
భారీ వరదలతో బ్రిటన్ అతలాకుతం