implants
-
నోటిలో నాటే ఇంప్లాంట్స్...
ఎవరికైనా సరే ఏవైనా అవయవాలను కోల్పోతే అమర్చే బయటి కృత్రిమ అవయవాలను ‘ఇంప్లాంట్స్’ అనీ, అదే ఏ కారణాల వల్లనైనా దంతాలు కోల్పోయిన వారికి అమర్చే కృత్రిమ దంతాలను డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు. ఇటీవల ఈ కృత్రిమ అవయవాల విజ్ఞాన శాస్త్రమూ చాలా అభివృద్ధి చెందింది. ఆహారం తీసుకుంటేనే జీవితం. ఆ జీవితం కొనసాగడానికి ఉపయోగపడే ‘డెంటల్ ఇంప్లాంట్స్’ గురించి అవగాహన కోసమే ఈ కథనం. కొన్నిసార్లు కృత్రిమ దంతాలు అమర్చాలన్నా శరీర నిర్మాణ (అనాటమీ) పరంగా కొందరిలో వాటిని అమర్చడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇటీవల ‘డెంటల్ ఇంప్లాంటాలజీ’లో వచ్చిన పురోగతి వల్ల పూర్తిగా స్వాభావికమైనవే అనిపించేలా, అందంగా కనిపించేలా రూపొందిన ఈ డెంటల్ ఇంప్లాంట్స్‌లో రకాలూ, అవసరాన్ని బట్టి అమర్చుకునే తీరు... మొదలైన అంశాలేమిటో చూద్దాం. జైగోమ్యాటిక్ ఇంప్లాంట్‌పై పలువరసలో... అందునా ప్రధానంగా దవడ ప్రాంతంలో అమర్చడానికి ఉపయోగించే కృత్రిమదంతం ఇంప్లాంట్‌ను జైగోమ్యాటిక్ అంటారు. పైదవడలో అమరికకు అవసరమైనంత ఎముక లేక΄ోయినప్పటికీ దీన్ని అమర్చడం సాధ్యమవుతుంది. సంప్రదాయ కృత్రిమ దంతం కంటే ఇది చాలా మన్నికైనదీ, దాదాపుగా నేచురల్ పన్నులాగే ఉంటుంది. టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్స్ ఇక వీటిని మరింత అడ్వాన్స్డ్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే జైగోమ్యాటిక్ కృత్రిమదంతాలు అమర్చడానికి వీలుకాదో, అక్కడ కూడా ఇవి తేలిగ్గా అమరిపోతాయి. అదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకాస్త ఎక్కువ వివరణ అవసరం. అదేమిటంటే... తలలో పై దవడ ఎముకకు కాస్త వెనకగా, ఇంకా వివరంగా చెప్పాలంటే సరిగ్గా కంటి ప్రాంతానికి, మెదడు అమరే ప్రాంతానికి దిగువన ‘స్పీనాయిడ్ బోన్’ అనే ఎముక ఉంటుంది. దవడ ఎముక సరిపోనప్పుడు ఈ టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్స్ తాలూకు ‘వేళ్ల (రూట్స్)’ వంటివి ఈ ‘స్పీనాయిడ్ బోన్’లోకి వెళ్లేలా చేస్తారు. దీనికి కాస్త ఎక్కువ నైపుణ్యం అవసరం. ఇలా చేయడం వల్ల అవి మరింత స్థిరంగా, గట్టిగా అమరి΄ోతాయి. చాలామందిలో కృత్రిమ పన్ను అమరికకు తగినంత ఎముక సపోర్ట్ లేకపోతే ఇలా ‘స్పీనాయిడ్ బోన్’లోకి వెళ్లి నాటుకునేలా అమర్చేందుకు వీలైన కృత్రిమ దంతాలే ఈ ‘టెరిగాయిడ్ ఇంప్లాంట్స్’గా చెప్పవచ్చు. ఇక ఇవేకాకుండా పొట్టి రకాలూ, సన్నరకాలూ (షార్ట్ అండ్ న్యారో) అనే ఇంప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పన్ను ఉండాల్సిన స్థానంలో సరిగ్గా ఇమిడిపోయే సౌకర్యం ఉన్నందున ఇటీవల ఇవి ఎక్కువగా ప్రాచుర్యం ΄పొందుతున్నాయి. అయితే డెంటల్ డాక్టర్లు ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ దంతాలతోపాటు అవసరాన్ని బట్టి వాడుతుంటారు. ఇవన్నీ అక్కడి ఎముక మందం, అమర్చడానికి అవసరమైనంత ఎముక అందుబాటులో ఉందా లేదా అనే అంశాల మీద ఆధారపడి... ఆ ప్రదేశంలోని అవసరాలను బట్టి ఉపయోగిస్తుంటారు. గతంలో పోలిస్తే... అప్పుడు వీలుకాని అమరికలు సైతం ఈ తరహా కొత్త రకాల కృత్రిమ పళ్ల వల్ల సాధ్యమవుతోంది. కాబట్టి ఏవైనా ప్రమాదాలతోగానీ, ఇతరత్రాగానీ పళ్లు కోల్పోయినవారు ఇప్పుడు గతంలోలా బాధపడాల్సిన అవసరం లేదని డెంటల్ సర్జన్లు భరోసా ఇస్తున్నారు. రకాలు.. డెంటల్ ఇంప్లాంట్స్‌లో అనేక రకాలు ఉన్నప్పటికీ ఇటీవలి ఆధునిక పరిజ్ఞానంతో రూపొందిన వాటిల్లో జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ అనేవి ప్రధానమైనవి. మామూలుగానైతే ఎవరికైనా కృత్రిమదంతం అమర్చాలంటే పైదవడలో గానీ, కింది దవడలో గానీ తగినంత ఎముక ఉండాలి. దీనికి ఉదాహరణ ఇలా చెప్పుకుందాం.కాస్తంత పొడవైన ఓ స్క్రూ బిగించాల్సి ఉంటే, దాని వెనక తగినంత చెక్క ఉండాలి. అలా లేకపోతే స్క్రూ పూర్తిగా అమరదు. కొద్ది చెక్క సపోర్ట్ మాత్రమే ఉంటే స్క్రూ పూర్తిగా లోపలివరకూ వెళ్లకుండా చాలావరకు బయటే ఉండిపోతుంది. చాలామందిలో పై పలువరసకు స΄ోర్ట్‌గా ఎముక (మ్యాక్సిల్లరీ బోన్), కింది పలువరసకు ఎముక (మ్యాండిబ్యులార్ బోన్) చాలా కొద్దిగా మాత్రమే ఉండి, ఇలా కృత్రిమ ఇం΄్లాంట్ పన్ను అమర్చేందుకు వీలుగా ఉండకపోవచ్చు. ఇలాంటివారిలో సైతం అమర్చడానికి వీలయ్యేవే ఈ జైగోమ్యాటిక్, టెరిడోమ్యాటిక్ ఇంప్లాంట్లు. డా. వికాస్ గౌడ్, డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: ఈ వర్కౌట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..! సన్నజాజి తీగలా నడుము..) -
అంధమైన వెలుగు
చికాగో వేదికగా అంధులకు చూపు తెప్పించేందుకు ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న తొలి ప్రయోగాలు బ్రియాన్ బసార్డ్ అనే వ్యక్తిపై జరుగుతున్నాయి. పదహారో ఏట అతడి ఎడమకన్ను పోయింది. ఎలాగోలా నెట్టుకొస్తుండగా 48వ ఏట అతడి రెండో కన్నూ దృష్టిజ్ఞానాన్ని కోల్పోయింది. వైర్డ్ మ్యాగజైన్ కథనం ప్రకారం... ఇలాంటి అంధుల మెదడులో అమర్చే కొన్ని చిప్స్, బయట ఉండే వైర్లెస్ ఉపకరణం సహాయంతో చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం చికాగో ట్రయల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు స్పెయిన్‌లోని మిగ్యుయెల్ హెర్నాండెజ్ యూనివర్సిటీ పరిశోధకులూ ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కార్టిజెంట్ అనే సంస్థ ‘ఓరియాన్’ అనే ఉపకరణాన్ని రూపోందించి, ఆరుగురు వలంటీర్లకు ప్రయోగాత్మకంగా అమర్చింది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘న్యూరాలింక్’ సంస్థ కూడా అంధులకు దృష్టిజ్ఞానం తెప్పించే దిశగా పనిచేస్తోంది. ఇందుకోసం బ్రెయిన్ ఇం΄్లాంట్స్ రూపోందించి ప్రయోగాలు చేస్తోంది. వాళ్ల దగ్గర తయారవుతున్న ఇంపాంట్కు ‘బ్లైండ్‌సైట్’ అని పేరు పెట్టారు. కోతులకు అమర్చిన ఈ ‘బ్లైండ్‌సైట్’తో మంచి ఫలితాలే వచ్చాయనీ, ఇకపైన దాన్ని మానవులపై ప్రయోగించి చూడాల్సిందే మిగిలి ఉందని ‘న్యూరాలింక్స్’ పేర్కొంది. అయితే చూడటం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాలపట్ల చాలామంది నిపుణుల నుంచి సందేహాత్మకమైన అభి్రపాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో దృష్టిజ్ఞానం ఉండి తర్వాత చూపు కోల్పోయిన వారికే ఈ ఇం΄్లాంట్స్ అమర్చుతున్నారు. అయితే ఈ బ్లైండ్‌సైట్ ఉపకరణం కేవలం గతంలో చూపున్న వారికి మాత్రమే కాకుండా పుట్టు అంధులకూ దృష్టిజ్ఞానం కలిగించగలదన్నది ఎలాన్ మస్క్ చెబుతున్న మాట. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తయారవుతున్న ఉపకరణాలన్నీ రెటీనా, ఆప్టిక్ నర్వ్ ప్రమేయం లేకుండానే నేరుగా మెదడుకు దృష్టిజ్ఞానం కలిగించేలా రూపోందుతున్నాయి. మెదడులో అమరుస్తున్న చిప్స్... కొన్ని విద్యుత్తరంగాలతో అక్కడి న్యూరాన్లను ఉత్తేజితం (స్టిమ్యులేట్) చేయడం... ఫలితంగా మెదడులోని విజువల్ కార్టెక్స్లో చూస్తున్న దృశ్యం ఒక చుక్కల ఇమేజ్‌లా కనిపిస్తుంది. (విజువల్ కార్టెక్స్ అంటే... రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా కాంతి మెదడుకు చేరాక దృష్టిజ్ఞానం కలిగించేందుకు మెదడులోప్రాంసెసింగ్ జరిగే మెదడులోని ప్రాంతం.అయితే ఇప్పుడిది ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో జరుగుతున్న ప్రక్రియ కావడంతో ఇందులో వాస్తవ కాంతి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగి΄ోతుంది. వీటి సాయంతో కనిపిస్తుందనే ఆ ఇమేజ్ కూడా అస్పష్టమైనది. ఆ డివైజ్ కారణంగా కనిపించే అస్పష్ట దృశ్యాలూ, దృష్టిజ్ఞానపు పరిమితులూ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం జరుగుతున్నవారికి ప్రతిరోజూ కొన్ని సూచనలివ్వడం జరుగుతోంది. ఉదాహరణకు వారు గుర్తిస్తున్నదేమిటీ, ఒకవైపు వెళ్లమన్న తర్వాత వారు ఆ దిశగా వెళ్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలేమిటన్న అంశాలను బట్టి... డివైస్‌లను మరింత మెరుగుపరిచేందుకు రోజూ ప్రయోగాలు జరుగుతున్నాయి. దృష్టిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరిచే దిశగా వారికి ఎదురవుతున్న సవాళ్లలో మరో అంశం ఏమిటంటే... ఒక పక్క దృష్టిజ్ఞానం కల్పిస్తూనే, ఈ స్టిమ్యులేషన్స్ వల్ల వారికి వేరే అనర్థాలు రాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉదాహరణకు... ఈ ఎలక్ట్రిక్ స్పందనలు మెదడులోని ప్రదేశాలకు తాకినప్పుడు అవి సీజర్స్, మూర్ఛ వంటివి వచ్చేలా మెదడును ప్రేరేపించకూడదు. కంటిన్యూవస్‌గా ఎలక్ట్రిక్ తరంగాలకు గురవుతున్నందు వల్ల మెదడులో స్కార్ ఏర్పడే అవకాశముందా, అప్పుడు మెదడుకు హానిచేయని విధంగా ఈ ఉపకరణాల రూపకల్పన ఎలా అన్న సవాలు కూడా మరో ప్రతిబంధకం. ప్రస్తుతానికి ఇలాంటి పరిమితులు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో చూపులేనివారికి దృష్టిజ్ఞానం కల్పించగలమనే నమ్మకం పెరుగుతోందన్నది పరిశోధకుల మాట.ఎలాన్ మస్క్ ట్వీట్ మా ‘బ్లైండ్‌సైట్’ ఇంప్లాట్స్ ఇప్పటికే కోతుల్లో బాగా పనిచేస్తోంది. మొదట్లో స్పష్టత (రెజెల్యూషన్) కాస్త తక్కువే. అంటే తొలినాళ్లలో వచ్చిన ‘నింటెండో గ్రాఫిక్స్’ మాదిరిగా. కానీ క్రమంగా మానవుల నార్మల్ దృష్టిజ్ఞానంలాగే ఉంటుంది. (ఇంకా ఏమిటంటే... ఈ న్యూరాలింక్ వల్ల ఏ కోతీ చనిపోలేదూ, ఇంకేకోతికీ హాని జరగలేదు).పైది ‘ఎక్స్’ (ట్వీటర్)లో 2024 మార్చి 21న ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్. -
డెంటల్ ఇంప్లాంట్స్‌కి పెరుగుతున్న ఆదరణ
డెంటల్ ఇంప్లాంట్స్ అంటే..? డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక టైటానియం మూలం. ఇది దంతంలేని స్థానంలో దంతాన్ని పోలిన ఆకారంలో అమర్చేందుకు అనువైనవి. డెంటల్ ఇంప్లాంట్స్ ఉపయోగాలు ఏమిటి? వివిధ రకమైన కట్టుడు పళ్లకు సపోర్టు ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఉదా॥క్రౌన్స్, ఇంప్లాంట్ మద్దతుగల బ్రిడ్జి, డెంచర్స్. ఉపయోగాలు: దంతం మొత్తం అనగా మూలభాగంతో సహా రీప్లేస్ చెయ్యవచ్చు పన్నులేని భాగంలో ఉన్న ఎముకని కాపాడవచ్చు. పాజిటివ్ డెంటల్ చికిత్స వలన కృత్రిమ దంతం సహజ దంతంలాగే కనబడుతుంది. ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు? వీటిని మూడు రకాలుగా విభజిస్తారు అవి. ఎపి ఆసియస్ ట్రాన్ఆసియన్ ఎంటోసియస్ ఎక్కువగా ఉపయోగించబడే పద్ధతి. ఇంప్లాంట్స్ అమర్పే పద్ధతి ఏమిటి? దవడ ప్రదేశంలో గ్రిహీత ఎముకలోకి ఒక మార్గదర్శక రంధ్రం చేయబడుతుంది. పాజిటివ్ డెంటల్‌లో విశాలమైన డ్రిల్లను క్రమంగా ఉపయోగించడం ద్వారా మార్గదర్శక రంధ్రాన్ని ఇంప్లాంట్ సైజుకు అనుకూలంగా విస్తరిస్తారు. ఎక్స్-రే ఆధారంగా ఎముక వెడల్పు, ఎత్తు దానికి అనుగుణంగా ఇంప్లాంట్ సైజును ఎన్నుకుంటారు. అందులో ఈ పైటానియం ఇంప్లాంట్‌ను అమర్చుతారు. దంతాన్ని తొలగించిన తర్వాత ఇంప్లాంట్ ఎప్పుడు అమర్చవచ్చు? తక్షణ స్థాపన పద్ధతి (Immediate loading) త్వరిత స్థాపన పద్ధ్దతి (దంతాన్ని తొలగించిన తర్వాత 2 వారాల - 3 నెలలలోగా) ఆలస్య స్థాపన పద్ధతి (3 నెలల తర్వాత) హైదరాబాద్: ఎస్.ఆర్.నగర్, దిల్సుఖ్నగర్, మాదాపూర్, కెపిహెచ్బి, నిజాంపేట, కర్నూల్ 9290909003