
పెట్టుబడులు పెట్టండి
చైనా పర్యటన మొదటి రోజైన ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సినోమో ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ...
- చైనా పెట్టుబడిదారులకు చంద్రబాబు పిలుపు
సాక్షి, హైదరాబాద్: చైనా పర్యటన మొదటి రోజైన ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సినోమో ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ, ఇండియా ఎల్‌ఎస్‌వీటి సంస్థ ప్రతినిధులతో భేటీ అయింది. నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు సూచించారు. తిరుగు ప్రయాణంలో(చైనా నుంచి) తనతో పాటు ఏపీకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను చూపిస్తానని, పనులు వెంటనే ప్రారంభించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. చైనా, భారత్‌లపైనే ప్రపంచం దృష్టి సారించిందని అన్నారు. ‘24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు దేశంలో ఎంపికైన మూడవ రాష్ట్రం ఏపీ. పరిశ్రమలకు విద్యుత్ కొరత ఉండదు. రూ.40 వేల కోట్ల వ్యయంతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్త రాజధాని ‘అమరావతి’ని నిర్మిస్తున్నాం. సులభతర వాణిజ్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను 21 రోజుల లోపే ఇస్తున్నాం. మరో 10 నెలల్లో భారత్‌లో ఏకీకృత పన్ను(సింగిల్ టాక్సేషన్) విధానం అమలులోకి రానుంది.’ అని సీఎం వివరించారు. సిమెంట్, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా సంస్థ సినోమో ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆసక్తి వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా గురజాలని గుర్తించినట్లు ఆ సంస్థ చైర్మన్ సాంగ్ సౌషన్ తెలిపారు.
3 ఒప్పందాలకు రెడీ: చంద్రబాబు బృందం మూడు గంటల ఆలస్యంగా బీజింగ్‌కు చేరుకుంది. ఈ బృందానికి చైనాలో భారత రాయబారి అశోక్ కాంతా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో బాబు బృందం కీలకమైన 13 ఒప్పందా(ఎంవోయు)లు కుదుర్చుకోనుంది.
ఒప్పందాలు ఇవీ..
గవర్నమెంట్ టు బిజినెస్‌తో 6 ఒప్పందాలు
బిజినెస్ టు బిజినెస్ కింద 2 చైనా పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం.్ళవర్టెక్స్ సిమెంట్స్(ఇండియా), సినోమా(చైనా) సంస్థల మధ్య ఒప్పందం.(గంగవరంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు)్ళగిజోయ్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్‌తో ..ళసినోమా ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ సంస్థ, తో(ఇంజనీరింగ్ ఉపకరణాల తయారీ),
ల్యూయో కంపెనీతో (వ్యవసాయ పరిశ్ర మ, పశుగ్రాసం, స్లాటరింగ్, మాంస ఉత్పత్తులు)
బ్రాండిక్స్,చైనా మాన్యుఫ్రాక్చరర్, జియాం గ్స్‌కింగ్ డే టెక్స్‌టైల్‌తో (దుస్తుల తయారీ, సరఫరా)
సిషువాన్ ష్వానీ ఆటోమేషన్ కంపెనీతో (ఆటోమేటెడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సప్లై)
పాన్ హిహ్వా గ్వాంగ్వా గ్రూప్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌తో (రియల్ ఎస్టేట్ అభివృద్ధి)ళసిషువాన్ వెహిలిన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం
చైనా వెస్ట్రన్ పవర్ ఇండస్ట్రీయల్ కంపెనీ లిమిటెడ్(సీడబ్ల్యూపీసీ)తో భారత్‌కి చెందిన విద్యుత్ సంస్థ వీఎస్‌ఎఫ్ ఎనర్జీ ఒప్పందం.(పవర్ ప్లాంట్ బాయిలర్లు, పవర్ స్టేషన్ ఏగ్జిలరీ ఎక్విప్‌మెంట్ తయారీ)
పాల్స్‌ప్లష్(టాయ్ మేకర్) సంస్థతో జీఎంఆర్ సంస్థ ఒప్పందం.్ళక్యామెల్ గ్రూప్ కంపెనీతో (పరిశోధన, తయారీ రంగాలు, స్టోరేజీ బ్యాటరీల రీసైక్లింగ్)
చైనా కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్(సీసీపీఐటీ)తో ఏపీ వేర్వేరు ఒప్పందాలు.(నిర్మాణ రంగం).