న్యూఢిల్లీ: క్రీడా ఉత్పత్తుల తయారీ సంస్థ యోనెక్స్ సన్‌రైజ్‌తో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 75 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ‘బాయ్’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని టోర్నమెంట్‌లకు యోనెక్స్ సంస్థ తమ ఉత్పత్తులను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా మూడేళ్ల పాటు ‘బాయ్’ నిర్వహించే టోర్నీలకు ఆ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ అంశంపై ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... ‘భారత బ్యాడ్మింటన్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్‌కు ధన్యవాదాలు.
ఈ నిర్ణయంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల ఆర్థిక స్థిరత్వం లభించనుంది. దీంతో ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గొప్ప పురోగతి సాధించవచ్చు’ అని అన్నారు. కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ... ‘మన దేశంలో బ్యాడ్మింటన్ విస్తరించడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడనుంది’ అని తెలిపారు.
యోనెక్స్‌తో ‘బాయ్’ రూ. 75 కోట్ల ఒప్పందం
Published Sat, May 12 2018 1:21 AM | Last Updated on Sat, May 12 2018 1:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment