అమెరికాలో నరమాంస భక్షకుడు! | US man walks around with severed human leg, onlookers say he is eating it | Sakshi
Sakshi News home page

అమెరికాలో నరమాంస భక్షకుడు!

Published Sun, Mar 24 2024 6:10 AM | Last Updated on Sun, Mar 24 2024 6:10 AM

US man walks around with severed human leg, onlookers say he is eating it - Sakshi

మనిషి కాలు తింటూ రోడ్లపై కలకలం

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తెగిపోయిన మనిషి కాలు చేతబట్టుకుని రోడ్డుపై తిరుగుతూ కలకలం రేపాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరలైంది. అందులో కాలిని అటూ ఇటూ ఊపుతూ, వీడియో తీస్తున్న వ్యక్తివైపు చూస్తూ ఉన్మాదిలా విరగబడి నవ్వుతూ కని్పంచాడతను. అప్పుడప్పుడు దాన్ని వాసన చూస్తూ, నోట్లో పెట్టుకుంటూ అందరినీ భయభ్రాంతులను చేశాడు.

‘దేవుడా! అతడా కాలిని తినేస్తున్నాడు’ అంటూ నేపథ్యంలో కొందరు హాహాకారాలు చేయడం కూడా వీడియోలో విన్పించింది. పట్టాలు దాటబోతూ రైలు ఢీకొని మరణించిన మహిళ తాలూకు తెగిపడిన కాలిని అలా చేతపట్టుకుని తిరిగినట్టు స్థానిక మీడియా వివరించింది. విషయం తెలిసి పోలీసులొచి్చనా అతను ఏమాత్రమూ బెదరకుండా కులాసాగా కని్పంచాడు. అతన్ని 27 ఏళ్ల రెసెండో టెలెజ్‌గా గుర్తించారు. మృతదేహపు కాలిని ఎత్తుకెళ్లి రైలు ప్రమాదం తాలూకు సాక్ష్యాధారాలను మాయం చేశాడన్న అభియోగాలపై అరెస్టు చేశారు. పోలీసులు తరలిస్తుండగా కూడా కెమెరాల వైపు చూస్తూ ఉత్సాహంగా చేతులూపుతూ కన్పించాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement