Neuralink
-
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ప్రయోగం సక్సెస్
బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ రెండవ ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని, మొదటి సారి తలెత్తిన సమస్యలేవీ ఇప్పుడు ఎదురుకాలేదని కంపెనీ తెలిపింది.న్యూరాలింక్ మొదటి ఇంప్లాంట్‌ను నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి గత జనవరిలో అమర్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఇంప్లాంట్‌కు సంబంధించిన అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోడ్ వైర్లు మెదడు నుంచి బయటకు వచ్చాశాయి. ఫలితంగా మెదడు సంకేతాలను అంచనా వేయడంలో సమస్య ఏర్పడింది. తర్వాత దీన్ని పరిష్కరించినట్లు న్యూరాలింక్ పేర్కొంది. కాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లోనే న్యూరాలింక్‌కు ఈ సమస్య గురించి తెలుసని రాయిటర్స్ నివేదించింది.ఇలాంటి సమస్య రెండవ రోగిలో పునరావృతం కాకుండా నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో మెదడు కదలికను తగ్గించడంతోపాటు ఇంప్లాంట్, మెదడు ఉపరితలం మధ్య గ్యాప్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రెండవ రోగికి న్యూరాలింక్ ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. వీడియో గేమ్‌లు ఆడటానికి, త్రీడీ వస్తువులను ఎలా రూపొందించాలో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్ చిప్‌ను ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. -
మరో బిడ్డకు తండ్రైన మస్క్.. ఇదేమీ సీక్రెట్ కాదు
టెస్లా బాస్ ఇలాన్ మస్క్ (Elon Musk).. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో మరో బిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మస్క్ స్పందింస్తూ.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు.మా స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు. పత్రికా ప్రకటనను విడుదల చేయకాపోతే.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు. అయితే పుట్టిన బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అనే విషయాన్ని మస్క్ స్పష్టం చేయలేదు.ఇప్పటికే ఇలాన్ మస్క్‌కు ఇప్పటికే తన మొదటి భార్య జస్టిన్ మస్క్ ద్వారా ఐదుమంది, రెండో భార్య గ్రిమెస్ ద్వారా ముగ్గురు, షివోన్ జిలిస్ ద్వారా నలుగురు (ఈమెకు 2021లో కవలలు జన్మించారు).. ఇలా మొత్తం 12మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఇలాన్ మస్క్ 2022 జులైలో పెద్ద కుటుంబాలకే తన సపోర్ట్ తెలుపుతూ.. బ్రేవో టు బిగ్ ఫ్యామిలీస్ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎంతమంది పిల్లలతో సమయం గడపగలిగితే.. అంతమంది పిల్లలను కలిగి ఉండాలని, మంచి తండ్రిగా కూడా ఉండాలని గతంలో మస్క్ వెల్లడించారు. నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం.. తగ్గుతున్న జనన రేటు మస్క్ అప్పట్లోనే ట్వీట్ చేశారు. -
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్‌కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
ఇప్పటికే 11 మంది పిల్లలు.. ఇప్పుడు మరొకరు!
టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ తన సంతానం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 11 మంది పిల్లలకు తండ్రైన ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో మూడవ బిడ్డకు త్రండ్రి అయినట్ల బ్లూమ్‌బర్గ్ తాజా నివేదికలు చెబుతున్నాయి.టెక్నాలజీ, వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ జంట తమ కొత్త కుటుంబ సభ్యుల రాకను గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. మస్క్ ఇప్పటికే 2021 నవంబర్‌లో జిలిస్‌తో కవలలకు తండ్రి అయ్యారు. తన పిల్లల సంఖ్యను అధికారికంగా వెల్లడించనప్పటికీ ఆయనకు ఇప్పటివరకు 11 మంది పిల్లలు ఉన్నారన్నది బహిరంగంగా తెలిసిన విషయం.తాజా నివేదికపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జిలిస్ స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎలన్ మస్క్‌కు ఇప్పుడు కలిగిన సంతానంతో మొత్తం పిల్లల సంఖ్య 12కు చేరుతుంది. మస్క్‌కు సంగీతకారిణి గ్రిమ్స్‌తో ముగ్గురు, మాజీ భార్య, రచయిత జస్టిన్‌తో ఐదుగురు పిల్లలు ఉన్నారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్‌కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్ -
మెదడులో చిప్.. చెస్ ఆడించారు
ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ గర్వంగా ప్రకటించుకున్నారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి మైండ్ కంట్రోల్ చిప్ సాయంతో అతనితో చెస్ ఆడాడు. తద్వారా చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్‌కు చెందిన కంపెనీ న్యూరాలింక్ కార్పొరేషన్ అరుదైన ఫీట్ సాధించింది. ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చి.. అతని మైండ్ సాయంతో(Telepathically) ఆన్లైన్లో చెస్ ఆడిస్తూ అదంతా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. క్వాడ్రిప్లెజియా(కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన) పేషెంట్ అయిన నోలన్ అర్బాగ్ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్‌ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు అర్బాగ్. https://t.co/OMIeGGjYtG — Neuralink (@neuralink) March 20, 2024 Today, we might see the first human Neuralink patient controlling a phone and a computer with his brain. Neuralink to go live on 𝕏 at 2:30pm PST pic.twitter.com/vQxMem3ih7 — DogeDesigner (@cb_doge) March 20, 2024 ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. కంప్యూటర్ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్‌లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విజయం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లతో న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు. Neuralink's first ever patient demonstrating telekinetic abilities - controlling laptop, playing chess by thinking - using their implanted brain chip "Telepathy".#Neuralink #Telepathy #Telekinesis #Brainchip https://t.co/Qd7ZBdCPDK pic.twitter.com/uejICSs8R0 — Orders of Magnitude (@ordrsofmgnitude) March 21, 2024 2016లో బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ను ఎలన్ మస్క్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. వైకల్యాలున్న వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్. ఈ క్రమంలో న్యూరాలింక్ తయారు చేసిన ఈ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్‌ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చినట్లు.. అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తే ఈ నోలన్ అర్బాగ్. ఎలా పనిచేస్తుందంటే.. న్యూరాలింక్ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. న్యూరాలింక్ కంటే ముందే.. ఈ తరహా ప్రయోగాలు న్యూరాలింక్‌తో పాటు మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. న్యూరాలింక్ కంటే ముందే.. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. -
మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల!
న్యూరాలింక్ ఇటీవల మనిషి మెదడులో చిప్ అమర్చింది. ఆ చిప్ కలిగిన మనిషి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నట్లు, వారి ఆలోచనల ద్వారా కంప్యూటర్ మౌస్‌ను నియంత్రించగలుగుతున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) వెల్లడించారు. మెదడులో చిప్ కలిగిన వ్యక్తి పూర్తిగా కోలుకుంటున్నట్లు మాత్రమే కాకుండా.. పురోగతి కూడా కనిపిస్తోందని తెలిపారు. ఆ వ్యక్తి కేవలం ఆలోచించడం ద్వారా స్క్రీన్ చుట్టూ మౌస్ కదిలించగలడని, వీలైనన్ని ఎక్కువ మౌస్ బటన్ క్లిక్‌లను పొందడానికి ఇప్పుడు న్యూరాలింక్ ప్రయత్నిస్తోందని మస్క్ వెల్లడించారు. సెప్టెంబరులో హ్యూమన్ ట్రయల్ రిక్రూట్మెంట్ కోసం ఆమోదం పొందిన తర్వాత సంస్థ గత నెలలో మొదటిసారి మనిషి మెదడులో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. మెదడులోకి ఒక ప్రాంతంలో ఆపరేషన్ చేసి చిప్ అమర్చినట్లు వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ అమర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం ప్రజలు తమ ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ కర్సర్ లేదా కీబోర్డ్‌ను నియంత్రించేలా చేయడమే అని చెబుతున్నారు. అంతే కాకుండా నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఈ చిప్ మెరుగుపరిచే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఇలాన్ మస్క్ కల. దీని కోసం గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి కావాల్సిన అనుమతులు పొంది మెదడులో చిప్ అమర్చారు. ప్రస్తుతం ఇది సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. -
కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..?
కొత్త సంవత్సరంలో రాబోయే ఆసక్తికర అంశాల గురించి కృత్రిమమేధ ఏం చెబుతుందో వెతికే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా మనిషి శరీరానికి యంత్రాలు అమర్చే ప్రక్రియకు 2024 వేదిక అవుతుందని ‘గూగుల్ బార్డ్’ అంచనా వేసింది. దాంతో మానవులు అత్యంత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మెదడులో అమర్చే చిప్‌లతో కంప్యూటర్‌కు అనుసంధానం కాగలిగే టెక్నాలజీ రూపొందుతుందని పేర్కొంది. గూగుల్ బార్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. మనుషుల మెదడు–కంప్యూటర్ అనుసంధానికి వీలుకల్పించే ‘బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ)’లు అభివృద్ధి చెందుతాయి. దీని సాయంతో కృత్రిమ చేతులు, కాళ్లు వంటి అవయవాల (బయోనిక్ లింబ్స్)ను, ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి వీలవుతుంది. భారీ బరువులను ఎత్తడం, అత్యంత వేగంగా పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం, మిలటరీ ఆపరేషన్స్ వంటివి సాధ్యమవుతాయి. అవయవాలు కోల్పోయినవారు, పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితం గడపవచ్చు. మెదడు-కంప్యూటర్లు కలిసి సృజనాత్మకత, మేధోశక్తి పెరుగుతుందని గూగుల్ బార్డ్ ద్వారా తెలిసింది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ రూపొందించిన బ్రెయిన్ చిప్‌లను ఈ ఏడాదే మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలించనుంది. న్యూరాలింక్ అధునాతన ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్’ (బీసీఐ) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా దీనివల్ల ‘మానవాతీత శక్తి’ లభిస్తుందంటున్నారు. ఆయన ప్రణాళికల్లో సగం అమలైనా.. మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరతీస్తుంది. మన మెదడు.. శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల (న్యూరాన్లు) ద్వారా సంకేతాలను పంచుకుంటుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై, ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం ‘న్యూరాలింక్’ ప్రాజెక్టు ఉద్దేశం. దీని ద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. నేరుగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావొచ్చు. అలాగే నాడీ, కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు. -
వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు
Shivon Zilis:వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్, టెస్లా ,స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా తన ప్రత్యకతను చాటు కుంటున్నారు జిలిస్. అయితే బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ పుస్తకం రిలీజ్ కాబోతున్న తరుణంలో జిలిస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని జిలిస్ నివాసంలో తీసిన రైటర్ వాల్టర్ ఐజాక్సన్ కవల పిల్లలతో మస్క్ ,జిలిస్ ఫోటోలను షేర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలన క్రియేట్ చేసింది.అయితే ఈ జంట ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి (ఐవీఎఫ్) ద్వారా 2021లో నవంబరులో వీరికి జన్మనిచ్చారు. ఈ కవలల పేర్లు స్ట్రైడర్ (కొడుకు), అజూర్ (కుమార్తె) గా ఇటీవల వెల్లడైంది. దీంతో మస్క్ సంతానం తొమ్మిదికి చేరింది. ఏప్రిల్ 2022లో, కవలల పేర్లను మార్చాలని మస్క్, జిలిస్ ఒక పిటిషన్‌ను మే 2022లో టెక్సాస్ న్యాయమూర్తి ఆమోదించారు. మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. వీరితోపాటు సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే పిల్లలున్నారు. (రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?) షివోన్ జిలిస్ ఎవరు? ఎలాన్ మస్క్, జిలిస్ సంబంధం, అలాగే జిలిస్ గురించి చాలామందికి పెద్దగా తెలియదు. జిలిస్ కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో కె ఫిబ్రవరి 8, 1986న పంజాబీ భారతీయ తల్లి శారద , కెనడియన్ తండ్రి రిచర్డ్‌కి జన్మించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం IBMలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. 2015లో మస్క్ సహ-స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ OpenAIతో జిలిస్ మస్క్ మధ్య పరిచయం ఏర్పడింది. పలు మస్క్ కంపెనీలలో సీనియర్ పాత్రలలో పనిచేశారు. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016 జూలైలో మస్క్ స్థాపించిన న్యూరాలింక్, ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్ ఫేస్‌లను అభివృద్ధి చేసే న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పేరు పొందారు.ప్రస్తుతం న్యూరాలింక్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ OpenAI బోర్డు మెంబర్‌గాఉన్నారు. జిలిస్ ప్రత్యేకతలు ♦ 2015లో వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30కి ఎంపికయ్యారు. ♦ అవర్ లేడీ పీస్ అనే కెనడియన్ రాక్ బ్యాండ్ ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషీన్స్ అనే పుస్తకం తనకు ప్రేరణ అంటారు. కంప్యూటర్లు, మానవ మేథస్సును అథిగమిస్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మానవాళి , భవిష్యత్తు గురించి తనకు తెలిపిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా జిలిస్ తెలిపారు. అప్పటి నుండే కృత్రిమ మేధస్సు అధ్యయనంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. ♦ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్-టైమ్ బెస్ట్. ఆమె గిటార్ , డ్రమ్స్ కూడా ప్లే చేసేది. ♦ అంతేకాదు మస్క్ తండ్రి తండ్రి ఎర్రోల్ షివోన్పై ప్రశంసలు కురిపించాడు. 2022లో ఒక ఇంటర్వ్యూలోఆ ఆమో IQ 170 అని ప్రకటించడం విశేషం. కాగా స్టీవ్ జాబ్స్ , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ రాసిన మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మరి మస్క్ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. -
Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్
మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో ఎలాన్‌మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌కు అమెరికా రెగ్యులేటరీ కీలక అనుమతి లభించింది. ఈ విషయాన్ని న్యూరాలింక్ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీనిపై ట్విటర్లో అభినందనలువ వెల్లువెత్తుతున్నాయి. ఇదీ చదవండి: మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్ తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఎఫ్‌డీఏ మోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. చాట్‌జీపీటి కంటే మనుషులకు ఎక్కువ అవసర మైందంటూ ట్వీపుల్ వ్యాఖ్యానించారు. ఒక కొడుకుకు తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను. అభినందనలు అని ఒకరు, నా కొడుకు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఈ ఏడాదిలో ఉన్న అత్యుత్తమ వార్త అంటూ మరో వినియోగదారుడు న్యూరాలింక్‌ను అభినందించారు. అయితే మానవ మెదడు లోపల చిప్‌లను అమరిక, ప్రయోగాలపై వ్యతిరేక వ్యాఖ్యలున్నప్పటికీ ఈ ట్రయల్స్‌కు నన్ను ఎంచుకోండి అంటూ ఒక యూజర్ మస్క్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. I would like to be the first few people to get it I know all the risks and would sign anything needed 🙏 in 1999 I had a dream of a man that said he used neuralink to be in my dream he also told me about Starship it took 24 years to wait for this they are connected somehow… — Bradley P.R Gannon (@statehood101) May 25, 2023 @neuralink Congratulations on getting the FDA's approval! Hope the first-in-human clinical study goes better than the last time humans were used as test subjects for a first-in-human experiment. — Shing ha (@ReplyGPT) May 26, 2023 ఈ అద్భుత ప్రయోగంలో పాల్గొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను! అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. దాదాపు ఇదే ఆసక్తిని మరొకరు ప్రదర్శించగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్ కోసం రిక్రూట్మెంట్ ఇంకా మొదలు పెట్టలేదనీ, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తామని న్యూరాలింక్ సమాధాన మిచ్చింది. మరిన్ని ఇంట్రస్టింగ్వార్తలకోసం చదవండి సాక్షి బిజినెస్ -
మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, ముంబై: టెస్లా అధినేత మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ను (Chip In Brain) ప్రవేశ పెట్టే ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి అనుమతి లభించిందని ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇన్-హ్యూమన్ క్లినికల్ స్టడీకి సంబంధించి అనుమతో మరో చారిత్ర ప్రయోగానికి నాంది పడనుంది. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారిని వాలంటీర్లుగా ఎంపిక చేసి ప్రయోగాలు చేపట్టనుంది. ఇది ముఖ్యమైన ముందడుగు. తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఆమోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేసింది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) కాయిన్ సైజ్ (అంచనా) చిప్‌ను కోతుల మెదడులో అమర్చి ఇప్పటికే ప్రయోగాలు చేసింది సంస్థ. ఈ ఫలితాలతో రూపొందించిన నివేదికలను న్యూరాలింక్ కంపెనీ ఎఫ్‌డీఏ ముందుంచింది. వీటిని పరిశీలించిన రెగ్యులేటరీ బ్రెయిన్ చిప్ వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ ) కాగా గత ఏడాది డిసెంబర్లో న్యూరాలింక్ డివైస్ పరీక్షలకు సిద్ధంగా ఉందని మస్క్ వెల్లడించాడు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించాడు. కానీ మార్చి 2023లో భద్రతా ప్రమాదాల రీత్యా మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలపై న్యూరాలింక్ అభ్యర్థనను ఎఫ్‌డీఏ తిరస్కరించింది. పక్షవాతం, అంధత్వం వంటి తీవ్రమైన వ్యాధులకు బ్రెయిన్ చిప్ ద్వారా సాధ్యమవుతుందని న్యూరాలింక్ విశ్వసిస్తోంది. మెదడు ఇంప్లాంట్ మానవ పరీక్షల కోసం 2019 నుండి మస్క్ వెయిట్ చేస్తున్నాడు. ఏఐని తీవ్రంగా వ్యతిరేకించే మస్క్ దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే. (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) న్యూరాలింక్ న్యూరాలింక్ అనే న్యూరోటెక్నాలజీ కంపెనీని 2016లోమస్క్ స్థాపించాడు. మానవమెదడు, కంప్యూటర్లు లేదా ఇతర బాహ్య పరికరాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలా ఇంప్లాంటబుల్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను (BCIలు) అభివృద్ధి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో విలీనం చేయడం ద్వారా మానవ జ్ఞానాన్ని మెరుగుపరచడం , నాడీ సంబంధిత రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కోవడం. ఇలాంటి మరెన్నో విశేషమైన వార్తలు, అప్డేట్స్ కోసం సాక్షిబిజినెస్ చదవండి: Congratulations Neuralink team! https://t.co/AWZGf33UDr — Elon Musk (@elonmusk) May 26, 2023 -
ఎలాన్ మస్క్‌కు ఎఫ్‌డీఏ భారీ షాక్!
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ (బీసీఐ) స్టార్టప్ న్యూరాలింక్ కో-ఫౌండర్ ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. మనుషులపై చిప్ ఇంప్లాంట్ చేసే ట్రయల్స్ అనుమతుల్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిరాకరించింది. ‘చిప్ బ్యాటరీ సిస్టమ్, దాని ట్రాన్స్ డెర్మల్ ఛార్జింగ్ సామర్థ్యాల గురించి ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాటరీ విఫలమైతే రోగులకు ప్రమాదం. అయితే బ్యాటరీ విఫలం కావడానికి అవకాశం లేదు. వైఫల్యమైతే చుట్టుపక్కల కణజాలానికి నష్టం జరగకుండా నిరోధించడానికి తగిన చర్యలు ఉన్నాయనేలా హామీ ఇవ్వాలని’ ఎఫ్‌డీఏ న్యూరాలింక్‌ను కోరింది. ఎఫ్‌డీఏ లేవనెత్తిన మరొక ఆందోళన కరమైన విషయం ఏంటంటే? చిప్‌ను బ్రెయిన్ నుంచి తొలగించే సమయంలో మెదడులోని సున్నితమైన కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతింటే రోగి శరీరం రంగును మార్చేయడమే కాదు..మరణం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. పై అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్‌డీఐ న్యూరాలింక్ హ్యూమన్ ట్రయల్స్‌ను వ్యతిరేకించిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
Elon Musk: చిక్కుల్లో న్యూరాలింక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ సొంత కంపెనీ న్యూరాలింక్ చిక్కులను ఎదుర్కొబోతోందా?.. అవుననే అంటున్నాయి విదేశీ మీడియా సంస్థలు. మెడికల్ డివైస్ కంపెనీ అయిన న్యూరాలింక్ ద్వారా జంతువులపై ఘోరమైన ప్రయోగాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఫెడరల్ దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఫిర్యాదులు చేసింది న్యూరాలింక్‌లో పని చేసే ఉద్యోగులే కావొచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. మనిషి మెదడులో చిప్ అమర్చడం ద్వారా అద్భుతానికి తెర తీయాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నాడు. చిప్ ద్వారా పక్షవాతానికి గురైన వాళ్లు సైతం నడవొచ్చని, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రకటించుకున్నాడు కూడా. ఈ క్రమంలో.. ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్ ప్రకటిస్తూ వచ్చాడు. తాజాగా తన మెదడులో చిప్ అమర్చుకునేందుకు రెడీ అని ప్రకటించాడు కూడా. అయితే డెడ్‌లైన్స్‌ను చేరుకునే క్రమంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, జంతువులపై జరిగిన ప్రయోగాలు వాటికి నరకం చూపించాయని, లెక్కకు మించి జంతువుల మరణం కూడా సంభవించిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. 2018 నుంచి న్యూరాలింక్ చిప్ ప్రయోగాల పేరిట.. 280 గొర్రెలు, పందులు, ఎలుకలు, కోతులు, చిట్టెలుకలను చంపింది. వీటి మొత్తం సంఖ్య పదిహేను వందలకు పైనేనని రాయిటర్స్ లెక్క గట్టింది. అయితే.. నిర్లక్ష్య పూరితంగా జరిపిన నాలుగు ప్రయోగాలపై స్పష్టత ఇచ్చే యత్నం చేసింది సదరు కథనం. ఈ నాలుగు ప్రయోగాల ద్వారా 86 పందులు, రెండు కోతులు చనిపోయినట్లు తెలిపింది. అయితే.. ఫెడరల్ దర్యాప్తు ఇవే అంశాలపై జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు జంతువుల మరణాల సంఖ్యను కూడా ఏనాడూ న్యూరాలింక్ ప్రకటించింది లేదు కూడా. సుమారు ఏడాది కిందట న్యూరాలింక్ బ్రెయిన్లో చిప్ అమర్చిన ఓ కోతి కంప్యూటర్ గేమ్ ఆడిన వీడియోను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఎలాన్ మస్క్ సంచలనం, నా కొడుకు బ్రెయిన్లో ఈ చిప్‌ను అమర్చుతా?
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలోని హీరోకి చిప్‌ను అమర్చి అతని కదలికల్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తారో సేమ్ టూ సేమ్ అలాంటి టెక్నాలజీనే అందుబాటులోకి తేబోతున్నారు బిలియనీర్ ఎలాన్ మస్క్. ఈ ప్రాజెక్ట్ పట్ల మస్క్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎంతలా అంటే? అవసరం అయితే తన బ్రెయిన్లో, లేదంటే తన కొడుకు బ్రెయిన్లో చిప్‌ను అమర్చుకునేంత ధీమా ఉందన్నారు. ఎలాన్ మస్క్‌కు కృత్తిమ మేధపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవులకన్నా తెలివైంది. భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తోందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కొవడానికే న్యూరాలింక్ ప్రాజెక్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవుల మేధస్సును సామర్ధ్యాలను పెంచడానికి దోహద పడుతుందని, అందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి మస్క్ కీలక ప్రకటన చేశారు. మరో 6 నెలల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగాలను చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ ప్రైజెస్ టెక్నాలజీ పరిజ్ఞానంపై కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పక్షపాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నపూసలో అమర్చేందుకు వీలుగా చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండింటిలో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన ప్రయోగాలు జరిపేందుకు ఆహార,ఔషద నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు సమర్పించేందుకు అన్నీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలన్నీ సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పాటు చిప్‌ను అమర్చిన కోతి తనకు ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ మీద జస్ట్ మీ కళ్లతో అటూ ఇటూ చూస్తుంటే..మౌస్ కర్సర్ కదులుతుంది. అది ఏం టైప్ చేయాలనుకుంటుందే అదే టైప్ అవుతుంది. ఆ వీడియోను ప్రదర్శించారు. బ్రెయిన్లో చిప్‌ను అమర్చే ప్రయోగాల పట్ల నమ్మకంగా ఉన్నారు.చిప్‌ను నా బ్రెయిన్లో, నా కుమారుడి బ్రెయిన్లో అమర్చుకునేంతలా’ అనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
హవ్వా! ఎలన్ మస్క్.. అంతటా వేధింపులేనా?
వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఒకరు, మనిషి మెదడునే నియంత్రించేందుకు మరొకరు.. ప్రపంచంలోనే అపర కుబేరులుగా ఉన్న ఇద్దరి తాపత్రయం అంతిమంగా ఇవే. పోటాపోటీగా బెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ చేయిస్తున్న ప్రయోగాలు మామూలు జనాలకు వినోదాన్ని పంచుతూ ఆసక్తికరంగా అనిపించినా.. మేధావి వర్గం మాత్రం తీవ్రంగా విబేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్‌కి ఊహించని పరిణామం ఎదురైంది. మస్క్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ స్టార్టప్ ‘న్యూరాలింక్’.. ఈ ఏడాది దాదాపు మనుషుల మీద ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు కోసం పని చేసిన మాజీ ఉద్యోగులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పనికిమాలిన ప్రయోగమని, విఫలమై తీరుతుందని అంటున్నారు. అంతేకాదు న్యూరాలింక్లోనూ ఉద్యోగులపై వేధింపులు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. న్యూరాలింక్‌లో పని చేసిన ఆరుగురు మాజీ ఉద్యోగులు.. తాజాగా ఫార్చూన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు ఈ ప్రయత్నాలపై ఎలన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేడంటూ వాళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. న్యూరాలింక్ కోతులపై చూపించిన ప్రభావానికి.. మనుషులపై చూపించేదానికి బోలెడంత తేడా ఉంటుంది. ఆ విషయం ఆయనకు(మస్క్‌కు) తెలుసు. అసలు ఈ ఏడాది హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయన్నది కూడా దాదాపు అనుమానమే అంటూ వ్యాఖ్యానించారు వాళ్లు. వర్కింగ్ కల్చర్ బాగోలేదు| ఎలన్ మస్క్ బాస్‌గా ఉన్నచోట వర్క్‌కల్చర్ బాగోదని గతంలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోనూ ఆరోపణలు రావడం.. కోర్టు కేసులతో నష్టపరిహారం చెల్లించిన సందర్భాలను చూశాం. మేధో సంపత్తిని దోచేస్తున్నారంటూ టెక్ దిగ్గజ కంపెనీలపై విరుచుకుపడే ఎలన్ మస్క్.. ‘గురివింద గింజ’ తరహాలో ఆవిష్కరణల పేరుతో సొంత ఎంప్లాయిస్నే ఇబ్బంది పెడుతున్నాడనే దానిపై రియలైజ్ కాకపోవడం విడ్డూరం!. ఇప్పుడు సొంత కంపెనీ న్యూరాలింక్లోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ పని చేసేవాళ్లంతా భయంతో మాత్రమే పని చేస్తున్నారు తప్ప.. ఇష్టంతో కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీలు. పని గంటలు, విరామం లేకుండా వర్కింగ్ డేస్, వేతనం తక్కువ, కొన్ని విభాగాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు వినవస్తున్నాయి. అంతెందుకు 2021 మే నెలలో.. న్యూరాలింక్ సహ వ్యవస్థాపకులు మ్యాక్స్ హోడాక్ హఠాత్తుగా కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. కానీ, అందుకు గల కారణాల్ని వెల్లడించ లేదు. కానీ, మస్క్‌తో విభేధాలే అనే విషయం మొత్తం అమెరికా మీడియా కోడై కూస్తోంది. సంబంధిత వార్త: టెస్లాలో కామాంధులు? మస్క్ చేష్టల వల్లే రెచ్చిపోతూ.. నిత్యం నరకమే! -
ఇస్మార్ట్ శంకర్ కాదు.. ఇస్మార్ట్ ఎలన్ మస్క్ !
Neuralink Ready to implant chips On Human Brain: భవిష్యత్తును ముందే ఊహించగలగడం అందుకు తగ్గ సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు ఎలన్ మస్క్. అందువల్లే అనతి కాలంలోనే ప్రపంచ కుబేరుడిగా మారాడు. ఇప్పటికే టెస్లా, స్టార్లింక్లతో ఈవీ, స్పేస్ రంగాల్లో దూసుకుపోతున్న ఎలన్ మస్క్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై కన్నేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరహాలో మనిషి మెథడులో చిప్ అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. చేతులతో పని లేదు ఎలక్ట్రానిక్ చిప్‌తో మానవ మేథడును అనుసంధానం చేసే ప్రాజెక్టుని న్యూరాలింక్ పేరుతో ఎలన్ మస్క్ ఎప్పుడో ప్రారంభించారు. వందల కొద్ది శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. మానవ మేథతో అనుసంధానం అవగలిగే ఒ చిప్‌ను, అమర్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గతేడాది అందుబాటులోకి వచ్చింది. సింపుల్‌గా న్యూరాలింక్ గురించి వివరించాలంటే... ఎలక్ట్రానిక్ చిప్‌తో మెథడు అనుసంధానం అయితే.. మౌస్, కీబోర్డులతో పని లేకుండా చిప్ అమర్చిన ఆలోచనలకు తగ్గట్టుగా కంప్యూటర్ పని చేస్తుంది. ఫిజికల్‌గా కమాండ్స్ ఇవ్వకుండానే పనులు చేసుకోవచ్చు. భవిష్యత్తులో హెల్త్ సెక్టార్లో అనేక సమస్యలకు ఈ టెక్నాలజీతో పరిష్కారం చూపే వీలుందని ఎలన్‌మస్క్ అంటున్నారు. డైరెక్టర్ కోసం వేట న్యూరాలింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కోతిపై ఈ ప్రయోగాలు చేసిన మస్క్ టీం.. ఇప్పుడు మానవుల మీద క్లినికల్ ట్రయల్స్‌కి రెడీ అవుతోంది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ డైరెక్టరు పోస్టును భర్తీ చేయబోతున్నాడు ఎలన్ మస్క్. ఈ మేరకు శాస్త్రవేత్తలకు ఆహ్వానం పంపాడు. క్లినికల్ ట్రయల్స్ డైరెక్టర్ పదవిని ఆశించే వ్యక్తి అత్యుత్తమమైన డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు న్యూరాలింక్ ప్రాజెక్టులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుందని జాబ్ డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు. చదవండి: ఎలన్ మస్క్ మరో సంచలనం..! ఇక మనుషుల్ని ఆడించనున్నాడా?