ఆగ్రాలో ఇల్లు కూలి నిరాశ్రయులైన బాధితులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను మరో తుపాను కుదిపేసింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన పెనుగాలులు, భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో 18 మంది మరణించారు. 27 మంది గాయాలపాలయ్యారు. పశ్చిమ యూపీలోని 9 జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇటావాలో ఐదుగురు, మథుర, అలీగఢ్, ఆగ్రాల్లో ముగ్గురు చొప్పున, ఫిరోజాబాద్‌లో ఇద్దరు, హతరాస్, కాన్పూర్ దెహాత్‌లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. మథుర జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శనివారం, ఆదివారం పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ యూపీలో మరో ఇసుక తుపాను సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment