=మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు
=మంచుతో మరింత వణుకు
=మినుములూరులో 6 డిగ్రీలు
=చింతపల్లిలో 11 డిగ్రీలు
పాడేరు/ చింతపల్లి రూరల్, న్యూస్‌లైన్ : చలి సత్తా చూపుతోంది. కొండకోనలను బెంబేలెత్తిస్తోంది. పాడేరు ప్రాంతంలో మళ్లీ ఉష్ణోగ్రతలు దిగజారడంతో చలి విజృంభించింది. మంగళవారం మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా బుధవారం నాటికి మరో మూడు డిగ్రీలు తగ్గి 6 డిగ్రీలకు పడిపోవడంతో చలిగాలులు ప్రతాపం చూపుతున్నాయి. సాయంత్రం నుంచే చలిగాలులు ఉధృతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాడేరులో ఉదయం 9 గంటలకు సూరోద్యయమైనప్పటికీ, చలిగాలులు విజృంభించడంతో జనం గజగజ వణికారు.
చింతపల్లిలో వాతావరణ పరిస్థితులు కాస్త బిన్నంగా ఉన్నాయి. అక్కడ బుధవారం 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే మంచు తీవ్రంగా ఉండడంతో సూర్యోదయం ఆలస్యమైంది. నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నప్పటికీ కురుస్తున్న భారీ మంచుతో ఉదయం 10 గంటల వరకు సూర్యకిరణాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నెల 21వ తేదీ నుంచి చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా లంబసింగిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నప్పటికీ చలిగాలులు వీయడం, పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో సాయంత్రం 4 గంటల నుంచి చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెల్లవారుజాము నుంచే కురుస్తున్న మంచుతో పనులపై వెళ్లేవారు, కాఫీ పండ్ల సేకరణకు వెళ్లే గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. 10 గంటలైనా వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. లంబసింగిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
అరకులోయలో ఒకటే చలి
రకులోయ : అరకులోయ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగిపోయింది. వారం వరకు ఓ మోస్తరుగా ఉన్న చలి మంగళవారం రాత్రి నుంచి గజగజ వణికిస్తోంది. గతంలో వర్షాన్ని తలపించే విధంగా మంచు కురిసేది. మంగళవారం రాత్రి నుంచి ఎటువంటి మంచు లేకుండానే చలి తీవ్రత ఒక్క సారిగా పెరిగిపోయింది. బుధవారం అరకులోయలో మంచు ఎక్కువగా లేనప్పటికీ చలి ఎక్కువగా ఉంది.
అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో మంచుతో పాటు చలితీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అరకులోయలో మంగళవారం బుధవారం 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు, పర్యాటకులు ఆందోళన
చెందున్నారు.
బాబోయ్ చలి!
Published Thu, Dec 26 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement