
విజయవాడ స్పోర్ట్స్: చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున ప్రకృతిని ఆరా ధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. భారత దేశంలో తొలుత ఏపీలోనే సూర్యుడు ఉదయిస్తాడని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సూర్యోదయం జరుగుతుందని సీఎం పేర్కొ న్నారు. సూర్యారాధన మతం కాదని, సైన్స్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సూర్యారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సూర్యారాధనను జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా తయారై ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. ప్రతి మతంలోనూ వివిధ పద్ధతుల్లో సూర్యారాధన జరుగుతుం దన్నారు. ప్రతి ఏడాది గణతంత్ర దినో త్సవం జరుపుకుంటున్న మాదిరిగానే సూర్యారాధనను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. సూర్యరశ్మి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, బాక్టీరియాలు నశించి పోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment