కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీని టెమ్‌జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్‌గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్‌ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్‌లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు.
Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC
— Temjen Imna Along (@AlongImna) September 13, 2023
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్‌లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..!
ఇదీ చదవండి: పార్క్‌లో సరదాగా..
Comments
Please login to add a commentAdd a comment