
పత్రికాత్మక చిత్రం
సాక్షి, లక్నో : ఓ ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్(ఈటీఎమ్) పేలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో యూపీ ఆర్టీసీ కండక్టర్ నేత్రాపాల్ తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈటీఎమ్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదని, బస్సులో ప్రయాణీకులున్నప్పటికీ కండక్టర్‌కు మాత్రమే గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ఈటీఎమ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.