ప్రేమించి, పారిపోయి పెళ్లి.. అక్క తల నరికి సెల్ఫీ దిగిన తమ్ముడు | Girl Beheaded For Eloping By BrotherMother In Maharashtra | Sakshi
Sakshi News home page

Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని

Published Mon, Dec 6 2021 3:23 PM | Last Updated on Mon, Dec 6 2021 6:47 PM

Girl Beheaded For Eloping By BrotherMother In Maharashtra - Sakshi

ముంబై: సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఇంకా కొందరు అనాగరికంగానే ప్రవర్తిస్తున్నారు. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో రక్తం పంచుకొని పుట్టిన వారిపైనే జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రేమించి పారిపోయి పెళ్లిచేసుకుందనే ఆక్రోశంతో గర్భిణీ అయిన తోబుట్టువునే హతమర్చాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

ఔరంగబాద్‌ జిల్లాకు 19 ఏళ్ల కీర్తి థోర్‌ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో వారిని ఎదురించి ఈ జూన్‌లో పారిపోయి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం గర్భవతి అయిన యువతి వైజాపూర్‌లో భర్తతో కలిసి జీవిస్తోంది. ఇటీవల తల్లి తన కూతురు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లింది. ఈ ఆదివారం(డిసెంబర్‌5) మరోసారి  తన మైనర్‌ కొడుకుని వెంట పెట్టుకొని కూతురు ఇంటికి వచ్చింది. అత్తగారితో కలిసి పొలంలో పని చేస్తున్న కీర్తి.. తన తల్లీ, తమ్ముడిని చూసి పొలంలో పని వదిలేసి ఆనందంతో పరుగెత్తుకొచ్చి వారిని పలకరించింది. ఇద్దరికీ నీళ్ళు ఇచ్చి, టీ చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. 
చదవండి: రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి

ఆ సమయంలో అల్లుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతను వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన తల్లి, తమ్ముడు కోసం కీర్తి తీ తయారు చేస్తుండగా .. అక్కపై వెనక నుంచి తమ్ముడు దాడి చేశాడు. తల్లి కూడా కీర్తి కాళ్లు అదిమి పట్టుకొని కొడుక్కి సాయం చేసింది. దీంతో తనవెంట తెచ్చుకున్న పదునైన కొడవలితో గర్భవతి అని కూడా కనికరం లేకుండా దారుణంగా తలను నరికివేశాడు.  రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. 

అయితే వంటింట్లో పాత్రలు పడిపోతున్న శబ్దం విని అనారోగ్యంతో పడుకున్న నిద్రలేచిన మహిళ భర్త  వంటగదిలోకి పరుగెత్తాడు. నిందితుడు తన బావను కూడా చంపడానికి ప్రయత్నించగా.. అతను తప్పించుకున్నాడు. తరువాత తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. చేతులో తలను పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి చూపుతూ స్థానికులకు భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం నిందితుడు తన తల్లితో కలిసి విర్గావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. 
చదవండి: కూతురి తల నరికిన తండ్రి.. ఆపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement