కొందరికి నోట్లో, నాలుక మీద పగుళ్ళు రావడం, దాంతో ఏవైనా వేడిపదార్థాలూ లేదా కారపు పదార్థాలు తిన్నప్పుడు మంట, బాధ కలుగుతుండటం చాలా సాధారణం. ఇలా నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడం తోపాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగ్జైటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇవి వచ్చినప్పుడు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారం పాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశమున్నందున డాక్టర్లు తగిన పరీక్షలు చేయించి, కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.
(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment