Sunrise
-
ఇండియా ఫస్ట్ సన్‌రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్‌గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్‌ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్‌లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్‌లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్‌లో సరదాగా.. -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్‌కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్‌ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్‌లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
సుదూర తార చిక్కిన వేళ...
ఫొటోలో బాణం గుర్తు ఎదురుగా మిణుకుమిణుకుమంటూన్న చిన్న వెలుగు కన్పిస్తోందా? లేదా? అయితే ఇన్సెట్లో చూడండి. కంటికి కొద్దిగా ఆనుతోంది కదా! అదేమిటో తెలుసా? మనకు తెలిసిన విశ్వమంతటిలోనూ అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రం. పేరు ఎరెండల్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా దీన్ని క్లిక్‌మనిపించింది. ఇది సన్‌రైజ్ ఆర్క్ అనే గెలాక్సీలో ఉందట. ఇంతకూ ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో ఉందో తెలుసా? ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో! ఇంతటి దూరాల్లో సాధారణంగా పాలపుంతలు మాత్రమే కన్పిస్తాయి. అలా చూస్తే ఈ సుదూర తార మనకు కన్పించడం యాదృచ్చికంగా కలిసొచ్చిన అదృష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఇది ముందుగా హబుల్ టెలిస్కోప్‌కు కన్పించిందట. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకుని ఆశ్చర్యానందాలకు లోనయ్యారట. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పట్టిందట! ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్ రూపం బిగ్‌బ్యాంగ్ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఎరెండెల్ అంటే వేకువ తార అని అర్థం. మనకు కన్పిస్తున్న ఎరెండెల్ రూపం విశ్వపు తొలి నాళ్లకు చెందినది గనుక ఈ పేరు సరిగ్గా నప్పిందంటూ సంబరపడుతున్నారు. -
Photo Feature : ప్రకృతి సోయగం
‘నిన్నటి సూరీడు వచ్చేనమ్మా.. పల్లె కోనేటి తామర్లు తెచ్చేనమ్మా’ అన్నట్లు ఉందిగా ఈ ప్రకృతి సోయగం. విజయనగరం జిల్లా గునుపురుపేట గ్రమప్రంతంలో కనువిందుగా సూర్యోదయం. సోమవారం వేకువజము వివిధ ప్రాంతాల్లో త్రివర్ణ రంగులలో కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు. (డి సత్యనారాయణమూర్తి-ఫోటోగ్రాఫర్) -
ఐదు దర్వాజల్లో నుంచి సూర్యోదయం, ఎక్కడంటే?
సాక్షి, జడ్చర్ల టౌన్: ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద ఉన్న లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది. దీనికి ఐదు గవాక్షాలు ఉండగా సూర్యుడు ఉదయించే సమయంలో వాటిల్లోనే పయనించడం విశేషం. ఆదివారం కనిపించిన సుందర దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. సాధారణంగా భక్తులు గవాక్షాలను అంతస్తులుగా పిలుస్తారు. ఒక్కో గవాక్షం ఒక్కో అంతస్తుగా, గవాక్షాన్ని దర్వాజగా భావిస్తారు. ఆ దర్వాజలో నుంచే సూర్యోదయం జరగటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. చదవండి: అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు! -
అది సూర్యుడు సూర్యుడిని పలకరించే రోజు..
మార్చి 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే రోజు. సెప్టెంబర్ 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే మరో రోజు. సూర్య కిరణాలు సూర్యుడి విగ్రహాన్ని తాకే రోజులివి. మొధేరా సూర్యదేవాలయం విశిష్టత ఇది. సూర్యదేవాలయంలోని సూర్యుడు... ఉదయించే సూర్యుడిని చూడడానికా ఉన్నట్లు తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు. ఆలయానికి ఎదురుగా విశాలమైన ఒక దిగుడు బావి. అది పేరుకే బావి, చెరువంత ఉంటుంది. ఆ బావి మెట్ల మీద నూట ఎనిమిది చిన్న చిన్న దేవాలయాలు, అందులో విగ్రహాలుంటాయి. ఉదయించే సూర్యుడి ప్రతిబింబం ఈ బావిలో నుంచి పైకి వస్తున్నట్లు భ్రమను కల్పిస్తుంది. ఈ బావిలో తాబేళ్లు ఉండడంతో నీరు పరిశుభ్రంగా ఉంటుంది. సూర్యమండపంలో మొత్తం 52 స్తంభాలుంటాయి. ఇవి ఏడాదిలో 52 వారాలకు ప్రతీకలు. ఈ స్తంభాల మీద రామాయణ, మహాభారత, కృష్ణ లీలలను కళ్లకు కట్టే శిల్పాలున్నాయి. ఆ గ్రంథాలు చదవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి శిల్పకారులు గ్రంథాలను గోడల మీదకు తెచ్చారు. ఈ విగ్రహాలను చూస్తే రాతిని చెక్కారా లేక మైనాన్ని కరిగించి మూసలో పోశారా అనిపిస్తుంది. గుజరాత్, మొధేరాలోని సూర్యదేవాలయంలో స్వయంగా వీక్షించి పరవశించాల్సిన శిల్పచాతుర్యం ఇది. ఊరంత ఆలయం మనకు బాగా తెలిసిన సూర్యదేవాలయం ఉత్తరాంధ్రలో ఉన్న అరసవెల్లిలో ఉంది. మరొకటి పేరులోనే సూర్యుడిని నింపుకున్న కోణార్క సూర్యదేవాలయం బంగాళాఖాతం తీరాన ఒడిషాలో ఉంది. వీటికి దీటుగా పశ్చిమాన అరేబియా సముద్రానికి సమీపంలో కూడా అంతకంటే గొప్ప నిర్మాణ కౌశలం ఉంది. అది మొధేరా సూర్యదేవాలయం. దేవాలయం అంటే ఊరిలో ఉండే ఒక ప్రదేశం. అయితే మొధేరా సూర్యదేవాలయం అలా కాదు. ఆలయమే ఒక ఊరంత ఉంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. సోలంకి రాజులు సూర్యవంశీకులు. తమ వంశీకుడి గౌరవార్ధం చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణం చేపట్టాలనే ఆకాంక్షతో ఈ దేవాలయాన్ని నిర్మించాడు భీమదేవుడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీలు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దాడిలో ధ్వంసమైన వాటిని పునరుద్ధరించి పూర్వ రూపం తీసుకురావడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీవ్రంగా శ్రమించింది. రేఖామార్గం కర్కాటక రేఖ మనదేశంలో ఈ పశ్చిమం నుంచి ఈ తూర్పు వరకు మొత్తం ఎనిమిది రాష్ట్రాలను పలకరిస్తూ సాగిపోతోంది. పశ్చిమాన గుజరాత్‌తో మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మీదుగా కర్కాటక రేఖ వెళ్తుంది. గుజరాత్‌లోని మొధేరా సూర్యదేవాలయం కర్కాటక రేఖ ప్రయాణమార్గంలో నిర్మించారు. సూర్యయానం ఇలా సూరుడు ఏడాదిలో ఒకసారి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి, అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం లోకి మారుతుంటాడు. సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణం మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో సూర్యుడు కచ్చితంగా తూర్పు దిక్కున ఉండేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే. ఆ రెండు రోజుల్లో ఒకటి మార్చి 21, మరొకటి సెప్టెంబరు 21. ఆ రోజుల్లో సూర్యుడి కిరణాల ప్రసారదిశకు అనుగుణంగా ఆలయాలను నిర్మించారు. ఇది మాటల్లో వివరించడానికి సాధ్యం కానంత గొప్ప ఖగోళ పరిజ్ఞానం. ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే ఇక్కడ నేల కంపనానికి గురి కాదు. రిక్టర్ స్కేలు మీద సాధారణ స్థాయులు దాటి తీవ్రత పెరిగినప్పటికీ ఇక్కడ భూమి అతి స్వల్పంగా కొద్దిపాటి ప్రకంపనలకు మాత్రమే గురవుతుంది. నేల కుంగిపోవడం, కట్టడాలు నేల కూలడం వంటి విలయాలుండవు. ఆ పేరు ఇలా వచ్చింది! రాముడు మొధేరాలో యజ్ఞం చేశాడని స్కంద పురాణం చెబుతోంది. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పరివారంతోపాటు అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రామదండు విజయోత్సాహంతో గెంతులు వేస్తోంది. కానీ రాముడికి మనసు మనసులో లేదు. ‘ఇది నిజంగా విజయమేనా’ అనే సందేహం బాధించసాగింది. రావణుడు పరమ నిష్ఠాగరిష్టుడైన బ్రాహ్మణోత్తముడు. అలాంటి రావణుడిని సంహరించడం ధర్మమేనా అనే శంకను వశిష్ఠునితో చెప్పాడు. ఆ పాప నివారణ కోసం ఒక యజ్ఞం చేయమని సూచించాడు వశిష్ఠుడు. ధర్మారణ్యంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని యజ్ఞం చేశాడు. యజ్ఞ నిర్వహణ కోసం ఆ ప్రదేశంలో చిన్న గ్రామం వెలిసింది. ఆ గ్రామానికి సీతాపూర్ అని పేరు పెట్టాడు రాముడు. ఆ గ్రామంలో రాముడు చేసిన యజ్ఞంలో పాలుపంచుకున్న మో«ద్ బ్రాహ్మణులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తర్వాత ఆ ఊరికి మొధేరా అనే పేరు స్థిరపడింది. -
యోనెక్స్‌తో ‘బాయ్’ రూ. 75 కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ యోనెక్స్ సన్‌రైజ్‌తో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 75 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ‘బాయ్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని టోర్నమెంట్లకు యోనెక్స్ సంస్థ తమ ఉత్పత్తులను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా మూడేళ్ల పాటు ‘బాయ్’ నిర్వహించే టోర్నీలకు ఆ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ అంశంపై ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... ‘భారత బ్యాడ్మింటన్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న యోనెక్స్ సన్రైజ్కు ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల ఆర్థిక స్థిరత్వం లభించనుంది. దీంతో ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గొప్ప పురోగతి సాధించవచ్చు’ అని అన్నారు. కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ... ‘మన దేశంలో బ్యాడ్మింటన్ విస్తరించడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడనుంది’ అని తెలిపారు. -
సూర్యారాధన మతం కాదు.. సైన్స్
విజయవాడ స్పోర్ట్స్: చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున ప్రకృతిని ఆరా ధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. భారత దేశంలో తొలుత ఏపీలోనే సూర్యుడు ఉదయిస్తాడని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సూర్యోదయం జరుగుతుందని సీఎం పేర్కొ న్నారు. సూర్యారాధన మతం కాదని, సైన్స్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సూర్యారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సూర్యారాధనను జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా తయారై ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. ప్రతి మతంలోనూ వివిధ పద్ధతుల్లో సూర్యారాధన జరుగుతుం దన్నారు. ప్రతి ఏడాది గణతంత్ర దినో త్సవం జరుపుకుంటున్న మాదిరిగానే సూర్యారాధనను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. సూర్యరశ్మి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, బాక్టీరియాలు నశించి పోతాయన్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
జి.సిగడాం : కార్తీక శోభనాడు సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడంతో భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన దృశ్యం శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్యపేట పంచాయతీలో ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సూర్యకిరణాలు శివలింగాన్ని స్పర్శించాయి. ఇలాంటి దృశ్యమే శ్రీకాకుళం పట్టణంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే సంగతి తెలిసిందే. ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో సూర్యకిరణాలు ముందుగా సూర్యదేవుడు ఆలయం మీదుగా నందీశ్వర కొమ్ముల మధ్యలో అమ్మవారి, విఘ్నేశ్వర విగ్రహాన్ని తాకి అనంతరం శివలింగానికి పూర్తిస్థాయిలో స్పర్శించడం.. అద్భుతమైన దృశ్యమని భక్తులు చెప్తున్నారు. సూర్యనారాయణమూర్తి తన కిరణ స్పర్శను ఆదిదేవుడిపై ప్రసరింపచేయడం చాలా అద్భుతంగా ఉందని వేదపండితులు తెలిపారు. ఏటా కార్తీకమాసం రెండో సోమవారం, అలాగే కార్తీ మాసం ఆఖరి నాలుగు రోజల వ్యవధిలో ఈ ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు స్పర్శిస్తాయి. ఆలయం నిర్మించి పదేళ్లు అవుతున్నదని, ఏటా కార్తీక మాసంలో ఇలా సూర్యకిరణాలు పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. -
గులాబీ ఆకాశం
మండల కేంద్రమైన సి.బెళగల్లో ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆకాశం గులాబి వర్ణంలో కనువిందు చేసింది. సరిగ్గా సూర్యోదయ సమయంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఆకాశం ఆహ్లాదకరంగా మారటంతో స్థానికులు సెల్ ఫోనులలో ఆ దృశ్యాలను బంధించారు. - సి.బెళగల్ -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సోలార్ కిడ్స్..!
వైద్య రంగానికి సవాల్ విసురుతున్న పాక్ చిన్నారులు కరాచీ: ఆ ముగ్గురు చిన్నారులూ సూర్యోదయంతోనే శక్తిని పుంజుకుంటారు. సూర్యాస్తమయం కాగానే శరీరాన్ని కదపలేక నిస్తేజంగా పడుకుంటారు..అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్‌కు చెందిన ఈ ముగ్గురు చిన్నారులూ వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు. ఏడాది వయసుగల షోయబ్, తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, 13 ఏళ్ల వయసుగల ఇలియాస్ హసీమ్ సోదరులు. క్వెట్టాకు 15 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వీరు పగలంతా మిగతా పిల్లలమాదిరిగానే ఆడుతూపాడుతూ తిరుగుతున్నారు. కాని సూర్యకాంతి తగ్గుతున్న కొద్దీ వారి శరీరంలోని శక్తి క్షీణించడం మొదలవుతుంది. మళ్లీ మరుసటి రోజు సూర్య కిరణాలు తాకగానే ఉత్సాహంగా లేస్తారు. దీంతో గ్రామస్తులు వీరిని సోలార్ కిడ్స్‌గా పిలవడం మొదలు పెట్టారు. చికిత్స నిమిత్తం వీరిని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (పిమ్స్) లో చేర్చగా.. ఇటువంటి కేసు మునుపెన్నడూ చూడలేదని, దీనిపై పరిశోధన చేస్తున్నట్లు పిమ్స్ చాన్సెలర్ డాక్టర్ జావెద్ అక్రం తెలిపారు. వీరికి పరీక్షలు నిర్వహించేం దుకు పిమ్స్ 9 మంది నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరి రక్త నమూనాలను పరీక్షించి, రిపోర్టులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకు పంపించారు. ఇప్పటివరకు వందలాది పరీక్షలు జరిపినా ఎలాంటి ఫలితమూ లేదు. కానీ ఇటీవల జరిపిన పరీక్షలో వచ్చిన ఫలితాల ప్రకారం దీన్ని అత్యంత అరుదైన మస్తీనియా సిండ్రోమ్‌గా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్ప టివరకు 600 మంది ఈ వ్యాధిబారిన పడినట్లు సమాచారం. -
ఎండ వేడితో ఆమ్లెట్
-
అగ్నిపర్వతం పేలితే.. భూమి చల్లబడుతుంది!
తెల్లని పొగ, నల్లని బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న రష్యాలోని సరిచెవ్ పీక్ అగ్నిపర్వతమిది. అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు గతంలో తీసిన ఫొటోల్లో ఇది ఒకటి. అయితే.. ఇలాంటి స్వల్ప అగ్నిపర్వత పేలుళ్ల వల్ల భూగోళం చల్లారుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అగ్ని పర్వతాలు విడుదల చేసే బూడిద, ధూళికణాలు వాతావరణంలోకి చేరి.. సూర్యరశ్మిని వెనక్కి పంపేసి భూమిని చల్లబరుస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. -
గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం తిథి శు.పంచమి ఉ.6.40 వరకు తదుపరి షష్ఠి తె.5.34వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం కృత్తిక ఉ.6.47 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం రా.10.36 నుంచి 12.13 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు సూర్యోదయం : 6.05 సూర్యాస్తమయం: 6.07 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు -
సీరీజ్ ముంగిట 'సూర్యోదయం'!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏడున్నరేళ్ల క్రితం ప్రయోగించిన 'డాన్' ఉపగ్రహం ఎట్టకేలకు సీరీజ్ మరుగుజ్జు గ్రహాన్ని చేరింది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సీరీజ్ చుట్టూ కక్ష్యలోకి వెళ్లింది. 61 వేల కి.మీ. దూరం నుంచే ఉపగ్రహాన్ని సీరీజ్ గురుత్వాకర్షణ శక్తితో లాక్కుందని, అయాన్ థ్రస్టర్(మోటారు)ను మండించి వేగాన్ని నియంత్రించుకుంటూ 'డాన్' సీరీజ్ కక్ష్యలోకి చేరింది. సీరీజ్ కక్ష్యలోకి చేరాక డాన్ నుంచి సంకేతాలు అందాయని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తెలిపింది అయితే, సీరీజ్కు చీకటివైపు నుంచి కక్ష్యలోకి చేరినందున, వచ్చే నెల నుంచే ఆ గ్రహం పగటి భాగం డాన్‌కు కనిపిస్తుందని, అందువల్లే అప్పటి నుంచే డాన్ ఫొటోలు తీసి పంపనుందని పేర్కొంది. అంగారక, గురు గ్రహాల మధ్య అతిపెద్ద ఖగోళ వస్తువైన సీరీజ్ను 1801లో కనుగొన్నారు. ఈ గ్రహం ఉపరితలంపై నీరు ఉందని, దానితో వ్యోమగాములు ఆక్సిజన్ తయారుచే సుకోవచ్చని భావిస్తున్నారు. సౌరకుటుంబం ఏర్పడినప్పుడు గురు గ్రహం ప్రభావం వల్ల ఇది పూర్తిస్థాయి గ్రహంగా ఏర్పడలేదని, దీనిపై పరిశోధనతో గ్రహాల ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చంటున్నారు. -
గ్రహం అనుగ్రహం, శనివారం నవంబర్ 29
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.సప్తమి ఉ.6.27 వరకు తదుపరి అష్టమి తె.4.00 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.7.10 వరకు తదుపరి శతభిషం తె.5.31 వరకు, (తెల్లవారితే ఆదివారం), వర్జ్యం ప.1.52 నుంచి 3.21 వరకు దుర్ముహూర్తం ఉ.6.16 నుంచి 7.46 వరకు అమృతఘడియలు రా.10.47 నుంచి 12.18 వరకు సూర్యోదయం: 6.16 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు -
గ్రహం అనుగ్రహం,శుక్రవారం,నవంబర్ 28
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.షష్ఠి ఉ.8.45 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం శ్రవణం ఉ.8.45 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం ప.12.29 నుంచి 1.59 వరకు దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.21 వరకు తదుపరి ప.12.11 నుంచి 12.59 వరకు అమృతఘడియలు రా.9.26 నుంచి 10.56 వరకు సూర్యోదయం: 6.15 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు -
గ్రహం అనుగ్రహం , గురువారం, నవంబర్ 27
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.పంచమి ప.11.00 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.2.04 నుంచి 3.34 వరకు దుర్ముహూర్తం ఉ.10.00 నుంచి 10.50 వరకు తదుపరి ప.2.25 నుంచి 3.14 వరకు అమృతఘడియలు రా.11.01 నుంచి 12.31 వరకు సూర్యోదయం : 6.15 సూర్యాస్తమయం : 5.20 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు సుబ్రహ్మణ్యషష్ఠి -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.చవితి ప.1.01 వర కు తదుపరి పంచమి నక్షత్రం పూర్వాషాఢ ప.11.41 వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.7.14 నుంచి 8.45 వరకు దుర్ముహూర్తం ప.11.27 నుంచి 12.17 వరకు అమృతఘడియలు ఉ.7.05 నుంచి 8.38 వరకు సూర్యోదయం: 6.14 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు -
గ్రహం అనుగ్రహం, మంగళవారం, నవంబర్ 18
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.ఏకాదశి ప.3.00 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తర ఉ.8.08 వరకు, తదుపరి హస్త, వర్జ్యం సా.5.17 నుంచి 7.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.14 వరకు, తదుపరి రా.10.26 నుంచి 11.20 వరకు, అమృతఘడియలు తె.3.43 నుంచి 5.27 వరకు (తెల్లవారితే బుధవారం) సూర్యోదయం: 6.09 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం:ఉ.9.00 నుంచి 10.30 వరకు -
గ్రహం అనుగ్రహం, సోమవారం, నవంబర్ 17
గ్రహం అనుగ్రహం శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,కార్తీకమాసం తిథి బ.దశమి ప.1.13 వరకుతదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర పూర్తి వర్జ్యం ప.1.45 నుంచి 3.30 వరకు దుర్ముహూర్తం ప.12.08 నుంచి 12.58 వరకు తదుపరి ప.2.22 నుంచి 3.11 వరకు అమృతఘడియలు రా.12.14 నుంచి 2.01 వరకు సూర్యోదయం: 6.08 సూర్యాస్తమయం: 5.20 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు -
గ్రహం అనుగ్రహం శనివారం, నవంబర్, 15
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీకమాసం తిథి బ.అష్టమి ఉ.9.02 వరకు తదుపరి నవమి నక్షత్రం మఖ రా.3.04 వరకు వర్జ్యం ప.1.46 నుంచి 3.33 వరకు దుర్ముహూర్తం ఉ.6.07నుంచి 7.36 వరకు అమృతఘడియలు రా.12.25 నుంచి 2.11 వరకు సూర్యోదయం: 6.08 సూర్యాస్తమయం: 5.21 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు నమాజ్ వేళలు ఫజర్ : 5.18 జొహర్ : 12.10 అస్ర : 4.05 మగ్రిబ్ : 5.47 ఇషా : 6.56 -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీకమాసం, తిథి బ.సప్తమి ఉ.6.52 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.12.31 వరకు వర్జ్యం ప.12.11 నుంచి 1.45 వరకు దుర్ముహూర్తం ఉ.8.21 నుంచి 9.11 వరకు తదుపరి ప.12.09 నుంచి 1.00 వరకు అమృతఘడియలు రా.10.44 నుంచి 12.29 వరకు సూర్యోదయం: 6.07 సూర్యాస్తమయం: 5.21 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు నమాజ్ వేళలు ఫజర్ : 5.16 జొహర్ : 12.10 అస్ : 4.06 మగ్రిబ్ : 5.48 ఇషా : 6.57 -
రెప్పవాల్చని సిటీ...
సూర్యుడికి సాయంకాలం పడమటి కొండల్లో విశ్రాంతి... చంద్రుడు రవికిరణం సోకితే చల్లగా జారుకుంటాడు.. మరి భాగ్యనగరి... నిరంతర జన ప్రవాహ ఝరి.... అర్ధరాత్రీ హడావుడి.. సందడి మామూలే... నైట్ లైఫ్... అర్ధరాత్రికి ఆకలెక్కువనుకుంటాను పెనమ్మీద మాడిపోయిన బ్రెడ్డుముక్కల్నీ గుడ్డుముక్కల్నీ చౌరస్తాలు ఎగబడి పంచుకుంటున్నాయి... భాగ్యనగరి.. నిరంతర జనఝరి.. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకూ జీవనయానం సాగుతునే ఉంటుంది. 24 గంటలు మాకు సరిపోవు అన్నట్టు నగరం పరుగులు తీస్తోంది. స్త్రీ, పురుషులు, బడా, పేద అనే తేడాను చెరిపేస్తోంది. అర్ధరాత్రి సైతం అందరినీ ‘కలిపే’ నడిపిస్తోంది. ఐటీ హబ్‌లు..అంతర్జాతీయ కార్యాలయాలకు కేంద్రంగా నిలిచిన విశ్వ నగరం నిరంతరం మేల్కొనే ఉంటోంది. రేయి, పగలుకు తేడా లేదంటూ అర్ధరాత్రి విద్యుత్ దీప కాంతుల్లో యువత కేరింతలు.. దూసుకుపోతున్న కార్లు.. వేడివేడి టిఫిన్ల కోసం మొబైల్ క్యాంటిన్లు.. వీధులను శుభ్రం చేస్తున్న కార్మికులు.. కలల బండి మెట్రో పనులు చేస్తున్న శ్రామికులు.. మీ భద్రతకు మేం భరోసా అంటూ పెట్రోలింగ్ పోలీసులు.. ఇలా గ్రేటర్ సిటీ బిజీబిజీ. నిశిరాత్రి వేళ నగరంలో వింతలు.. విశేషాలను మీ ముందుంచేందుకు ‘సాక్షి’ ఓ ప్రయత్నం చేసింది. హైటెక్ హంగులు పులుముకున్న మాదాపూర్.. కొత్త పాతల మేలు కలయిక మెహదీపట్నం.. ఎప్పుడూ బిజీగా ఉండే అమీర్‌పేట్, సికింద్రాబాద్‌లలో పర్యటించింది. నగరం నిద్దరోతున్న వేళ..మేల్కొని ఉన్న మరో ప్రపంచాన్ని మీరూ చూడండి. - సాక్షి, సిటీబ్యూరో -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీకమాసం, తిథి శు.అష్టమి రా.6.06 వరకు నక్షత్రం శ్రవణం రా.12.40 వరకు, వర్జ్యం ఉ.5.56 నుంచి 7.27 వరకు, తదుపరి తె.4.26 నుంచి 5.55 వరకు, (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి ప.12.11 నుంచి 12.51 వరకు, అమృతఘడియలు ప.2.54 నుంచి 4.26 వరకు సూర్యోదయం: 6.01 సూర్యాస్తమయం: 5.27 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు -
రాష్ర్టంలో మండుతున్న ఎండలు
హైదరాబాద్, హన్మకొండల్లో అధిక ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇటీవల ఎండల తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం ‘సాక్షి’కి చెప్పారు. హన్మకొండలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హకీంపేట, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని సీతారాం వెల్లడించారు. అక్టోబర్ నెలలో సాధారణంగా కొద్దిపాటి వర్షాలు కురుస్తాయి. కొన్ని సందర్భాల్లో తుపాన్లు వస్తాయి. గత నెల 24 తర్వాత వర్షాలు తగ్గడంతో ఎండలు మండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సాధారణంకంటే ఏకంగా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ప్రధాన కారణం కాలుష్యం పెరగడం, పచ్చదనం లేకపోవడం, పట్టణీకరణ పెరగడంవల్లేనన్నారు. గత నాలుగేళ్లలో హైదరాబాద్‌లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారన్నారు. -
భలే ఆప్స్
సన్‌రైజ్ క్యాలెండర్... రోజువారీ వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు ఉపయోగపడే క్యాలెండర్ అప్లికేషన్ ఇది. ఇటీవలే తాజాగా అప్డేట్ అయింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కూ అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ గూగుల్ క్యాలెండర్‌తోపాటు ఎవర్‌నోట్ వంటి అప్లికేషన్లతో సులువుగా అనుసంధానమవుతుంది. రోజులో ఏ సమయంలో ఏం చేయాలనుకుంటున్నామో గుర్తు చేసుకునేందుకు పార్టీలు, ఇతర కార్యక్రమాలకు బంధుమిత్రులను ఆహ్వానించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఫేస్బుక్ ఈవెంట్స్, గూగుల్ మ్యాప్స్, లింక్డ్ఇన్ కాంటాక్ట్స్తోనూ ఇంటిగ్రేట్ కాగలగడం ఈ అప్లికేషన్ మరో ప్రత్యేకత. ఆపత్కాలంలో ఆరుగురికి మెసేజ్‌లు... అనుకోకుండా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతే... స్నేహితులు లేదా బంధువులను రహస్యంగా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే ‘సర్కిల్ ఆఫ్ 6’ మీకు తగిన అప్లికేషన్. మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అప్లికేషన్‌పై రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు... ముందుగానే రాసిపెట్టుకున్న మూడు మెసేజ్‌లలో ఒకటి మీ కాంటాక్ట్స్‌లోని ఆరుగురికి చేరిపోతుంది. జీపీఎస్ ద్వారా మీరెక్కడున్నారో చెబుతూ మిమ్మల్ని పిక్ చేసుకోవాల్సిందిగా ఒక సందేశం వెళుతుంది. ఇంకో సందేశం ద్వారా వెంటనే కాల్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్‌కు రిక్వెస్ట్ వెళుతుంది. మహిళా భద్రతకు ఉద్దేశించిన హాట్‌లైన్‌తో నేరుగా సంప్రదింపులు చేసేందుకూ అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా. ఆండ్రాయిడ్‌కూ వెబ్ఎండీ... జ్వరమొచ్చినా... లేదా ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం పరిపాటి. అలాకాకుండా... మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు... డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించవచ్చు? అన్న విషయం తెలుసుకునేందుకు వెబ్ఎండీ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. అనారోగ్యం తాలూకూ లక్షణాలను అందిస్తే... ఈ అప్లికేషన్ ఏ వ్యాధి లేదా సమస్య ఉందో సూచనప్రాయంగా చెబుతుంది. ఎలాంటి ప్రాథమిక చికిత్స చేసుకోవచ్చో సూచిస్తుంది కూడా. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్నదీ తెలియజేస్తుంది. డెస్క్‌టాప్‌పైనా న్యూస్ టికర్.... టీవీ ఛానళ్లలో స్క్రీన్ దిగువభాగంలో వచ్చే న్యూస్టికర్లను గమనించే ఉంటారు. వీటిని పీసీ డెస్క్‌టాప్‌పైనా వచ్చేలా చేసుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ ఫీడ్లను సేకరించి డెస్క్టాప్పై చేర్చేందుకు బాట్వేర్ అనే యూకే సంస్థ డెస్క్‌టాప్ టికర్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. కొన్ని ఆర్ఎస్ఎస్ ఫీడ్లు ముందుగానే ప్రీలోడ్ అయినప్పటికీ మీకు కావాల్సిన వాటిని అదనంగా చేర్చుకునే అవకాశముంది. స్క్రీన్‌పై ఎక్కడ రావాలన్న అంశాన్నీ మీరే నిర్ణయించవచ్చు. మ్యాక్ లేదా లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ అప్లికేషన్ పనిచేయదు. వివరాలకు... http://www.battware.co.uk వెబ్‌సైట్‌ను చూడండి. -
భానుడు భగభగ
సాక్షి, విశాఖపట్నం/ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. వేడి గాలులకుతోడు, కోస్తా జిల్లాల్లో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కబోతతో సతమతమవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు వడగాల్పులకు అలమటిం చిపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో 48.4డిగ్రీలు, పాల్వంచలో 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గుంటూరు జిల్లా రెంటచింతలలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 5 డిగ్రీలు వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో వేడి గాలులతోపాటు, అధిక పీడన ప్రభావం కూడా ఉన్నట్టు తెలిపింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని, ఎండలు పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వీలైనంత వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి... పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బు బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితోపాటు, బీపీ మాత్రలు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. వేడివల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటకు బయటకు వెళతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడం కోసం ఉప్పు కలిపిన నీరు మధ్య మధ్యలో తాగాలి. శక్తికోసం పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎండ సమయాల్లో బయటకు వెళ్లేప్పుడు సాధ్యమైనంతవరకూ తలకు, ముఖానికి వేడి తగలకుండా లేతరంగు వస్త్రాలు కట్టుకోవడం, గొడుగు వాడడం మంచింది. వేడిని ఆకర్షించని లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. తలనొప్పి, వాంతులు, వళ్లు నొప్పులు, తీవ్ర నీరసం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేసి, తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. -
అర్ధరాత్రి సూర్యోదయం
విదేశాలలో... ‘ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్’ అని పేరున్న నార్వేలోనిదీ సూర్యోదయ దృశ్యం. ఇక్కడ మే నెల నుండి ఆగష్టు వరకు రాత్రి 11 గం.కి కూడా పట్టపగలులా ఉంటుంది. పన్నెండు గంటల తర్వాత చీకటి పడినట్టే పడి.. ఆ వెంటనే సూర్యోదయమౌతుంది. ఒక్కోసారి 4 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ విధంగా వేసవిలో 4 గంటలే చీకటిగా ఉంటే, జూన్ జులైలో రెండు గంటలు మాత్రమే చీకటి. అక్టోబర్ నుండి ఈ దృశ్యం పూర్తిగా మారుపోతుంది. రోజులో 3-4 గంటలు మాత్రమే వెలుతురు. ఉత్తర ఐరోపాకు చెందిన నార్వే స్కాండినేవియా ద్వీపకల్పం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ధ్రువప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు రోజుకు మూడు, నాలుగు సార్లు మారుతూ ఉంటాయి. అప్పుడే ఎండ, అప్పుడే చలి, ఆ వెంటనే వాన... ఇలా ఒకేరోజు మూడు రుతువులను చూడవచ్చు. ఉత్తర నార్వేలో జూన్ 21, దక్షిణ నార్వేలో డిసెంబర్ 22న రోజంతా ఎండకాస్తూనే ఉంటుంది. ధృవప్రాంతం కావడంతో సూర్యకిరణాల వెలుగులు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. ఇలా హరివిల్లు రంగులు దర్శనమిస్తుంటాయి. -
బాబోయ్ చలి!
=మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు =మంచుతో మరింత వణుకు =మినుములూరులో 6 డిగ్రీలు =చింతపల్లిలో 11 డిగ్రీలు పాడేరు/ చింతపల్లి రూరల్, న్యూస్‌లైన్ : చలి సత్తా చూపుతోంది. కొండకోనలను బెంబేలెత్తిస్తోంది. పాడేరు ప్రాంతంలో మళ్లీ ఉష్ణోగ్రతలు దిగజారడంతో చలి విజృంభించింది. మంగళవారం మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా బుధవారం నాటికి మరో మూడు డిగ్రీలు తగ్గి 6 డిగ్రీలకు పడిపోవడంతో చలిగాలులు ప్రతాపం చూపుతున్నాయి. సాయంత్రం నుంచే చలిగాలులు ఉధృతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాడేరులో ఉదయం 9 గంటలకు సూరోద్యయమైనప్పటికీ, చలిగాలులు విజృంభించడంతో జనం గజగజ వణికారు. చింతపల్లిలో వాతావరణ పరిస్థితులు కాస్త బిన్నంగా ఉన్నాయి. అక్కడ బుధవారం 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే మంచు తీవ్రంగా ఉండడంతో సూర్యోదయం ఆలస్యమైంది. నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నప్పటికీ కురుస్తున్న భారీ మంచుతో ఉదయం 10 గంటల వరకు సూర్యకిరణాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నెల 21వ తేదీ నుంచి చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా లంబసింగిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నప్పటికీ చలిగాలులు వీయడం, పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో సాయంత్రం 4 గంటల నుంచి చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెల్లవారుజాము నుంచే కురుస్తున్న మంచుతో పనులపై వెళ్లేవారు, కాఫీ పండ్ల సేకరణకు వెళ్లే గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. 10 గంటలైనా వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. లంబసింగిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అరకులోయలో ఒకటే చలి రకులోయ : అరకులోయ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగిపోయింది. వారం వరకు ఓ మోస్తరుగా ఉన్న చలి మంగళవారం రాత్రి నుంచి గజగజ వణికిస్తోంది. గతంలో వర్షాన్ని తలపించే విధంగా మంచు కురిసేది. మంగళవారం రాత్రి నుంచి ఎటువంటి మంచు లేకుండానే చలి తీవ్రత ఒక్క సారిగా పెరిగిపోయింది. బుధవారం అరకులోయలో మంచు ఎక్కువగా లేనప్పటికీ చలి ఎక్కువగా ఉంది. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో మంచుతో పాటు చలితీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అరకులోయలో మంగళవారం బుధవారం 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు, పర్యాటకులు ఆందోళన చెందున్నారు. -
ఆధ్యాత్మికం..ఆరోగ్యం.. కార్తీకం
చలికాలంలో మనిషిలో బద్దకం పెరుగుతుంది. ఉష్ణోగ్రత తక్కువస్థాయికి పడిపోతుంది. వీటిని తట్టుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుని రోజంతా సమర్థంగా పనిచేసేందుకు కార్తీకమాసం ఆచారాలు దోహదపడతాయి. మహిళలు తెల్లవారుజామునే నిద్రలేవడం, పసుపురాసుకోవడం, చన్నీటితో స్నానం చేయడం, ఆల యానికి వెళ్లి తులసిమొక్కకు నీళ్లుపోసి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలాం టివి ఇందు కు ఎంతో ఉపయోగపడతాయి. అల్పాహారం, మధ్యాహ్నం మిత భోజనం, రాత్రికి పండ్లు, పాలు వంటివి తీసుకోవడం ఇందులోభాగమే. ఈ నెలలో నిష్టగా నియమాలు పాటిస్తే స త్ఫలితాలను పొందవచ్చని నిపుణులు, పండితులు సూచిస్తున్నా రు. సూర్యోదయంలోపే స్నానం తెల్లవారుజామున సూర్యోదయంలోగా స్నానం చేస్తే రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. తీర్థంతో ఆరోగ్యానికి ఎంతో మేలు ఆలయంలో పచ్చకర్పూరం, పటిక, తులసి, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థం భక్తులకు ఇస్తుంటారు. దీని వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మహిళలు ఉదయాన్నే పసుపు రాసుకోవడం వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. చైతన్యవంతానికి ఉపవాసం కార్తీకమాసంలో చాలా మంది ఉపవాస దీక్ష చేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయం తగ్గుతుంది. శరీరంలో అన్ని అవయవాలు చైతన్యవంతంగా పనిచేస్తాయి. దీక్ష ఉన్నవారు పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి.