bhavesh bhatia
-
50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..
Bhavesh Bhatia Success Story: బలమైన సంకల్పం నీకుంటే సమస్తం నీకు దాసోహమంటుంది.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా నీ గమ్యం చేరుకునే దిశలో అడుగులు వేస్తే.. తప్పకుండా సక్సెస్ నీకు సలాం చేస్తుంది. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువమందిలో ఒకరు 'భవేష్ భాటియా'. చూపు లేకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన 'భవేష్ భాటియా'కు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ, సృజనాత్మకత వంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ అతనికి రెంటీనా కండరాల సంబంధిత వ్యాధి వల్ల, దానిని నయం చేసుకోవడానికి డబ్బు లేకపోవడం వల్ల చూపును కోల్పోయాడు. ఉద్యోగం లభించలేదు డిగ్రీ పూర్తి చేసినప్పటికీ.. చూపులేకపోవడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న భాటియా తల్లి కూడా క్యాన్సర్ వ్యాధిలో మరణించింది. భాటియా తండ్రి పొదుపు చేసుకున్న మొత్తం డబ్బుని భార్య వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేసేసాడు. రూ. 50 అప్పుగా కంటికి రెప్పలా చూసుకునే తల్లి కోల్పోయిన తరువాత ఎదో ఒకటి చేయాలని నిరాంయించుకుని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ స్కూల్లో చేరి క్యాండిల్స్ (కొవ్వొత్తులు) తాయారు చేయడం నేర్చుకున్నాడు. క్యాండిల్స్ తయారు చేయడంలో కొంత నైపుణ్యం వచ్చిన తరువాత స్నేహితుడి నుంచి రూ.50 అప్పుగా తీసుకుని బండిని అద్దెకు తీసుకుని, మహాబలేశ్వర్‌లోని స్థానిక మార్కెట్లో కొవ్వొత్తులను అమ్మడం ప్రారంభించారు. వ్యాపారం కొంత పెరగడం మొదలు పెట్టింది. ఆ తరువాత 'నీతా' అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత భాటియా జీవితంలో కొత్త వెలుగు రావడం మొదలైంది. కొవ్వొత్తులను మార్కెటింగ్ చేయడంలో నీతా చాలా సహాయపడింది. భాటియా బలమైన సంకల్పంతో ముందడుగులు వేస్తున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. 'సన్‌రైజ్ క్యాండిల్స్'కు పునాది వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక బ్యాంక్ నుంచి రూ.15000 లోన్ తీసుకుని కొత్త పద్దతులతో క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనలాంటి అంధులకు కొంత మద్దతుగా నిలిచి వారికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే 'సన్‌రైజ్ క్యాండిల్స్'కు పునాది వేసాడు. ఈ సంస్థ నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ఉంది. ప్రస్తుతం సన్‌రైజ్ క్యాండిల్స్ సంస్థ ఏకంగా సంవత్సరానికి రూ.350 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ఈ కంపెనీ క్యాండిల్స్ ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణ క్యాండిల్స్ మాత్రమే కాకుండా.. సువాసనలు వెదజల్లేవి, మంచి డిజైన్ కలిగిన క్యాండిల్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. 9000 మందికి ఉపాధి కేవలం రూ. 50తో మొదలై రూ. 350 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి, ఏకంగా 9000మంది అంధులకు అందమైన జీవితాన్ని భాటియా ప్రసాదించారు. సుమారు 52 ఏళ్ల భాటియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలకు 12,000 రకాల డిజైన్ చేసిన క్యాండిల్స్ విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా భవేష్ భాటియా అకుంఠిత దీక్షను ప్రశంసించారు, అతని జీవితం ఎంతోమందికి ఆదర్శమని వెల్లడించారు. ఒకప్పుడు చూపు లేకపోవడం వల్ల ఉద్యోగం ఇవ్వని వారు సైత శభాష్ భాటియా అని పొగుడుతున్నారు. 'నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మాట ఖచ్చితంగా భాటియాకు సరిపోతుంది. -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
గెలిచాడు... గెలిపించాడు!
