వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్ | Indian Woman With 38 Teeth Sets Guinness World Record | Sakshi
Sakshi News home page

వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? ప్రపంచ రికార్డ్ బ్రేక్

Nov 22 2023 1:26 PM | Updated on Nov 22 2023 1:26 PM

Indian Woman With 38 Teeth Sets Guinness World Record - Sakshi

సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు.  తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. 

కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు,  రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి.  అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు.  అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. 

ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్‌ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన  ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. 

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement