ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్‌లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్‌లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్‌లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్‌లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.
Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024
అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్‌తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment