![Elon Musk Welcomes His 12th Child He Says That is Not Secret](/styles/webp/s3/article_images/2024/06/25/elon-musk_1.jpg.webp?itok=qmMH2vGA)
టెస్లా బాస్ ఇలాన్ మస్క్ (Elon Musk).. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో మరో బిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మస్క్ స్పందింస్తూ.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు.
మా స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు. పత్రికా ప్రకటనను విడుదల చేయకాపోతే.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు. అయితే పుట్టిన బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అనే విషయాన్ని మస్క్ స్పష్టం చేయలేదు.
ఇప్పటికే ఇలాన్ మస్క్‌కు ఇప్పటికే తన మొదటి భార్య జస్టిన్ మస్క్ ద్వారా ఐదుమంది, రెండో భార్య గ్రిమెస్ ద్వారా ముగ్గురు, షివోన్ జిలిస్ ద్వారా నలుగురు (ఈమెకు 2021లో కవలలు జన్మించారు).. ఇలా మొత్తం 12మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఇలాన్ మస్క్ 2022 జులైలో పెద్ద కుటుంబాలకే తన సపోర్ట్ తెలుపుతూ.. బ్రేవో టు బిగ్ ఫ్యామిలీస్ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎంతమంది పిల్లలతో సమయం గడపగలిగితే.. అంతమంది పిల్లలను కలిగి ఉండాలని, మంచి తండ్రిగా కూడా ఉండాలని గతంలో మస్క్ వెల్లడించారు. నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం.. తగ్గుతున్న జనన రేటు మస్క్ అప్పట్లోనే ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment