అంధమైన వెలుగు | Elon Musk Neuralink has put in its first human brain implant | Sakshi
Sakshi News home page

అంధమైన వెలుగు

Published Sat, Aug 3 2024 10:15 AM | Last Updated on Sat, Aug 3 2024 12:12 PM

Elon Musk Neuralink has put in its first human brain implant

మెదడులో అమర్చే ఇంప్లాట్స్‌ సహాయంతో దృష్టిజ్ఞానం

సమీప భవిష్యత్తులో సుసాధ్యం చేసేందుకు యత్నం 

కొన్ని టెక్నాలజీ ల్యాబ్స్, కొన్ని కంపెనీల సంయుక్త కృషి

చికాగో వేదికగా అంధులకు చూపు తెప్పించేందుకు ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహిస్తున్న తొలి ప్రయోగాలు బ్రియాన్‌ బసార్డ్‌ అనే వ్యక్తిపై జరుగుతున్నాయి. పదహారో ఏట అతడి ఎడమకన్ను పోయింది. ఎలాగోలా నెట్టుకొస్తుండగా 48వ ఏట అతడి రెండో కన్నూ దృష్టిజ్ఞానాన్ని కోల్పోయింది. వైర్డ్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం... ఇలాంటి అంధుల మెదడులో అమర్చే కొన్ని చిప్స్, బయట ఉండే వైర్‌లెస్‌ ఉపకరణం సహాయంతో చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కేవలం చికాగో ట్రయల్‌ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు స్పెయిన్‌లోని మిగ్యుయెల్‌ హెర్నాండెజ్‌ యూనివర్సిటీ పరిశోధకులూ ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కార్టిజెంట్‌ అనే సంస్థ ‘ఓరియాన్‌’ అనే ఉపకరణాన్ని రూపోందించి, ఆరుగురు వలంటీర్లకు ప్రయోగాత్మకంగా అమర్చింది. ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని ‘న్యూరాలింక్‌’ సంస్థ కూడా అంధులకు దృష్టిజ్ఞానం తెప్పించే దిశగా పనిచేస్తోంది. ఇందుకోసం బ్రెయిన్‌ ఇం΄్లాంట్స్‌ రూపోందించి ప్రయోగాలు చేస్తోంది. వాళ్ల దగ్గర తయారవుతున్న ఇంపాంట్‌కు ‘బ్లైండ్‌సైట్‌’ అని పేరు పెట్టారు. కోతులకు అమర్చిన ఈ ‘బ్లైండ్‌సైట్‌’తో మంచి ఫలితాలే వచ్చాయనీ, ఇకపైన దాన్ని మానవులపై ప్రయోగించి చూడాల్సిందే మిగిలి ఉందని ‘న్యూరాలింక్స్‌’ పేర్కొంది. 

అయితే చూడటం అనేది చాలా సంక్లిష్టమైన  ప్రక్రియ కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాలపట్ల చాలామంది నిపుణుల నుంచి సందేహాత్మకమైన అభి్రపాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో దృష్టిజ్ఞానం ఉండి తర్వాత చూపు కోల్పోయిన వారికే ఈ ఇం΄్లాంట్స్‌ అమర్చుతున్నారు. అయితే ఈ బ్లైండ్‌సైట్‌ ఉపకరణం కేవలం గతంలో చూపున్న వారికి మాత్రమే కాకుండా పుట్టు అంధులకూ దృష్టిజ్ఞానం కలిగించగలదన్నది ఎలాన్‌ మస్క్‌ చెబుతున్న మాట. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తయారవుతున్న ఉపకరణాలన్నీ రెటీనా, ఆప్టిక్‌ నర్వ్‌ ప్రమేయం లేకుండానే నేరుగా మెదడుకు దృష్టిజ్ఞానం కలిగించేలా రూపోందుతున్నాయి.  

మెదడులో అమరుస్తున్న చిప్స్‌... కొన్ని విద్యుత్తరంగాలతో అక్కడి న్యూరాన్లను  ఉత్తేజితం (స్టిమ్యులేట్‌) చేయడం... ఫలితంగా మెదడులోని విజువల్‌ కార్టెక్స్‌లో చూస్తున్న దృశ్యం ఒక చుక్కల ఇమేజ్‌లా కనిపిస్తుంది. (విజువల్‌ కార్టెక్స్‌ అంటే... రెటీనా నుంచి ఆప్టిక్‌ నర్వ్‌ ద్వారా కాంతి మెదడుకు చేరాక దృష్టిజ్ఞానం కలిగించేందుకు మెదడులోప్రాంసెసింగ్‌ జరిగే మెదడులోని 
ప్రాంతం.

అయితే ఇప్పుడిది ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో జరుగుతున్న ప్రక్రియ కావడంతో ఇందులో వాస్తవ కాంతి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగి΄ోతుంది. వీటి సాయంతో కనిపిస్తుందనే ఆ ఇమేజ్‌ కూడా  అస్పష్టమైనది. ఆ డివైజ్‌ కారణంగా కనిపించే అస్పష్ట దృశ్యాలూ,  దృష్టిజ్ఞానపు పరిమితులూ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం జరుగుతున్నవారికి ప్రతిరోజూ కొన్ని సూచనలివ్వడం జరుగుతోంది. ఉదాహరణకు వారు గుర్తిస్తున్నదేమిటీ, ఒకవైపు వెళ్లమన్న తర్వాత వారు ఆ దిశగా వెళ్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలేమిటన్న అంశాలను బట్టి... డివైస్‌లను మరింత మెరుగుపరిచేందుకు రోజూ ప్రయోగాలు జరుగుతున్నాయి. 

దృష్టిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరిచే దిశగా వారికి ఎదురవుతున్న సవాళ్లలో మరో అంశం ఏమిటంటే... ఒక పక్క దృష్టిజ్ఞానం కల్పిస్తూనే, ఈ స్టిమ్యులేషన్స్‌ వల్ల వారికి వేరే అనర్థాలు రాకుండా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఉదాహరణకు... ఈ ఎలక్ట్రిక్‌ స్పందనలు మెదడులోని ప్రదేశాలకు తాకినప్పుడు అవి సీజర్స్, మూర్ఛ వంటివి వచ్చేలా మెదడును ప్రేరేపించకూడదు. కంటిన్యూవస్‌గా ఎలక్ట్రిక్‌ తరంగాలకు గురవుతున్నందు వల్ల మెదడులో స్కార్‌ ఏర్పడే అవకాశముందా, అప్పుడు  మెదడుకు హానిచేయని విధంగా ఈ ఉపకరణాల రూపకల్పన ఎలా అన్న సవాలు కూడా మరో ప్రతిబంధకం. ప్రస్తుతానికి ఇలాంటి పరిమితులు కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో చూపులేనివారికి దృష్టిజ్ఞానం కల్పించగలమనే నమ్మకం పెరుగుతోందన్నది పరిశోధకుల మాట.

ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ 
మా ‘బ్లైండ్‌సైట్‌’ ఇంప్లాట్స్‌ ఇప్పటికే కోతుల్లో బాగా  పనిచేస్తోంది. మొదట్లో స్పష్టత (రెజెల్యూషన్‌) కాస్త తక్కువే. అంటే తొలినాళ్లలో వచ్చిన ‘నింటెండో గ్రాఫిక్స్‌’ మాదిరిగా.  కానీ క్రమంగా మానవుల నార్మల్‌ దృష్టిజ్ఞానంలాగే ఉంటుంది. 
(ఇంకా ఏమిటంటే... ఈ న్యూరాలింక్‌ వల్ల ఏ కోతీ చనిపోలేదూ, ఇంకేకోతికీ  హాని జరగలేదు).

పైది ‘ఎక్స్‌’ (ట్వీటర్‌)లో 2024 మార్చి 21న ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement