
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్‌గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..)
గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment