
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు రూపొందించిన వివిధ రకాల వ్యాక్సిన్లను హ్యూమన్ ట్రైల్స్ చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్‌లలో మూడో దశ వ్యాక్సిన్‌లను విన్నూతంగా రూపొందిస్తున్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులతో పాటు, రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తోంది. దీంతో చాలా సందర్భాలలో మనుషులు శ్వాస ఆడక మరణిస్తున్నారు.
కాబట్టి మొదటే ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ వ్యాక్సిన్ అందించగలిగితే ఎలా ఉంటుందనే దానిపై సైంటిస్ట్‌లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ వైద్యులు ఈ తరహా ప్రయోగాలు చేశారు. ఇక ఈ పరీక్షలలో విజయవంతమైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీని గురించి అలబామా యూనివర్శిటీ నిపుణులు మాట్లాడుతూ, మిగిలిన వ్యాక్సిన్ల కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎక్కువ ఫలితాన్ని అందిస్తోంది. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని, ఒకవేళ వస్తే మాత్రం ఇది తప్పకుండా మంచి ఫలితాల్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: మరణాల్లో ముందున్న మహారాష్ట్ర
Comments
Please login to add a commentAdd a comment