‘లోకోభిన్న రుచి’ అని సామెత. యూఎస్‌ఏలోని ఇదాహోకు చెందిన డేవిడ్ రష్ అందుకు ఉదాహరణ. రికార్డులంటే పిచ్చి ఉన్న రష్... 250 గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా 150 క్యాండిల్స్‌ను నోట్లో పెట్టుకుని మండించాడు. 30 సెకన్లపాటు హోల్డ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. గతంలో 105 క్యాండిల్స్‌తో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
హౌ క్రేజీ అనుకుంటున్నారా! ఈ ఒక్కదానికే... ఇంకా ఇతనికి చాలా రికార్డులున్నాయి. గతంలో 111 టీషర్ట్‌లు ధరించి హాఫ్ మారథాన్ కూడా చేశాడు రష్. 111 టీషర్టులను ఒంటిపై ఉంచుకుని 2 గంటల 47 నిమిషాల 55 సెకన్లపాటు మారథాన్ చేసి హాఫ్ మారథాన్‌లో అత్యధిక టీషర్టులు ధరించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతనికి అన్ని టీషర్టులు తొడగడానికే 25 నిమిషాలు పట్టిందట.
చదవండి: కనుగుడ్లను బయటకు పెట్టి చూస్తే గిన్నిస్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment