విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
కోటనందూరు : అతడో ఎలక్ట్రీషియన్. ట్రాన్‌సఫార్మర్ వద్ద మరమ్మతులు చేసేందుకు ఉపక్రమించాడు. ఓ వైరు నోట్లో పెట్టుకుని, మరోదానికి కనెక్షన్ ఇచ్చేందుకు యత్నించాడు. విద్యుదాఘాతానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన కోటనందూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లిపూడికి చెందిన కొండ్రు సత్తిబాబు (35) గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పంచాయతీకి సంబంధించిన ఎలక్రికల్ సమస్యలు పరిష్కరిస్తుంటాడు.
శుక్రవారం స్థానిక ఎస్సీ కాలనీ-1లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సమస్యను పరిష్కరించేందుకు ట్రాన్‌సఫార్మర్ దిమ్మ ఎక్కాడు. ఒకవైరును నోట్లో ఉంచుకుని, మరో దానిని వేరే వైరుకు కలపడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సత్తిబాబును స్థానికులు కోటనందూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నం తరలిస్తుండగా, మార్గం మధ్యలో మరణించాడు. పీహెచ్‌సీలో సత్తిబాబు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాజా పరామర్శించారు.
నోట్లో కరెంటు వైరు పెట్టుకుని..
Published Sat, Jul 9 2016 3:44 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement
Advertisement