న్యూఢిల్లీ: బీఎఫ్‌ఎస్‌ఐపై ప్రత్యేక దృష్టిపెట్టిన సాస్(ఎస్‌ఏఏఎస్) సేవల సంస్థ వర్చువల్ గలాక్సీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
ఐపీవోలో భాగంగా 66 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధుల్లో రూ. 34 కోట్లు అదనపు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు, రూ. 19 కోట్లు ప్రస్తుత ప్రొడక్టుల ఆధునీకరణ, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. మరో రూ. 14 కోట్లు బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలపై వెచ్చించనుంది.
ఇదీ చదవండి: ఎన్‌ఎస్‌ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్‌సైట్
కాగా.. జులైలో ప్రీఐపీవో నిధుల సమీకరణలో భాగంగా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల నుంచి రూ. 21.44 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) రూ. 72 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment