ఇప్పటికే 11 మంది పిల్లలు.. ఇప్పుడు మరొకరు! | Elon Musk and Shivon Zilis secretly welcome third kid: Report | Sakshi
Sakshi News home page

Elon Musk: ఇప్పటికే 11 మంది పిల్లలు.. ఇప్పుడు మరొకరు!

Published Sun, Jun 23 2024 2:03 PM | Last Updated on Sun, Jun 23 2024 2:42 PM

Elon Musk and Shivon Zilis secretly welcome third kid: Report

టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ తన సంతానం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 11 మంది పిల్లలకు తండ్రైన ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో మూడవ బిడ్డకు త్రండ్రి అయినట్ల బ్లూమ్‌బర్గ్ తాజా నివేదికలు చెబుతున్నాయి.

టెక్నాలజీ, వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ జంట తమ కొత్త కుటుంబ సభ్యుల రాకను గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. మస్క్‌ ఇప్పటికే 2021 నవంబర్‌లో జిలిస్‌తో కవలలకు తండ్రి అయ్యారు. తన పిల్లల సంఖ్యను అధికారికంగా వెల్లడించనప్పటికీ ఆయనకు ఇప్పటివరకు 11 మంది పిల్లలు ఉన్నారన్నది బహిరంగంగా తెలిసిన విషయం.

తాజా నివేదికపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జిలిస్ స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎలన్ మస్క్‌కు ఇప్పుడు కలిగిన సంతానంతో మొత్తం పిల్లల సంఖ్య 12కు చేరుతుంది. మస్క్‌కు సంగీతకారిణి గ్రిమ్స్‌తో ముగ్గురు, మాజీ భార్య, రచయిత జస్టిన్‌తో ఐదుగురు పిల్లలు ఉన్నారు. న్యూరాలింక్‌ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement