
అగ్నిపర్వతం పేలితే.. భూమి చల్లబడుతుంది!
తెల్లని పొగ, నల్లని బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న రష్యాలోని సరిచెవ్ పీక్ అగ్నిపర్వతమిది.
తెల్లని పొగ, నల్లని బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న రష్యాలోని సరిచెవ్ పీక్ అగ్నిపర్వతమిది. అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు గతంలో తీసిన ఫొటోల్లో ఇది ఒకటి. అయితే.. ఇలాంటి స్వల్ప అగ్నిపర్వత పేలుళ్ల వల్ల భూగోళం చల్లారుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అగ్ని పర్వతాలు విడుదల చేసే బూడిద, ధూళికణాలు వాతావరణంలోకి చేరి.. సూర్యరశ్మిని వెనక్కి పంపేసి భూమిని చల్లబరుస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది.