mouth
-
చిన్నారుల నోట్లో పుండ్లు?
కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.చికిత్స / మేనేజ్మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి. -
నోటిలో నాటే ఇంప్లాంట్స్...
ఎవరికైనా సరే ఏవైనా అవయవాలను కోల్పోతే అమర్చే బయటి కృత్రిమ అవయవాలను ‘ఇంప్లాంట్స్’ అనీ, అదే ఏ కారణాల వల్లనైనా దంతాలు కోల్పోయిన వారికి అమర్చే కృత్రిమ దంతాలను డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు. ఇటీవల ఈ కృత్రిమ అవయవాల విజ్ఞాన శాస్త్రమూ చాలా అభివృద్ధి చెందింది. ఆహారం తీసుకుంటేనే జీవితం. ఆ జీవితం కొనసాగడానికి ఉపయోగపడే ‘డెంటల్ ఇంప్లాంట్స్’ గురించి అవగాహన కోసమే ఈ కథనం. కొన్నిసార్లు కృత్రిమ దంతాలు అమర్చాలన్నా శరీర నిర్మాణ (అనాటమీ) పరంగా కొందరిలో వాటిని అమర్చడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇటీవల ‘డెంటల్ ఇంప్లాంటాలజీ’లో వచ్చిన పురోగతి వల్ల పూర్తిగా స్వాభావికమైనవే అనిపించేలా, అందంగా కనిపించేలా రూపొందిన ఈ డెంటల్ ఇంప్లాంట్స్‌లో రకాలూ, అవసరాన్ని బట్టి అమర్చుకునే తీరు... మొదలైన అంశాలేమిటో చూద్దాం. జైగోమ్యాటిక్ ఇంప్లాంట్‌పై పలువరసలో... అందునా ప్రధానంగా దవడ ప్రాంతంలో అమర్చడానికి ఉపయోగించే కృత్రిమదంతం ఇంప్లాంట్‌ను జైగోమ్యాటిక్ అంటారు. పైదవడలో అమరికకు అవసరమైనంత ఎముక లేక΄ోయినప్పటికీ దీన్ని అమర్చడం సాధ్యమవుతుంది. సంప్రదాయ కృత్రిమ దంతం కంటే ఇది చాలా మన్నికైనదీ, దాదాపుగా నేచురల్ పన్నులాగే ఉంటుంది. టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్స్ ఇక వీటిని మరింత అడ్వాన్స్డ్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే జైగోమ్యాటిక్ కృత్రిమదంతాలు అమర్చడానికి వీలుకాదో, అక్కడ కూడా ఇవి తేలిగ్గా అమరిపోతాయి. అదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకాస్త ఎక్కువ వివరణ అవసరం. అదేమిటంటే... తలలో పై దవడ ఎముకకు కాస్త వెనకగా, ఇంకా వివరంగా చెప్పాలంటే సరిగ్గా కంటి ప్రాంతానికి, మెదడు అమరే ప్రాంతానికి దిగువన ‘స్పీనాయిడ్ బోన్’ అనే ఎముక ఉంటుంది. దవడ ఎముక సరిపోనప్పుడు ఈ టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్స్ తాలూకు ‘వేళ్ల (రూట్స్)’ వంటివి ఈ ‘స్పీనాయిడ్ బోన్’లోకి వెళ్లేలా చేస్తారు. దీనికి కాస్త ఎక్కువ నైపుణ్యం అవసరం. ఇలా చేయడం వల్ల అవి మరింత స్థిరంగా, గట్టిగా అమరి΄ోతాయి. చాలామందిలో కృత్రిమ పన్ను అమరికకు తగినంత ఎముక సపోర్ట్ లేకపోతే ఇలా ‘స్పీనాయిడ్ బోన్’లోకి వెళ్లి నాటుకునేలా అమర్చేందుకు వీలైన కృత్రిమ దంతాలే ఈ ‘టెరిగాయిడ్ ఇంప్లాంట్స్’గా చెప్పవచ్చు. ఇక ఇవేకాకుండా పొట్టి రకాలూ, సన్నరకాలూ (షార్ట్ అండ్ న్యారో) అనే ఇంప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పన్ను ఉండాల్సిన స్థానంలో సరిగ్గా ఇమిడిపోయే సౌకర్యం ఉన్నందున ఇటీవల ఇవి ఎక్కువగా ప్రాచుర్యం ΄పొందుతున్నాయి. అయితే డెంటల్ డాక్టర్లు ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ దంతాలతోపాటు అవసరాన్ని బట్టి వాడుతుంటారు. ఇవన్నీ అక్కడి ఎముక మందం, అమర్చడానికి అవసరమైనంత ఎముక అందుబాటులో ఉందా లేదా అనే అంశాల మీద ఆధారపడి... ఆ ప్రదేశంలోని అవసరాలను బట్టి ఉపయోగిస్తుంటారు. గతంలో పోలిస్తే... అప్పుడు వీలుకాని అమరికలు సైతం ఈ తరహా కొత్త రకాల కృత్రిమ పళ్ల వల్ల సాధ్యమవుతోంది. కాబట్టి ఏవైనా ప్రమాదాలతోగానీ, ఇతరత్రాగానీ పళ్లు కోల్పోయినవారు ఇప్పుడు గతంలోలా బాధపడాల్సిన అవసరం లేదని డెంటల్ సర్జన్లు భరోసా ఇస్తున్నారు. రకాలు.. డెంటల్ ఇంప్లాంట్స్‌లో అనేక రకాలు ఉన్నప్పటికీ ఇటీవలి ఆధునిక పరిజ్ఞానంతో రూపొందిన వాటిల్లో జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ అనేవి ప్రధానమైనవి. మామూలుగానైతే ఎవరికైనా కృత్రిమదంతం అమర్చాలంటే పైదవడలో గానీ, కింది దవడలో గానీ తగినంత ఎముక ఉండాలి. దీనికి ఉదాహరణ ఇలా చెప్పుకుందాం.కాస్తంత పొడవైన ఓ స్క్రూ బిగించాల్సి ఉంటే, దాని వెనక తగినంత చెక్క ఉండాలి. అలా లేకపోతే స్క్రూ పూర్తిగా అమరదు. కొద్ది చెక్క సపోర్ట్ మాత్రమే ఉంటే స్క్రూ పూర్తిగా లోపలివరకూ వెళ్లకుండా చాలావరకు బయటే ఉండిపోతుంది. చాలామందిలో పై పలువరసకు స΄ోర్ట్‌గా ఎముక (మ్యాక్సిల్లరీ బోన్), కింది పలువరసకు ఎముక (మ్యాండిబ్యులార్ బోన్) చాలా కొద్దిగా మాత్రమే ఉండి, ఇలా కృత్రిమ ఇం΄్లాంట్ పన్ను అమర్చేందుకు వీలుగా ఉండకపోవచ్చు. ఇలాంటివారిలో సైతం అమర్చడానికి వీలయ్యేవే ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్లు. డా. వికాస్ గౌడ్, డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: ఈ వర్కౌట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..! సన్నజాజి తీగలా నడుము..) -
నోట్లో పొక్కులు వస్తున్నాయా..?
కొందరికి నోట్లో, నాలుక మీద పగుళ్ళు రావడం, దాంతో ఏవైనా వేడిపదార్థాలూ లేదా కారపు పదార్థాలు తిన్నప్పుడు మంట, బాధ కలుగుతుండటం చాలా సాధారణం. ఇలా నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడం తోపాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగ్జైటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇవి వచ్చినప్పుడు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారం పాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశమున్నందున డాక్టర్లు తగిన పరీక్షలు చేయించి, కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
అమెరికాలో నరమాంస భక్షకుడు!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చేతబట్టుకుని రోడ్డుపై తిరుగుతూ కలకలం రేపాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరలైంది. అందులో కాలిని అటూ ఇటూ ఊపుతూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ ఉన్మాదిలా విరగబడి నవ్వుతూ కని్పంచాడతను. అప్పుడప్పుడు దాన్ని వాసన చూస్తూ, నోట్లో పెట్టుకుంటూ అందరినీ భయభ్రాంతులను చేశాడు. ‘దేవుడా! అతడా కాలిని తినేస్తున్నాడు’ అంటూ నేపథ్యంలో కొందరు హాహాకారాలు చేయడం కూడా వీడియోలో విన్పించింది. పట్టాలు దాటబోతూ రైలు ఢీకొని మరణించిన మహిళ తాలూకు తెగిపడిన కాలిని అలా చేతపట్టుకుని తిరిగినట్టు స్థానిక మీడియా వివరించింది. విషయం తెలిసి పోలీసులొచి్చనా అతను ఏమాత్రమూ బెదరకుండా కులాసాగా కని్పంచాడు. అతన్ని 27 ఏళ్ల రెసెండో టెలెజ్గా గుర్తించారు. మృతదేహపు కాలిని ఎత్తుకెళ్లి రైలు ప్రమాదం తాలూకు సాక్ష్యాధారాలను మాయం చేశాడన్న అభియోగాలపై అరెస్టు చేశారు. పోలీసులు తరలిస్తుండగా కూడా కెమెరాల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులూపుతూ కన్పించాడు! -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్‌ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..
నవ్వుతోనే ముఖం ఆకట్టుకుంటుంది. తెల్లని పలువరుస ఆ నవ్వును ప్రభావితం చేస్తుంది. కానీ పళ్లపై పసుపు గారలు.. నోటి దుర్వాసన వల్ల నవ్వు సంగతి అటుంచి అసలు నోరు తెరవడానికే భయపడుతుంటారు ఆ సమస్యలున్న వాళ్లు. అలాంటి వాళ్లు ఈ హోం రెమిడ్సి పాటిస్తే చాలా ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొయొచ్చు. అవేంటంటే.. వీటికి ఓ చిన్న చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రసం తీసిన నిమ్మతొక్కతో పళ్ళను రుద్దుకుంటే క్రమంగా పసుపు మరకలు పోవడమే కాదు.. నోటి దుర్వాసనా తగ్గుతుంది. అయితే నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఎక్కువ రుద్దితే పళ్ళు బలహీనమవుతాయి. ఏదైనా అతి మంచిది కాదుకదా! సో.. తులసి ఆకులు- ఎండిన నారింజ తొక్కలు: ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే త్వరితగతిన దంతాలు తెల్లగా మారతాయి. బేకింగ్‌సోడా నీరు: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బేకింగ్‌సోడాల నీరు పోసి పేస్ట్‌లా చేసి దీన్ని పళ్లకు అప్లై చేసి రుద్దిన పసుపు మచ్చలు పోతాయి. అలాగే ఉప్పు నిమ్మరసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. ఈ చక్కటి ఇంటి చిట్కాలను పాటించి స్థైర్యంగా నవ్వండి. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్‌బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
అమ్మ బాబోయ్.. ఒకేసారి నోట్లో 150 క్యాండిల్స్ మండించి..
‘లోకోభిన్న రుచి’ అని సామెత. యూఎస్ఏలోని ఇదాహోకు చెందిన డేవిడ్ రష్ అందుకు ఉదాహరణ. రికార్డులంటే పిచ్చి ఉన్న రష్... 250 గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా 150 క్యాండిల్స్‌ను నోట్లో పెట్టుకుని మండించాడు. 30 సెకన్లపాటు హోల్డ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. గతంలో 105 క్యాండిల్స్‌తో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. హౌ క్రేజీ అనుకుంటున్నారా! ఈ ఒక్కదానికే... ఇంకా ఇతనికి చాలా రికార్డులున్నాయి. గతంలో 111 టీషర్ట్లు ధరించి హాఫ్ మారథాన్ కూడా చేశాడు రష్. 111 టీషర్టులను ఒంటిపై ఉంచుకుని 2 గంటల 47 నిమిషాల 55 సెకన్లపాటు మారథాన్ చేసి హాఫ్ మారథాన్‌లో అత్యధిక టీషర్టులు ధరించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతనికి అన్ని టీషర్టులు తొడగడానికే 25 నిమిషాలు పట్టిందట. చదవండి: కనుగుడ్లను బయటకు పెట్టి చూస్తే గిన్నిస్ రికార్డు -
‘నోరె’ళ్లబెట్టే రికార్డు! 4 మెక్‌డొనాల్డ్స్ చీస్ బర్గర్లను అవలీలగా..
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఐశాక్ జాన్సన్ అనే టీనేజర్ మరోసారి తన టాలెంట్‌తో అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. నోటిని అత్యంత పెద్దగా తెరవడంలో తన పేరిటే ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు. తన నోటిని ఏకంగా 4.014 అంగుళాల (10.196 సెంటీమీటర్లు) మేర తెరిచి పురుషుల్లో అత్యధిక వెడల్పుతో నోరు బార్లా తెరిచిన వ్యక్తిగా నిలిచాడు. తన నోటి వెడల్పు సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు 4 మెక్‌డొనాల్డ్స్ చీస్ బర్గర్లను అవలీలగా నోట్లో పెట్టేసుకున్నాడు. అలాగే ఓ కోకాకోలా టిన్ను, పొడవాటి ప్రింగిల్స్ చిప్స్ టిన్ను నోట్లో పెట్టుకొని చూపించాడు. వాస్తవానికి 2019లో 3.67 అంగుళాల మేర నోటిని తెరిచి ఐశాక్ తొలుత గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అయితే అమెరికాకే చెందిన ఫిలిప్ ఆంగస్ అనే యవకుడు 3.75 అంగుళాల మేర నోటిని తెరిచి ఐశాక్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. దీంతో ఐశాక్ 2020లో జరిగిన పోటీలో తన నోటిని 4 అంగుళాల మేర తెరిచి మళ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు. తాజాగా మూడోసారి మరో రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నోరు తనకు ఉండటం.. మూడుసార్లు తాను గిన్నిస్ రికార్డు నెలకొల్పడం వింతగా అనిపిస్తోందని ఐశాక్ పేర్కొన్నాడు. -
అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది!
‘పులి బ్రష్ చేస్తుందా?’.. ఎవరైనా ముఖం శుభ్రం చేసుకోకుండా ఏదైనా తింటూ ఉండటాన్ని ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం అది. అయితే పులి కూడా కొన్ని చెట్ల మొదళ్లు, ప్రత్యేక మొక్కలకు తన దంతాలను రుద్ది శుభ్రం చేసుకుంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సృష్టిలో అన్ని రకాల జీవులూ వాటి పరిధిలో నోటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. కానీ తెలివి తేటలు ఉన్న మనిషి మాత్రం దంతాలను, నోటి శుభ్రతనూ నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ నెల 20న ‘నోటి ఆరోగ్య దినోత్సవం’. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి: World Sparrow Day: ఎక్కడున్నావమ్మా.. ఓ పిచ్చుకమ్మా..? కర్నూలు(హాస్పిటల్): నోట్లో ఉత్పత్తి అయ్యే బాక్టీరియా నుంచి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. పక్క వారు మాట్లాడేటప్పుడు వారి నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల సంగతి పక్కన పెడితే పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. పళ్లు, చిగుళ్లు నొప్పి, గొంతు నొప్పి, నాలుక మీద పాచి పేరుకుపోవడం, నోరు పొంగడం(వేడి చేయడం) తదితర సమస్యలతో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య అధికంగా మాట్లాడే వారిలో, నీటిని తక్కువగా తాగే వారిలోనూ, సరైన ఆహార నియమాలు పాటించని, జీర్ణాశయ సమస్యలున్న వారిలోనూ మరింత అధికంగా ఉంటుంది. కర్నూలు, దేవనకొండ, పత్తికొండ, ఆదోని, ఆస్పరి, నందికొట్కూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రజల పళ్లపై పచ్చని రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు పళ్లను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల పంటి చుట్టూ గార ఏర్పడి, చిగుళ్లకు ఇన్ఫెక్షన్స్ వచ్చి రక్తం కారుతూ, నొప్పి, దుర్వాసన వస్తూ ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి నోటిని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. పిప్పి పళ్లు ఉంటే తీసివేయకుండా డెంటల్ ఫిల్లింగ్ లేదా రూట్‌కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చిగుళ్లుకు మర్దన చేసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటించాలి. ఆల్కాహాలు, పాన్, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరు నెలలకోసారి దంత వైద్యున్ని సంప్రదించాలి. – డాక్టర్ పి.సునీల్ కుమార్‌రెడ్డి, దంత వైద్యనిపుణులు, కర్నూలు -
గొంతులో ఏదైనా ఇరుక్కుపోయిందా? పొరబోయిందా?
పలకాబలపాలతో బడికి పోయే వయసులోనూ, అంతకంటే చిన్నప్పుడు ఆడుకునే ఈడులో తెలిసీతెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు... కొందరు చిన్నారులు ముక్కులో బలపం/చిన్నచాక్పీస్/చిన్న పెన్సిల్ వంటివి పెట్టుకుని, అది లోనికి వెళ్లేలా పీల్చడం లాంటి పనులు చేస్తుంటారు. మరికొందరు నాణేలను నోట్లో పెట్టుకుని మింగడం వల్ల అవి గొంతులో ఇరుక్కుని బాధపడుతుంటారు. గొంతులో ఇరుక్కునే చిన్నవస్తువులు ఇంకా ఎన్నో! ఆహారం అలా ఇరుక్కుంటే పొరబోయిందంటూ మన ఇళ్లలోని పెద్దలు అంటుంటారు. అలా జరిగినప్పుడు కాసేపు బాధగా ఉండి... అది బయటకు తన్నేసినట్లుగా ఒక్కోసారి ముక్కులోంచి కూడా వస్తుంటుంది. ఇలా గొంతులో బయటి వస్తువులు ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ప్రథమచికిత్సలను తెలుసుకుందాం. ముక్కు... నోరు... ఈ రెండింటికీ కొంత దూరం. కానీ గొంతులో రెండిటి మార్గం కాసేపు ఒకటే. ఆ తర్వాత గాలి... విండ్‌పైప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకీ, ఆహారం ఫుడ్‌పైప్ ద్వారా కడుపులోకి వెళ్తుంది. గొంతులో గ్లాటిస్ అనే చోట ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన విండ్‌పైప్, ఆహారం తీసుకెళ్లే ఈసోఫేగస్ ఈ రెండూ మార్గాలూ ఒకేచోట ఉంటాయి. అయితే... ఇక్కడే ఎపిగ్లాటిస్ అనే పొర ఉండి... మనం గాలిని పీల్చుకుంటున్న సమయంలో విండ్‌పైప్ మాత్రమే తెరచి ఉండేలా చూసి... ఆహారనాళాన్ని మూసి ఉంచుతుంది. అలాగే ఆహారాన్ని మింగుతున్నప్పుడు ఆహారనాళమే తెరచి ఉండేలా చూసి, విండ్‌పైప్‌ను మూసేస్తుంది. (చదవండి: బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం...) అయితే ఒక్కోసారి మనం ప్రధానంగా నీళ్లూ లేదా ద్రవాహారాలు (కొన్నిసార్లు అన్నం వంటి ఘనాహారాలు కూడా) తీసుకునే సమయంలో అవి పొరబాటున విండ్వైప్లోకి వెళ్లిపోతాయి. దాంతో ఓ రక్షణాత్మకమైన చర్యలా... ఊపిరితిత్తుల్లోంచి గాలి ఫోర్స్‌గా బయటకు చిమ్ముకొచ్చినట్లుగా వస్తూ... ఆ పదార్థాలను బలంగా బయటికి నెట్టేస్తుంది. అలాగే చిన్నపిల్లలు తమ గొంతులో ఉండే పైప్ కంటే పెద్ద సైజులో ఉండే వస్తువులను తీసుకున్నప్పుడు అవి గొంతులోకి ఇరుక్కుపోతాయి. అప్పుడూ బలంగా దగ్గు, గాలి వచ్చినా... ఆ ఘన పదార్థలు గట్టిగా ఉండటంతో బయటకు నెట్టలేకపోతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... గొంతులో ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► నాలుగేళ్ల లోపు పిల్లలకు పెద్ద క్యారట్ ముక్కలు, పెద్దగా ఉండే నట్స్, బాగా గట్టిగా ఉండే చాక్లెట్లు, పెద్ద గింజలుండే పండ్లను పెట్టకూడదు. ఒకవేళ తినిపిస్తే... వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాక మాత్రమే ఇవ్వాలి లేదా క్యారట్ వంటి వాటిని తురిమి ఇవ్వాలి. వాటిని మెత్తగా నమిలి తినమని పిల్లలకు చెప్పాలి. ► చిన్నపిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని పిల్లలు విరగొట్టడం చాలా సాధారణం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి. అంటే వాటి విడిభాగాలు నోట్లోకి దూరనంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్న పూసల్లాంటి విడిభాగాలతో ఉండే బొమ్మలను పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు తప్పకుండా పక్కనే ఉండాలి. (గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!) ► పిల్లల ఉయ్యాలపై వేలాడదీసే రంగులరాట్నం వంటి బొమ్మలు వాళ్ల చేతికి అందనంత ఎత్తులో అమర్చాలి. ► పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ► చిన్నారులు తమ మెడలోని చైన్లను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున... బాగా సన్నటి చైన్లను, నెక్లేస్లను పిల్లల మెడలో వేయకూడదు. ► చిన్న పిల్లలు ఆడుకోడానికి నాణేలు, కాసులు ఇవ్వడం సరికాదు. గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి.. ► ఏదైనా వస్తువు మింగిన చిన్నారి బాగా గట్టిగా దగ్గుతున్నా / గట్టిగా ఏడుస్తున్నా / మాట్లాడగలుగుతున్నా వారికి అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్లనే మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ► పిల్లలు చాలా బలహీనంగా దగ్గుతున్నా / ఊపిరితీస్తున్నప్పుడు సన్నటి శబ్దం వస్తున్నా / ఏడుపుగాని, మాటగాని, గొంతులోంచి వచ్చే శబ్దంగాని చాలా బలహీనంగా ఉన్నా... వారు మింగిన వస్తువు గొంతులో బలంగా ఇరుక్కుపోయిందని తెలుసుకోవాలి. వస్తువు మింగిన చిన్నారి వయసు ఏడాదికి పైబడి ఉన్నప్పుడు వారికి ‘హీమ్లిచ్ మెనోవర్’ అనే ప్రథమ చికిత్సతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఏడాది లోపు పిల్లలకు... ► మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టిప్పుడు చిన్నారి తల కిందివైపునకు ఉండేలా చూడాలి. చేతులతో వీపుపై అకస్మాత్తుగా, బలంగా ఒత్తిడి కలిగించాలి. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను నడుము భాగం నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలించాలి. మన కాళ్ల ఒత్తిడికీ, చేతుల ఒత్తిడికీ పిల్లల పొట్ట ముడుచుకుపోవడం వల్ల... ఇరుక్కున్న వస్తువు పైకి ఎగబాకి, బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కలిగించే ఒత్తిడి పిల్లలను గాయపరచనంత మృదువుగా మాత్రమే ఉండాలి. ► చిన్నారులు ఏదైనా వస్తువు మింగినప్పుడు వాళ్ల పొట్టపై రుద్దకూడదు. దానివల్ల పొట్టలోపల గాయాలయ్యే అవకాశం ఉంది. ► ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వనప్పుడు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► మింగిన వస్తువు పిల్లల నోటి నుంచి బయటకు వచ్చే వరకు తినడానికి గాని, తాగడానికి గాని ఏమీ ఇవ్వవద్దు. తలపై తట్టకండి... ► గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొర పోయిందని, ఎవరో తలచుకుంటున్నారని అంటుంటారు. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై తడుతుంటారు. అయితే ఆ ఆహారం... కడుపులోకి దారితీసే ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం. కాబట్టి ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలి. గొంతులోకి రాగానే ఊసేయమని చెప్పాలి. అంతే తప్ప తలపై తట్టకూడదు. ► గొంతుకు ఏదైనా అడ్డం పడిందేమోనని అనుమానించినప్పుడు పిల్లలు తమ నాలుకను బాగా చాపేలా ప్రోత్సహించి, వేళ్లను గొంతులోకి పోనిచ్చి మన స్పర్శకు ఏవైనా తగులుతున్నాయేమో చూడాలి. వేళ్లకు ఏదైనా తగులుతుంటే మునివేళ్లతో వాటిని బయటకు తీసేయాలి. ఎలా తీస్తారు? ► పిల్లలు సహకరిస్తే... డాక్టర్లు లారింగోస్కోప్తో గొంతులో ఇరుక్కున్న పదార్థాన్ని తీసివేస్తారు. ఒకవేళ సహకరించకపోతే వారికి అనస్థటిక్ డాక్టర్ సహకారంతో కొద్దిగా మత్తు ఇచ్చి తొలగివంచవచ్చు. ► లారింగోస్కోప్ చేసి బల్బ్ ఉన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ అనే దాని సహాయంతోగానీ లేదా బ్రాంకోస్కోప్ అనే పరికరం సహాయంతగానీ ఇరుక్కున్నదాన్ని తీసివేయవచ్చు. హీమ్లిచ్ మెనోవర్ ఎలా? ► గొంతులో ఏదైనా ఇరుక్కుని బాధ పడుతున్నప్పుడు చిన్నారి వెనకవైపున మనం నిల్చోవాలి. మన రెండు చేతులను పిల్లల పొట్ట చుట్టూ బిగించి అకస్మాత్తుగా పట్టుబిగిస్తున్నట్లుగా ఠక్కున కదిలించాలి. క్రమంగా ఆ పట్టును... పొట్టపై కింది భాగం నుంచి పై వైపునకు కదల్చాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోపల ఒత్తిడి పెరిగి, అది క్రమంగా పైభాగానికి కదిలి అడ్డుపడిన పదార్థాన్ని బయటకు నేట్టేసే అవకాశం ఉంటుంది. దీన్నే హీమ్లిచ్ మెనోవర్ అంటారు. - డాక్టర్ జి. గంగాధర్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, విజయవాడ. -
అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!
దేశంలో బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత వీలైతే అంత దేశాల సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్ని అన్వేషిస్తున్నారు. సినిమా స్టైల్లో బంగారాన్ని తరలిస్తున్నారు.కొన్ని సార్లు అధికారులకు అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు విచిత్రంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. సినిమాల్లో బంగారాన్ని కడుపులో, లేదంటే తలపై విగ్గులో పెట్టుకొన్ని స్మగ్లింగ్ చేసే సన్నివేశాల్ని చూసే ఉంటాం. ఆ సన్నివేశాలు ఈ ఉబ్బెకిస్తాన్ గోల్డ్ స్మగ్లర్లు బాగా నచ్చినట్లన్నాయి. అందుకే తెలివిగా బంగారాన్ని నోట్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దుబాయ్ నుంచి వచ్చిన ఉజ్బెకిస్తాన్ స్మగ్లర్లను ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి వద్ద నుంచి సుమారు 951 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశారో తెలుసా? బంగారాన్ని పళ్ల సెట్ల తరహాలో డిజైన్ చేయించారు.ఆ సెట్ ను నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించగా..స్మగ్లింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నోట్లో బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో 'అంత బంగరాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. -
ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద నోరుతో వైరల్ అయిన టిక్‌టాక్ స్టార్ సమంత రామ్స్డెల్ (31) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కనెక్టికట్‌కు చెందిన సమంత 6.52 సెంటీమీటర్ల మేర విస్తరించగలిగే పెద్ద నోరుతో ప్రపంచంలోనే అతిపెద్ద నోరున్న మహిళగా గిన్నిస్ రికార్డుల కెక్కింది. దాదాపు ఒక పెద్ద యాపిల్ పట్టేంత వెడల్పుగా తన నోరును సాగదీయగలదు. అలాగే ఒక పెద్ద సైజు ప్యాకెట్లోని ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తంపట్టేస్తాయి. దీంతో సమంత మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమంత సరదాగా టిక్‌టాక్‌లో షేర్ చేసే వీడియోలు పాపులర్ కావడంతో అందరూ గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. ఈ ఐడియానే ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ తెచ్చిపెట్టింది. అమెరికాలోని కనెక్టికట్‌లోని సౌత్ నార్వాక్‌లోని డెంటిస్ట్ కార్యాలయానికి వెళ్లి మరీ అధికారులు కొలతలను తీసుకొని ధృవీకరించారు. ఆమె నోటి పొడవు, వెడల్పును లెక్కించి అతి పెద్ద నోరుగా డాక్టర్ ఎల్కే చెంగ్ ప్రకటించారు. తనకు చిన్నప్పటినుంచీ నోరు పెద్దదిగా ఉండేదని, దీంతో చాలా అవమానాలను ఎదుర్కొన్నానని "బిగ్ బాస్ నోరు" అంటూ ఎగతాళి చేసేవారని సమంత గుర్తు చేసుకుంది. కానీ ఇపుడు ఈ నోటితోనే రికార్డు సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. గత ఏడాది కరోనా సమయంలో టైం పాస్ కోసం, సృజనాత్మక, కామెడీ పోస్ట్‌లు చేయడం మొదలుపెట్టింది. ఫన్నీ వీడియోలు, ప్రత్యేకమైన కామెడీ పోస్ట్‌లతో క్రమంగా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం సమంతకు టిక్‌టాక్‌లో 1.7 మిలియన్లమంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాలో 84 వేలకు ఫోలోవర్లు ఉండటం విశేషం. తన పెద్ద నోరే ఇంతగొప్ప పేరు తెచ్చి పెట్టిందని లక్షలమంది కమెడీయన్లు, గాయకుల కంటే ఎక్కువ ఫేమ్ తెచ్చిపెట్టిందని, ఇలా అవుతుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. నిజానికి ఇది అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయింది. అంతేకాదు ఈ ప్రత్యేక టాలెంట్‌తోపాటు హాస్యం, సింగింగ్ కళను ఉపయోగించుకొని ఏదో ఒక రోజు తన సొంత షోను మొదలుపెట్టాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘నా లైఫ్ అంతా నా నోరు విషయంలో చాలా అభద్రతగా ఫీలయ్యాను. కానీ ఇపుడుదాన్నే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అతిపెద్ద లోపాన్ని గొప్ప ఆస్తిగా మార్చుకున్నాను. ఇది స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా..మీలో ఉన్న వైవిధ్యాన్ని చూసి భయపడొద్దు ఇతరులకంటే భిన్నంగా ఉన్నదాన్ని స్వీకరించండి. అదే మీ సూపర్ పవర్’ అంటూ సూచిస్తోంది. View this post on Instagram A post shared by Samantha Ramsdell (@samramsdell5) -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్‌గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
‘వ్యాక్సిన్ ఇలా ఇస్తే అద్భుత ఫలితాలు’
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు రూపొందించిన వివిధ రకాల వ్యాక్సిన్లను హ్యూమన్ ట్రైల్స్ చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లలో మూడో దశ వ్యాక్సిన్లను విన్నూతంగా రూపొందిస్తున్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులతో పాటు, రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తోంది. దీంతో చాలా సందర్భాలలో మనుషులు శ్వాస ఆడక మరణిస్తున్నారు. కాబట్టి మొదటే ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ వ్యాక్సిన్ అందించగలిగితే ఎలా ఉంటుందనే దానిపై సైంటిస్ట్‌లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ వైద్యులు ఈ తరహా ప్రయోగాలు చేశారు. ఇక ఈ పరీక్షలలో విజయవంతమైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీని గురించి అలబామా యూనివర్శిటీ నిపుణులు మాట్లాడుతూ, మిగిలిన వ్యాక్సిన్ల కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎక్కువ ఫలితాన్ని అందిస్తోంది. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని, ఒకవేళ వస్తే మాత్రం ఇది తప్పకుండా మంచి ఫలితాల్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: మరణాల్లో ముందున్న మహారాష్ట్ర -
ఇలా కరోనా వైరస్ రానే రాదట!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ తలుపుల హ్యాండిల్స్, ఇంటి తలుపుల హ్యాండిల్స్, మెట్ల రెయిలింగ్, కరెంటు స్విచ్చులు, టేబుల్ ఉపరితలాలు, టూ వీలర్ల హాండిల్స్, కారు స్టీరింగ్ తదితర ఉపరి తలాలను కరోనా రోగులు ముట్టుకున్నట్లయితే వాటిపై వైరస్ ఉండి పోతుందని, ఆ తర్వాత వాటిని ఇతరులు ముట్టుకున్నట్లయితే వారి చేతులకు వైరస్ అంటుకుంటుందని, ఆ చేతులతో ముక్కును, నోటిని లేదా కళ్లను తాకితే కరోనా వైరస్ సోకుతుందని తొలినాళ్లలో తెగ ప్రచారం అయింది. (చదవండి: జూలైకి 25 కోట్ల మందికి టీకా) అందువల్ల అట్టలు, కాగితాలు, రాగి ఉపరితలాలపై కరోనా వైరస్ నాలుగు గంటలపాటు, ప్లాస్టిక్‌పై ఏడు నుంచి 10 గంటల వరకు బతికి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. అందుకని ప్రజలు వార్తా పత్రికలను మాన్పించారు. పాల ప్యాకెట్లను డెటాల్‌తో కడగడం మొదలు పెట్టారు. ఆన్లైన్ పార్శల్స్ను ఒకటి, రెండు రోజుల పాటు ముట్టుకోకుండా దూరంగా ఉంచారు. ఇలా వస్తువుల ఉపరి తలాల వల్ల ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందదని, కరోనా రోగులకు సమీపంలోకి వెళ్లడం వల్ల వారి నోరు, ముక్కు నుంచి వచ్చే ఉఛ్వాస నిశ్వాసాల వల్ల, వాటి నుంచి వెలువడే తుంపర్ల వల్ల ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తోందని అమెరికాకు చెందిన ప్రాఫెసర్ గాంధీ అమెరికా సైన్స్ వెబ్సైట్ ‘నాటిలస్’కు తెలిపారు. (పది నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ!) కరోనా రోగులు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలను ముట్టుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఒక్క శాతం కన్నా తక్కువేనని గాంధీ తెలిపారు. అయితే ఈ అపోహల వల్ల ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునే మంచి అలవాటైతే ప్రజలకు అబ్బింది. అయితే చేతులు కడుక్కోవడం కన్నా ఇతరులకు భౌతిక దూరం పాటించడమే ఉత్తమమని ఆయన చెప్పారు. ఆయన తన అధ్యయన వివరాలను ‘లాన్సెట్’ జర్నల్‌కు వెల్లడించారు. (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం) -
మౌత్ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మరోవైపు ఈ మహమ్మారిని నిలువరించేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా దిగ్గజ ఫార్మా సంస్థలు తీవ్ర ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. తమ మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని ప్రకటించింది. మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్2 వైరస్‌ను క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. (9 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు) ఎంజైమాటికాకు చెందిన మౌత్ స్ప్రే ‘కోల్డ్‌జైమ్’ కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను 98.3 శాతం నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. అలాగే నోటి ద్వారా వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా ఇది నిరోధిస్తుందని ప్రకటించింది. తాజా అధ్యయనంలో కోవిడ్-19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నామని పేర్కొంది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన ధృవీకరించబడిన ల్యాబ్ అని ఎంజైమాటికా వివరించింది. కోల్డ్‌జైమ్ ఎలా పని చేస్తుంది? ప్రధానంగా గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన సొల్యూషన్‌తో నిండిన కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ పరీక్ష జరిగిందని కంపెనీ వెల్లడించింది. కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి స్ప్రే చేస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ పరీక్షలకు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడైందని ఎంజైమాటికా సీఈఓ క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్ ప్రకటించారు. -
పంటి మూలాన్ని మళ్లీ పెంచవచ్చు!
వయసు రీత్యా.. లేదంటే ప్రమాదాల కారణంగానో మనం కోల్పోయిన పళ్లు మళ్లీ పెరిగితే ఎలా ఉంటుంది? ఆహారాన్ని చక్కగా ఆస్వాదించడమే కాదు.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకమైన ముందడుగు పడింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త యాంగ్ చాయ్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడుమన పళ్ల మూలాలు (రూట్)ను పునరుజ్జీవింప చేయడం సాధ్యం కానుంది. ఇది కాస్తా మళ్లీ మళ్లీ పళ్లను పెంచుకునేందుకు దారితీస్తుందని అంచనా. పిప్పిపళ్ల సమస్య బాగా తీవ్రమైనప్పుడు మనం రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంటాం. దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ పన్ను వచ్చేందుకు అస్సలు అవకాశం ఉండదు. మొదలంటా శుభ్రం చేసి ఉండటం దీనికి కారణం. అయితే డీఎన్ఏలో మార్పులేవీ చేయకుండానే కొన్ని జన్యువులను నియంత్రించడం ద్వారా పంటి మూలాలను మళ్లీ అభివృద్ధి చేయవచ్చునని చాయ్ తదితరులు ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగారు. మన ముఖం ఎముకలు అభివృద్ధి చెందేందుకు ఈజెడ్హెచ్ 2 అనే ప్రొటీన్ ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినా.. పంటి రూట్ విషయంలో దీని పాత్ర ఏమిటన్నది పరిశీలించేందుకు చాయ్ తదితరులు ప్రయత్నం చేశారు. ఇంకో ప్రొటీన్ ఆరిడ్1ఏతో సమానంగా ఉంటే రూట్ వృద్ధి చెందేందుకు, దవడ ఎముకలతో రూట్స్ అనుసంధానమయ్యేందుకు వీలేర్పడుతోందని వీరు గుర్తించారు. అయితే నోట్లోని అన్ని రకాల పళ్లను కాకపోయినా సమీప భవిష్యత్తులో దవడ పళ్లను మళ్లీ మళ్లీ పెరిగేలా చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చాయ్ తెలిపారు. -
ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!
చెన్నై : కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేస్తోంది. అలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటుచేసుకంది. మాములుగా ఎవరికైనా నోటిలో 32 దంతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ చెన్నైకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడి నోటిలో 526 దంతాలు ఉన్నాయి. బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆ దంతాలను బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలుడి తల్లిదండ్రులు అతనికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే దవడ వాపు ఉండటాన్ని గమనించారు. అయితే అది అప్పుడు చిన్నగానే ఉండటంతో వారు అంతగా పట్టించుకోలేదు. ఆ బాలుడు కూడా వాపును చూపించడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ కాలం గడుస్తున్న కొద్ది దవడ వాపు పెరుగుతూ వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు బాలుడిని చెన్నైలోని సవిత డెంటల్ కాలేజ్‌కు తీసుకెళ్లారు. అసలు బాలుడికి దవడ ఎందుకు వాచిందో తెలుసుకోవడానికి వైద్యులు ఎక్స్‌రే, సీటీ స్కాన్ నిర్వహించారు. ఆ తర్వాత బాలుడి కుడి దవడ కింద భాగంలో సంచి మాదిరిగా ఉబ్బి ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దవడ భాగంలో దాగివున్న దంతాలను వైద్యులు బయటకు తీశారు. మొత్తం 200 గ్రాముల బరువున్న 526 దంతాలను వైద్యులు గుర్తించారు. ఈ దంతాలు రకరకాల సైజుల్లో ఉన్నట్టు తెలిపారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని.. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని సవిత డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ ప్రతిభ రమణి తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు. -
ముక్కు..సూటి మనిషి..
టర్కీకి చెందిన మెహ్మత్ నిజంగానే ముక్కుసూటి మనిషి.. మీకేమైనా డౌటా.. కావాలంటే ఆయన ముక్కును చూడండి.. ఎంత పొడవుగా ఉందో.. నోస్ బ్రిడ్జి నుంచి అంటే ముక్కును ముట్టుకుంటే మనకు ఎముక ఉన్నట్లు తగులుతుందే.. అక్కడి నుంచి చివరి వరకూ లెక్కేస్తే.. 3.46 అంగుళాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇంత పెద్ద ముక్కు మరెక్కడా చూడలేదంటూ గిన్నిస్ బుక్ వారు రికార్డును కట్టబెట్టేశారట. ఊరంత నోరు.. అంగోలాకు చెందిన ఫ్రాన్సిస్కోతో మాట్లాడటమంటే చాలా కష్టం. ఎందుకంటే.. ఆయన నోరు తెరిచాడంటే మన నోరు ఆటోమేటిగ్గా మూతపడిపోతుంది.. చూశారుగా.. ఆ నోరులో ఓ ఊరును సర్దేయొచ్చు. ఫ్రాన్సిస్కో నోరు తెరిస్తే.. 6.69 అంగుళాల వెడల్పు ఉందట. అయ్యబాబోయ్ అన్న గిన్నిసోళ్లు.. వెంటనే నోర్మూసుకుని.. రికార్డు ఆయన చేతికిచ్చి వెళ్లిపోయారట. -
22 కొవ్వొత్తుల వెలిగించి..అమాంతం నోట్లోకి..
-
నోట్లో కరెంటు వైరు పెట్టుకుని..
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం కోటనందూరు : అతడో ఎలక్ట్రీషియన్. ట్రాన్సఫార్మర్ వద్ద మరమ్మతులు చేసేందుకు ఉపక్రమించాడు. ఓ వైరు నోట్లో పెట్టుకుని, మరోదానికి కనెక్షన్ ఇచ్చేందుకు యత్నించాడు. విద్యుదాఘాతానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన కోటనందూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లిపూడికి చెందిన కొండ్రు సత్తిబాబు (35) గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పంచాయతీకి సంబంధించిన ఎలక్రికల్ సమస్యలు పరిష్కరిస్తుంటాడు. శుక్రవారం స్థానిక ఎస్సీ కాలనీ-1లో ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్యను పరిష్కరించేందుకు ట్రాన్సఫార్మర్ దిమ్మ ఎక్కాడు. ఒకవైరును నోట్లో ఉంచుకుని, మరో దానిని వేరే వైరుకు కలపడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సత్తిబాబును స్థానికులు కోటనందూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నం తరలిస్తుండగా, మార్గం మధ్యలో మరణించాడు. పీహెచ్సీలో సత్తిబాబు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాజా పరామర్శించారు. -
క్షణాల్లో బ్రష్ నోరంతా ఫ్రెష్
పళ్లుతోముకోవడం క్షణాల్లో చేసుకునే పనేనా.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఒకప్పటి కాలంలోనైతే తాపీగా ఏ వేపపుల్లనో తుంచుకుని, నోట్లో నములుతూ కుచ్చులా చేసుకుని ముచ్చట్లాడుతూ పళ్లుతోముకునే ప్రక్రియ పూర్తి చేసుకునే సరికి కనీసం పావుగంటైనా పట్టేది. టూత్‌బ్రష్‌లు, టూత్పేస్ట్లు అందుబాటులోకి వచ్చాక ఈ ప్రక్రియ ముగించడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతోంది. క్షణాల్లో బ్రష్ చేసుకోవడం ముగించేటట్లయితే, అసలు పళ్లు తోముకున్నట్లేనా.. అని సందేహిస్తున్నారా..? మీ సందేహాలన్నింటికీ సమాధానమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘బ్రిజిల్డెంట్’ టూత్‌బ్రష్. చూడటానికి చిత్రవిచిత్రంగా ఉంది కదూ! ఇదిలాగే ఉంటుంది. ఎందుకంటే, పలువరుస మూస ఆధారంగా దీన్ని తయారు చేస్తారు. ఈ రకమైన టూత్‌బ్రష్‌లు రెడీమేడ్‌గా దొరకవు. ఇవి టైలర్డ్ టూత్‌బ్రష్‌లు. ఎవరికి కావలసిన బ్రష్‌ను వారు ఆర్డర్‌పై తయారు చేయించుకోవాల్సిందే. స్కానింగ్ ద్వారా లేదా పలువరుస ఇంప్రింట్ తీసుకోవడం ద్వారా కచ్చితమైన కొలతలతో దీన్ని తయారు చేస్తారు. పలువరుస ముందు, వెనుకలకు. దంతాల సందులకు చేరేలా దీనికి బ్రిజిల్స్ ఉంటాయి. దీనిని 45 డిగ్రీల కోణంలో పల్వరుసకు తగిలించుకుని, నములుతున్నట్లుగా దవడలను గబగబా పది పదిహేనుసార్లు ఆడిస్తే చాలు. దంతాలన్నీ పూర్తిగా శుభ్రపడిపోతాయి. కచ్చితంగా చెప్పాలంటే, ఈ టూత్‌బ్రష్‌తో ఆరు సెకండ్లలోనే దంతధావన ప్రక్రియ ముగిసిపోతుంది. -
దూరవాసన
మాట మంచిదే కావచ్చు, అయినా అందరూ దూర దూరంగా తప్పించుకుని తిరుగుతుంటారు. ‘పాపం... మాట మంచిదే కానీ, నోరు మంచిది కాదు’ అనే వ్యాఖ్యలుచాటుమాటుగా వినిపిస్తూనే ఉంటాయి. బడికి వెళ్లే పిల్లలకు ఈ సమస్య ఉంటే, వారు నోరు విప్పి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే చాలు, తోటి పిల్లల నుంచి హేళనలు ఎదురవుతాయి. గృహిణులకు ఇదే సమస్య ఉంటే, వారుఎదురైతే చాలు సాటి అమ్మలక్కలు ఏదో అర్జంటు పని ఉన్నట్లు ముఖం తిప్పేసుకుంటారు. ఉద్యోగులకు ఈ సమస్య ఉంటే, కొలీగ్స్ దూరమవుతారు. తప్పనిసరిగా బాస్‌ను కలుసుకోవాల్సిన సందర్భాల్లో చిర్రుబుర్రులు ఎదురవుతాయి. ఒకవేళ బాస్కే ఈ సమస్య ఉంటే, ఉద్యోగుల ఇబ్బంది ఇక వర్ణనాతీతం. నోటి దుర్వాసన మాచెడ్డ సమస్య. దూరంగా వ్యాపించే వాసన మనిషి నుంచి మనిషిని దూరం చేస్తుంది. సాధారణ మానవ సంబంధాలనే కాదు, గాఢమైన మైత్రీబంధాలనూ దెబ్బతీస్తుంది. ఒక్కోసారి దంపతుల మధ్య విడాకులకూ దారితీస్తుంది. ఫలితంగా మానసికమైన కుంగుబాటుకు, అనవసరమైన అపరాధ భావనకు దారితీస్తుంది. చాలావరకు ఈ సమస్యను ఎవరికి వారే తేలికగా తెలుసుకోవచ్చు. నోటికి ఎదురుగా అరచెయ్యి పెట్టుకుని గాలి ఊదండి. పరిస్థితి అర్థమైపోతుంది. అరుదుగా కొందరిలో ఈ సమస్య ఉన్నా, వారికి ఆ విషయం తెలియదు. అలాంటి సమస్యతో మీ సన్నిహితులెవరైనా బాధపడుతుంటే, వారికి సున్నితంగా ఆ విషయాన్ని తెలిపి, వెంటనే వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించండి. నోటి దుర్వాసనను అధిగమించే మార్గాలను వివరించడానికే ఈ కథనం. ఇవీ సాధారణ కారణాలు నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి దుర్వాసనతో బాధపడేవారు డెంటిస్టు లేదా ఫిజీషియన్ వద్దకు వెళ్లాలి. సమస్య నిజంగానే ఉంటే వైద్యులు దానికి తగిన చికిత్స చేస్తారు. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలోని సర్వసాధారణ కారణాలు ఇవి... నోటిలో లాలాజలం తగ్గడం. వయసు మళ్లుతున్న కొద్దీ లాలాజలం తగ్గి నోటి దుర్వాసన వస్తుంది.ఒక్కోసారి కట్టుడు పళ్లు కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. రంధ్రాలు ఏర్పడిన పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు నోటి దుర్వాసనను కలిగిస్తాయి. నాలుకను సరిగా శుభ్రం చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నోటి దుర్వాసనను పెంచుతాయి. స్వీట్లు, నోటికి అంటుకుపోయే బేకరీ ఉత్పత్తులు వంటివి కూడా బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి నోటి దుర్వాసన కలిగిస్తాయి.జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ఫెటార్ హెపాటికస్’ అంటారు. ఈ పరిస్థితిలో మౄతదేహం నుంచి వెలువడే వాసన వస్తుంది. కొన్ని అరుదైన కారణాలు దీర్ఘకాలిక వ్యాధులు, మనం వాడే యాంటీబయోటిక్స్ వంటి కొన్ని అరుదైన కారణాలు కూడా నోటి దుర్వాసనను కలిగిస్తాయి.ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారికి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ. వారి రక్తంలో వెలువడే కీటోన్స్ అనే విషపదార్థాలు ఈ సమస్యను కలిగిస్తాయి.కీళ్లవాతానికి సంబంధించిన జ్వరం (రుమాటిక్ ఫీవర్) ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంది.ఊపిరితిత్తులకు గాయమైనా, ఊపిరితిత్తుల్లోకి దారితీసే వాయునాళాలు వ్యాకోచించినా నోటి దుర్వాసనకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ కండిషన్‌ను ‘బ్రాంకియాక్టాసిస్’ అంటారు.మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే, అవి రక్తంలోని అమోనియా వంటి వ్యర్థాలను సమర్థంగా వడపోయలేవు. అలాంటప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. రక్తకణాలకు సంబంధించిన హీమోఫీలియా, అప్లాస్టిక్ అనీమియా, రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం (థ్రాంబోసైటోపీనియా) వంటి వ్యాధులు ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన వస్తుంటుంది కొందరిలో ‘ట్రైమీథైల్ అమైన్’ అనే ఎంజైమ్ లోపించడం వల్ల నోటి నుంచి చేపల వాసన వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ‘ట్రైమీథైల్ మెన్యూరియా’ అని, వాడుక భాషలో ఫిష్ ఆడర్ సిండ్రోమ్ అని అంటారు. గుండెజబ్బులను నివారించే యాంటీ ఏంజినల్ డ్రగ్స్ వల్ల, మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చేసే డైయూరెటిక్స్ ఔషధాల వల్ల, కేన్సర్‌ను నిరోధించే మందుల వల్ల, రేడియేషన్ థెరపీ వల్ల, నిద్రమాత్రల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఔషధాలను వాడటం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి, నోరు పొడిబారిపోతుంది. దీన్నే ‘జీరోస్టోమియా’ అంటారు. అత్యంత అరుదుగా టాన్సిల్స్‌లో రాళ్లు ఏర్పడిన సందర్భాల్లో కూడా నోటి దుర్వాసన వస్తుంది.నోటి దుర్వాసన సమస్య సాధారణ బరువుతో ఉండేవారి కంటే స్థూలకాయుల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు గుర్తించారు. అందువల్ల బరువు తగ్గించుకోవడం ద్వారా కూడా పరిస్థితిని అదుపు చేయవచ్చు. నివారణ మార్గాలు ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. {పతిరోజూ రెండు పూటలా సక్రమంగా పళ్లు తోముకోవాలి, నాలుకను శుభ్రం చేసుకోవాలి.ఉల్లి, వెల్లుల్లి తింటున్నట్లయితే, వాటిలో ఉండే గంధకం వల్ల దాదాపు 48 గంటల సేపు నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల వీటి వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. కొందరికి నోటి దుర్వాసన ఉన్నా, ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. అలాంటప్పుడు వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు వారిని వైద్యుల వద్దకు తీసుకుపోయి, తగిన చికిత్స పొందేలా చేయాలి. ఆక్సిజన్ అందకపోయినా పెరిగే అనేరోబిక్ బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. అలాంటప్పుడు ఇంట్రాఓరల్ స్ప్రే (నోటిని తాజాగా ఉంచే స్ప్రే) వాడటం వల్ల సమస్యను నివారించుకోవచ్చు. జింక్, క్లోరిడాక్సిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆల్కహాల్ వంటి పదార్థాలు కలిగిన మౌత్‌వాష్‌లు కూడా సూక్ష్మ క్రిములను అరికట్టి, నోటిదుర్వాసనను నివారిస్తాయి.తరచుగా నీళ్లు తాగడం, సుగర్‌ఫ్రీ చూయింగ్‌గమ్స్ నమలడం కూడా నోటి దుర్వాసనను అరికడతాయి. అనుమానం పెనుభూతం నోటి దుర్వాసన లేకుండానే, ఉందేమోననే అనుమానంతో కొందరు తరచు వైద్యుల వద్దకు వెళుతుంటారు. ఇలాంటి వారు ఒక వైద్యుని సలహాతో తృప్తి పడకుండా, తరచు వైద్యులను మారుస్తుంటారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరమవుతుంది. అనుమానం మరీ తీవ్రంగా లేకపోతే, ఈ పరిస్థితి నివారణకు తేలికపాటి ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. ప్రత్యూష, కన్సల్టంట్ ఓరల్ ఫిజీషియన్ అండ్ కాస్సటిక్ డెంటిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యామ్నాయాలు యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను నమలడం. నోటిని తాజాగా ఉంచే బ్రిథనాల్ వంటి ఉత్పత్తులను వాడటం. టీ నుంచి సంగ్రహించే కొన్ని సహజ సిద్ధ పదార్థాలను వాడటం. చికిత్స అవసరమయ్యే పరిస్థితులు నోటి దుర్వాసనకు చికిత్స అవసరమయ్యే పరిస్థితులను టీఎన్1 నుంచి టీఎన్5 అని వైద్య నిపుణులు వర్గీకరించారు. వాటి వివరాలు... కేటగిరీ చికిత్స మార్గాలు టీఎన్-1 నోటి పరిశుభ్రత కోసం స్వీయ మార్గాలు టీఎన్-2 చిగుళ్ల సమస్య రాకుండా ముందుగానే చికిత్స తీసుకోవడం టీఎన్-3 ఫిజీషియన్ సహాయం తీసుకోవడం టీఎన్-4 దుర్వాసనకు కారణం గుర్తించి, నిపుణుల ద్వారా చికిత్స పొందడం టీఎన్-5 ఇది కేవలం అనుమానం మాత్రమే. దీనికి సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఫిజీషియన్లు చికిత్స చేస్తారు. -
నోరు మూసుకుంటే మంచిది : డీజీపి
-
ఆకలిరాజ్యం ఎపిసోడ్
-
మాటిమాటికీ నోరు తడారిపోతుంటే...
డాక్టర్ సలహా నాకు మాటిమాటికీ నోరు తడారిపోతోంది. ఎప్పుడూ దాహంగా ఉన్నట్లుగా అనిపిస్తూ, లాలాజలంతో నోరు తడిచేసుకోవాలనిపిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - నరేందర్, కరీంనగర్ మన నోటిలో ఊరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. సాధారణంగా ఈ లాలాజలం నోటిలో ఉండే ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఒకసారి మీరు డయాబెటిస్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇలా నోరు పొడిబారిపోవడాన్ని వైద్యపరిభాషలో ‘జీరోస్టోమియా’ అంటారు. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా గూడుకట్టినట్లుగా ఒకేచోట అమితంగా పెరిగిపోతాయి. దీన్నే కొలొనైజేషన్ అంటారు. ఇదే దుష్పరిణామం తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారిలోనూ కనిపిస్తుంటుంది. ఇలా నోరు పొడిబారిపోవడం చాలాకాలంపాటు అదేపనిగా కొనసాగితే నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినడం, నొప్పిరావడం మామూలే. ఫలితంగా దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే దంతవైద్యులను కలవాలి. చికిత్స: నోటిలో తగినంత లాలాజలం ఊరని రోగులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చికిత్సలు సూచిస్తారు. దాంతోపాటు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. ఇటీవల మార్కెట్లో అందుబాటులో ఉన్న చక్కెర లేని చూయింగ్ గమ్స్, చక్కెర లేని మింట్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది, ఆల్కహాల్‌ను మానితే మంచిది. మీరు ఒకసారి చక్కెరవ్యాధి నిర్ధారణకు చేయించే ఫాస్టింగ్ బ్లడ్, పోస్ట్ ప్రాండియల్ పరీక్షలు చేయించి మీ ఫిజీషియన్‌తో పాటు ఒకసారి దంతవైద్యుడిని కూడా కలవండి. - డా. నరేంద్రనాథ్ రెడ్డి, దంతవైద్య నిపుణులు, స్మైల్ మేకర్ డెంటల్ హాస్పిటల్ , హైదరాబాద్ -
సైగలేలనోయి...
స్టడీ మాట్లాడే వాళ్లలో రెండు రకాలు కనిపిస్తారు. కొందరు మాట్లాడుతున్నప్పుడు...నోరు మాత్రమే కదులుతుంది. ‘మాకేం పని’ అన్నట్లుగా ఉంటాయి మిగిలిన అవయవాలు. కొందరు మాట్లాడుతున్నప్పుడు....నోరు మాత్రమే కదలదు...చేతి వేళ్లు రకరకాల భంగిమలు పోతుంటాయి. ఏవో సంజ్ఞలను సూచిస్తుంటాయి. ఇది కేవలం అలవాటు మాత్రమేనా? ఇంకేమైనా ఉందా? వేలి సంజ్ఞలు, వాటి కదలికలు సామాన్యమేవీ కావు అంటున్నారు పరిశోధకులు. వేలి సంజ్ఞలు, కదలికలను కేవలం ‘అలవాటు’గా మాత్రమే చూడనక్కర్లేదని వాటి గురించి చెప్పడానికి ఎంతో ఉందని కూడా అంటున్నారు. మనిషి తెలివి, చురుకుదనం, వేలి సంజ్ఞలు, కదలికలకు మధ్య గల సంబంధాన్ని బెర్లిన్‌లోని హాంబోర్డ్ యూనివర్శిటీలోని పరిశోధకులు అధ్యయనం చేసి కొన్ని విషయాలు చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం... వేలి కదలికలకు, మన ఆలోచన సరళికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సైగలు, వేలి కదలికలు మన అంతఃచేతనలోని జ్ఞానాన్ని ప్రతిఫలిస్తాయి(అందుకేనేమో, యోగులు చేతివేళ్లతో విచిత్రంగా సంజ్ఞలు చేస్తుంటారు. కొందరు గాల్లో కూడా రాస్తుంటారు!) ఆలోచనల్లో అప్పటికప్పుడు మార్పు తేవడానికి కూడా చేతి కదలికలు, సంజ్ఞలు ఉపయోగపడతాయి. వేలి సంజ్ఞలకు జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే శక్తి ఉంటుంది. వేలి కదలికలు ఎక్కువగా ఉన్న పిల్లలలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మెదడు చురుకుదనానికి వేలి కదలికలు తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి. -
‘శ్వాస’ అందించరూ ప్లీజ్!
మెదడులో ఫంగస్ గొంతు ద్వారానే శ్వాస అరుదైన వ్యాధితోబాధపడుతున్న బాబు కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ముద్దులొలికే తమ కొడుకును చూసి సంతోషించే అదృష్టం లేకుండా పోయింది ఆ బాబు తల్లిదండ్రులకు. ఎనిమిది నెలల వయసులో ఉన్న కొడుకు ముచ్చట్లను చూసి తరించాల్సిన ఆ తల్లిదండ్రులు బాబు అవస్థను చూసి తట్టుకోలేకపోతున్నారు. అందరిలా ముక్కుతో కాకుండా గొంతులో ఏర్పాటు చేసిన కృత్రిమ నాళం ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలడు. తమ కొడుకును కాపాడుకునేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు. నేత కార్మికుల ఇంట కన్నీరు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన పవర్లూమ్ కార్మికుడు మధు, బీడీ కార్మికురాలు సుమలకు ఎనిమిది నెలల క్రితం ఓ బాబు (వర్షిత్) పుట్టాడు. ఒకమ్మాయి తర్వాత బాబు పుట్టడంతో తమ చిన్న కుటుంబం సాఫీగా సాగిపోతుందన్న సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు చిన్నారి జబ్బు గురించి తెలిసీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదు నెలల క్రితం బాబుకు జబ్బు చేయగా స్థానిక ఆసుపత్రి వైద్యులు తమకు కేసు అర్థం కావడంలేదన్నారు. దాంతో బాబుని తల్లిదండ్రులు సికింద్రాబాద్ (విక్రమ్‌పురి)లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెదడులో నీరు చేరిందని డాక్టర్లు చెప్పడంతో అందినకాడికి రూ.3లక్షలు అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. మెదడు నుంచి పొత్తి కడుపు వరకు స్టంట్ వేశారు. ఇంతటితో వారి సమస్య తీరలేదు. కృత్రిమ స్టంట్ కారణంగా బాబుకు మెదడులో ఫంగస్ ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కష్టసాధ్యమైంది. దీంతో గత డిసెంబర్లో మళ్లీ నగరానికి తీసుకొచ్చారు. వీరి దీనగాథను చూసి చలించిన రెయిన్బో ఆసుపత్రిలోని వైద్యుడు రమేశ్ తనవంతుగా ఉచిత చికిత్సను అందించడమే కాక, తనకు తెలిసిన వారి ద్వారా వీలైనంత వరకు ఆర్థిక సాయం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఉంచే స్తోమత లేకపోవడంతో సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలుడికి చికిత్స చేయిస్తున్నారు. ప్రతి రోజూ బాబును రెయిన్బో ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రత్యేకమైన ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు. రెయిన్బో డాక్టర్ల దాతృత్వంతో చికిత్స ఉచితంగానే అందుతున్నప్పటికీ మందులకు పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. ప్రతీరోజూ రూ.5వేల చొప్పున ఇంజక్షన్లు, మందులకు ఖర్చవుతోంది. ఇప్పటికీ కొందరు దాతలు ఇచ్చే సొమ్ముతోనే నెట్టుకొస్తున్నారు. మరో రెండు నెలల పాటు బాబుకు ఇదే చికిత్స కొనసాగిస్తే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశముందని డాక్టర్లు పేర్కొన్నట్లు బాబు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాబు వర్షిత్‌కు సాయం చేయాలనుకునే వారు సికింద్రాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు రమేశ్‌ను కానీ, బాబు తల్లిదండ్రులను 9247861602, 92916 91925 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
అవకాశం దొరికింది.
కడుపు నింపుకునేందుకు చక్కని అవకాశం దొరికింది. ఇప్పుడు వదిలేశామా మళ్లీ ఇలాంటి అవకాశం మాకు దక్కదని అనుకున్నాయో ఏమో ఎక్కడెక్కడినుంచి వచ్చిన పక్షులు తమ నోటికి పని పెట్టాయి. నగరంలోని ఓ ప్రాంతంలో మంగళవారం ధాన్యం తింటున్న చిలుకలు, పావురాళ్లు, ఓ ఉడుత