సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని అంబేనలి ఘాట్ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాబలేశ్వర్ యాత్రకు వెళ్తున్న ప్రవేటు బస్సు కొండ ప్రాంతంలో అదుపు తప్పి 500 మీటర్ల లోతు ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నారు.
బాధితులు అందరూ కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ప్రమాద ప్రదేశానికి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను బయటకు వెలికి తీశారు. బస్సు ఎత్తైన ప్రదేశం నుంచి కొందికి పడటంతో ప్రయాణీకులు అందరూ చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment