
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ తలుపుల హ్యాండిల్స్, ఇంటి తలుపుల హ్యాండిల్స్, మెట్ల రెయిలింగ్, కరెంటు స్విచ్చులు, టేబుల్ ఉపరితలాలు, టూ వీలర్ల హాండిల్స్, కారు స్టీరింగ్ తదితర ఉపరి తలాలను కరోనా రోగులు ముట్టుకున్నట్లయితే వాటిపై వైరస్ ఉండి పోతుందని, ఆ తర్వాత వాటిని ఇతరులు ముట్టుకున్నట్లయితే వారి చేతులకు వైరస్ అంటుకుంటుందని, ఆ చేతులతో ముక్కును, నోటిని లేదా కళ్లను తాకితే కరోనా వైరస్ సోకుతుందని తొలినాళ్లలో తెగ ప్రచారం అయింది. (చదవండి: జూలైకి 25 కోట్ల మందికి టీకా)
అందువల్ల అట్టలు, కాగితాలు, రాగి ఉపరితలాలపై కరోనా వైరస్ నాలుగు గంటలపాటు, ప్లాస్టిక్‌పై ఏడు నుంచి 10 గంటల వరకు బతికి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. అందుకని ప్రజలు వార్తా పత్రికలను మాన్పించారు. పాల ప్యాకెట్లను డెటాల్‌తో కడగడం మొదలు పెట్టారు. ఆన్‌లైన్ పార్శల్స్‌ను ఒకటి, రెండు రోజుల పాటు ముట్టుకోకుండా దూరంగా ఉంచారు. ఇలా వస్తువుల ఉపరి తలాల వల్ల ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందదని, కరోనా రోగులకు సమీపంలోకి వెళ్లడం వల్ల వారి నోరు, ముక్కు నుంచి వచ్చే ఉఛ్వాస నిశ్వాసాల వల్ల, వాటి నుంచి వెలువడే తుంపర్ల వల్ల ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తోందని అమెరికాకు చెందిన ప్రాఫెసర్ గాంధీ అమెరికా సైన్స్ వెబ్‌సైట్ ‘నాటిలస్’కు తెలిపారు. (పది నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ!)
కరోనా రోగులు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలను ముట్టుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఒక్క శాతం కన్నా తక్కువేనని గాంధీ తెలిపారు. అయితే ఈ అపోహల వల్ల ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునే మంచి అలవాటైతే ప్రజలకు అబ్బింది. అయితే చేతులు కడుక్కోవడం కన్నా ఇతరులకు భౌతిక దూరం పాటించడమే ఉత్తమమని ఆయన చెప్పారు. ఆయన తన అధ్యయన వివరాలను ‘లాన్‌సెట్’ జర్నల్‌కు వెల్లడించారు. (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం)
Comments
Please login to add a commentAdd a comment