
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది.
‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment