ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్‌లో అమర్చారు.
ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.
పక్షవాతంతో వీల్ ఛైర్‌కే
2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.
ఎన్1 అనే చిప్ సాయంతో
మెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.
Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy
— Elon Musk (@elonmusk) March 20, 2024
డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి
ఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్‌లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.
న్యూరాలింక్ అద్భుతం చేసింది
‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్
Comments
Please login to add a commentAdd a comment