నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ఓ ధ్వజ స్తంభం నేలకొరిగింది. ఈ ఘటన కమ్మరిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వుప్లూరు గ్రామంలోని బాల రాజేశ్వరి ఆలయంలోని ధ్వజ స్తంభం పడిపోయింది. అలాగే మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరగింది.
చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో ప్రోక్లెయన్‌తో చెట్టును తొలిగించారు.