ఆదర్శం * అతని కంటికి చూపు లేదు * కానీ అతని మనసుకు ఉంది * అదే తనని గెలిపించింది ‘మీరు చేరే గమ్యానికి మీ సమస్యల గురించి చెప్పకండి. కానీ సమస్యలకు మాత్రం మీరు చేరే గమ్యాన్ని గురించి చెప్పండి’ అంటాడు భవేష్ భాటియా. ఆయన ఆ మాటలు ఎందుకన్నాడో తెలియాలంటే... ఆయన గురించి మనకు తెలియాలి. అప్పటివరకూ ఇంద్రధనుస్సుల తోటలో విహరించిన వ్యక్తికి ఒక్కసారిగా చీకటి గదికి మాత్రమే పరిమితమైపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? జీవితం కూడా చీకటిమయం అయిపోయినట్లు అని పిస్తుంది. భవేష్ భాటియాకు కూడా అలాగే అనిపించింది. ‘రెటీనా మాక్యులర్ డీజెనరేషన్’ వల్ల భవేష్ ఇరవయ్యేళ్ల వయసులో తన కంటి చూపును కోల్పో యాడు. దాంతో పాటు ధైర్యాన్నీ కోల్పో యాడు. కాలు మీద కాలు వేసుకొని కులా సాగా బతకడానికి తనది సంపన్న కుటుంబం కాదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. దాంతో ఎలా బతకాలా అని ఒకటే ఆలోచనలు. అయితే అదృష్టంకొద్దీ ఆ ఆలోచనల మథనంలో ‘పిరికితనం’ అనే విషం పుట్టలేదు. ‘ఆత్మస్థైర్యం’ అనే అమృతం పుట్టింది. గుజరాత్‌లోని అంజార్ గ్రామంలో పుట్టాడు భవేష్. అక్కడ భూకంపం రావడంతో కుటుంబం మొత్తం మహా బలేశ్వర్ (మహారాష్ట్ర) వచ్చి స్థిరపడింది. చూపు పోయిన తరువాత కొంతకాలానికి మహాబలేశ్వర్‌లోని ఒక హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా చేరాడు భవేష్. అయితే చూపులేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఉద్యోగాన్ని వదులుకోక తప్పింది కాదు. అలా అని ఇంట్లో కూర్చోవడానికి మనసొప్పలేదు. ఆ సమయంలోనే ఎవరో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్’ గురించి చెప్పడంతో ఆ ఇన్స్టిట్యూట్లో క్యాండిల్ మేకింగ్ కోర్స్‌లో చేరాడు. కోర్సు పూర్తయిన తరువాత తాను తయారుచేసిన క్యాండిల్స్‌ను రోడ్డు పక్కన అమ్మడం మొదలు పెట్టాడు. ఇది మొదలు అతడు ఎప్పుడూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరికి ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. తనలాంటి 225 మంది అంధులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాడు. ‘‘ఉద్యోగం ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే నాలాంటి చూపులేని వ్యక్తులకు క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నాను’’ అంటున్నాడు భవేష్. ‘‘వారికి తాత్కాలిక ఉపాధి కల్పించడం మాత్రమే నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో సొంత కాళ్ల మీద నిలబడి, నాలా కంపెనీ ప్రారంభించేలా తయారు చేస్తున్నాను’’ అని కూడా అంటున్నాడు. విశేషమేమిటంటే భవేష్ ఫ్యాక్టరీలో తయారయ్యేవి ఎకో-ఫ్రెండ్లీ క్యాండిల్స్! మూస పద్ధతిలో కాకుండా ఎప్పటికప్పుడు క్యాండిల్స్ తయారీలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటుంది భవేష్ కంపెనీ. పొగరహిత క్యాండిల్స్ తయారీ అలాంటిదే! క్యాండిల్స్‌తో రకరకాల కళా కృతులు, విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఈ కంపెనీ తయారుచేసిన కొన్ని క్యాండిల్స్... ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటాయి! వీరి సృజ నాత్మకను మెచ్చిన రిలయెన్‌స కంపెనీ వ్యాపారాన్ని విస్తరించ డానికి అవసరమైన గ్రాంటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ భవేష్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మాకు సహాయపడాలనుకుంటే మరింత ఎక్కువ పని ఇప్పించండి చాలు అన్నాడు. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. నాటి నుంచీ ఆ కంపెనీ నుంచి సన్రైజ్కి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. భవేష్ అంకితభావం, టీమ్ వర్క్ వల్ల ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ కంపెనీలలో ‘సన్‌రైజ్’ ప్రముఖంగా నిలిచింది. స్వదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వ్యాపారంలోనే కాదు... క్రీడల్లోనూ సత్తా చాటుతున్నాడు భవేష్. నేషనల్ లెవెల్ పారాలింపిక్స్ చాంపియన్ అయిన అతడు, షార్ట్‌పుట్ విభాగంలో పలు పతకాలు గెలుచు కున్నాడు. అలాగే భవేష్ ట్రెక్కర్, రన్నర్ కూడా. 2016లో బ్రెజిల్లో జరగబోయే పారాలింపిక్స్ గేమ్స్ కోసం కాస్త గట్టిగానే సన్నద్ధమవు తున్నాడు. అయినా ఆయనకు విజయాలు కొత్తేమీ కాదుకదా! ఇప్పటికే జీవితంలో గెలిచాడు. ఎందరినో గెలిపించాడు.