ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ.. | Brussels Airport Reopens With Three Flights, Tighter Security | Sakshi
Sakshi News home page

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

Published Sun, Apr 3 2016 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..

బ్రస్సెల్స్: దాదాపు పది రోజుల అనంతరం తిరిగి బ్రస్సెల్స్ విమానాశ్రయం తెరుచుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుసగా రెండు శక్తిమంతమైన బాంబులు పేల్చిన అనంతరం తాత్కాలికంగా మూతవేసిన ఈ విమానాశ్రయాన్ని బెల్జియం అధికారులు ఆదివారం పదిగంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభించారు. గతంలో లేనంత భద్రతను ఈ విమానాశ్రయానికి కల్పించారు.

ప్రస్తుతానికి మూడు విమానాలతో సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. గత నెల మార్చి 22న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయాన్ని ప్రారంభించినా దాడి సన్ని వేశాలు తమ కళ్లముందే కదలుతుండటంతో తక్కువమందే తొలిరోజు విమానాశ్రయానికి వస్తున్నట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement