నోటిలో నాటే ఇంప్లాంట్స్‌... | A Brief Historical Perspective On Dental Implants | Sakshi
Sakshi News home page

నోటిలో నాటే ఇంప్లాంట్స్‌...

Published Sun, Nov 24 2024 10:46 AM | Last Updated on Sun, Nov 24 2024 10:46 AM

A Brief Historical Perspective On Dental Implants

ఎవరికైనా సరే ఏవైనా అవయవాలను కోల్పోతే అమర్చే బయటి కృత్రిమ అవయవాలను ‘ఇంప్లాంట్స్‌’ అనీ, అదే ఏ కారణాల వల్లనైనా దంతాలు  కోల్పోయిన వారికి అమర్చే కృత్రిమ దంతాలను డెంటల్‌ ఇంప్లాంట్స్‌ అంటారు. ఇటీవల ఈ కృత్రిమ అవయవాల విజ్ఞాన శాస్త్రమూ చాలా అభివృద్ధి చెందింది. ఆహారం తీసుకుంటేనే జీవితం. ఆ జీవితం కొనసాగడానికి ఉపయోగపడే ‘డెంటల్‌ ఇంప్లాంట్స్‌’ గురించి అవగాహన కోసమే ఈ కథనం. 

కొన్నిసార్లు కృత్రిమ దంతాలు అమర్చాలన్నా శరీర నిర్మాణ (అనాటమీ) పరంగా కొందరిలో వాటిని అమర్చడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇటీవల ‘డెంటల్‌ ఇంప్లాంటాలజీ’లో వచ్చిన పురోగతి వల్ల  పూర్తిగా స్వాభావికమైనవే అనిపించేలా, అందంగా కనిపించేలా రూపొందిన ఈ డెంటల్‌ ఇంప్లాంట్స్‌లో రకాలూ, అవసరాన్ని బట్టి అమర్చుకునే తీరు... మొదలైన అంశాలేమిటో చూద్దాం. 

జైగోమ్యాటిక్‌ ఇంప్లాంట్‌
పై పలువరసలో... అందునా ప్రధానంగా దవడ ప్రాంతంలో అమర్చడానికి ఉపయోగించే కృత్రిమదంతం ఇంప్లాంట్‌ను జైగోమ్యాటిక్‌ అంటారు. పైదవడలో అమరికకు అవసరమైనంత ఎముక లేక΄ోయినప్పటికీ దీన్ని అమర్చడం సాధ్యమవుతుంది. సంప్రదాయ కృత్రిమ దంతం కంటే ఇది చాలా మన్నికైనదీ, దాదాపుగా నేచురల్‌ పన్నులాగే ఉంటుంది. టెరిడోమ్యాటిక్‌ ఇంప్లాంట్స్‌ ఇక వీటిని మరింత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. 

ఎక్కడైతే జైగోమ్యాటిక్‌ కృత్రిమదంతాలు అమర్చడానికి వీలుకాదో, అక్కడ కూడా ఇవి తేలిగ్గా అమరిపోతాయి. అదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకాస్త ఎక్కువ వివరణ అవసరం. అదేమిటంటే... తలలో పై దవడ ఎముకకు కాస్త వెనకగా, ఇంకా వివరంగా చెప్పాలంటే సరిగ్గా కంటి ప్రాంతానికి, మెదడు అమరే ప్రాంతానికి  దిగువన ‘స్పీనాయిడ్‌ బోన్‌’ అనే ఎముక ఉంటుంది. 

దవడ ఎముక సరిపోనప్పుడు ఈ టెరిడోమ్యాటిక్‌ ఇంప్లాంట్స్‌ తాలూకు ‘వేళ్ల (రూట్స్‌)’ వంటివి ఈ ‘స్పీనాయిడ్‌ బోన్‌’లోకి వెళ్లేలా చేస్తారు. దీనికి కాస్త ఎక్కువ నైపుణ్యం అవసరం. ఇలా చేయడం వల్ల అవి మరింత స్థిరంగా, గట్టిగా అమరి΄ోతాయి. చాలామందిలో కృత్రిమ పన్ను అమరికకు తగినంత ఎముక సపోర్ట్‌ లేకపోతే ఇలా ‘స్పీనాయిడ్‌ బోన్‌’లోకి వెళ్లి నాటుకునేలా అమర్చేందుకు వీలైన కృత్రిమ దంతాలే ఈ ‘టెరిగాయిడ్‌ ఇంప్లాంట్స్‌’గా చెప్పవచ్చు. 

ఇక ఇవేకాకుండా పొట్టి రకాలూ, సన్నరకాలూ (షార్ట్‌ అండ్‌ న్యారో) అనే ఇంప్లాంట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పన్ను ఉండాల్సిన స్థానంలో సరిగ్గా ఇమిడిపోయే సౌకర్యం ఉన్నందున ఇటీవల ఇవి ఎక్కువగా ప్రాచుర్యం ΄పొందుతున్నాయి. అయితే డెంటల్‌ డాక్టర్లు ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్‌ దంతాలతోపాటు అవసరాన్ని బట్టి వాడుతుంటారు. ఇవన్నీ అక్కడి ఎముక మందం, అమర్చడానికి అవసరమైనంత ఎముక అందుబాటులో ఉందా లేదా అనే అంశాల మీద ఆధారపడి... ఆ ప్రదేశంలోని అవసరాలను బట్టి ఉపయోగిస్తుంటారు. 

గతంలో పోలిస్తే... అప్పుడు వీలుకాని అమరికలు సైతం ఈ తరహా కొత్త రకాల కృత్రిమ పళ్ల వల్ల సాధ్యమవుతోంది. కాబట్టి ఏవైనా ప్రమాదాలతోగానీ, ఇతరత్రాగానీ పళ్లు కోల్పోయినవారు ఇప్పుడు గతంలోలా బాధపడాల్సిన అవసరం లేదని డెంటల్‌ సర్జన్లు భరోసా ఇస్తున్నారు. రకాలు..  డెంటల్‌ ఇంప్లాంట్స్‌లో అనేక రకాలు ఉన్నప్పటికీ ఇటీవలి ఆధునిక పరిజ్ఞానంతో రూపొందిన వాటిల్లో జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్‌ అనేవి ప్రధానమైనవి. మామూలుగానైతే ఎవరికైనా కృత్రిమదంతం అమర్చాలంటే పైదవడలో గానీ, కింది దవడలో గానీ తగినంత ఎముక ఉండాలి. దీనికి ఉదాహరణ ఇలా చెప్పుకుందాం.

కాస్తంత పొడవైన ఓ స్క్రూ బిగించాల్సి ఉంటే, దాని వెనక తగినంత చెక్క ఉండాలి. అలా లేకపోతే స్క్రూ పూర్తిగా అమరదు. కొద్ది చెక్క సపోర్ట్‌ మాత్రమే ఉంటే స్క్రూ పూర్తిగా లోపలివరకూ వెళ్లకుండా చాలావరకు బయటే ఉండిపోతుంది. చాలామందిలో పై పలువరసకు స΄ోర్ట్‌గా ఎముక (మ్యాక్సిల్లరీ బోన్‌), కింది పలువరసకు ఎముక (మ్యాండిబ్యులార్‌ బోన్‌) చాలా కొద్దిగా మాత్రమే ఉండి, ఇలా కృత్రిమ ఇం΄్లాంట్‌ పన్ను అమర్చేందుకు వీలుగా ఉండకపోవచ్చు. ఇలాంటివారిలో సైతం అమర్చడానికి వీలయ్యేవే ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్‌ ఇంప్లాంట్‌లు.  

డా. వికాస్‌ గౌడ్, 
డెంటల్‌ సర్జన్‌ అండ్‌ ఇంప్లాంట్‌ స్పెషలిస్ట్‌ 

(చదవండి: ఈ వర్కౌట్‌లతో బెల్లీ ఫ్యాట్‌ మాయం..! సన్నజాజి తీగలా నడుము..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement