
టర్కీకి చెందిన మెహ్మత్ నిజంగానే ముక్కుసూటి మనిషి.. మీకేమైనా డౌటా.. కావాలంటే ఆయన ముక్కును చూడండి.. ఎంత పొడవుగా ఉందో.. నోస్ బ్రిడ్జి నుంచి అంటే ముక్కును ముట్టుకుంటే మనకు ఎముక ఉన్నట్లు తగులుతుందే.. అక్కడి నుంచి చివరి వరకూ లెక్కేస్తే.. 3.46 అంగుళాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇంత పెద్ద ముక్కు మరెక్కడా చూడలేదంటూ గిన్నిస్ బుక్ వారు
రికార్డును కట్టబెట్టేశారట.
ఊరంత నోరు..
అంగోలాకు చెందిన ఫ్రాన్సిస్కోతో మాట్లాడటమంటే చాలా కష్టం. ఎందుకంటే.. ఆయన నోరు తెరిచాడంటే మన నోరు ఆటోమేటిగ్గా మూతపడిపోతుంది.. చూశారుగా.. ఆ నోరులో ఓ ఊరును సర్దేయొచ్చు. ఫ్రాన్సిస్కో నోరు తెరిస్తే.. 6.69 అంగుళాల వెడల్పు ఉందట. అయ్యబాబోయ్ అన్న గిన్నిసోళ్లు.. వెంటనే నోర్మూసుకుని.. రికార్డు ఆయన చేతికిచ్చి వెళ్లిపోయారట.
Comments
Please login to add a commentAdd a comment