బ్రస్సెల్స్లో మరోసారి పేలుడు శబ్దాలు
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్లో మరోసారి భారీ బాంబు పేలుడు శబ్దం వినిపించింది. స్కార్ బీక్ జిల్లాలో పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతుండగా తాజాగా బాంబు పేలుడు సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని కూడా పోలీసులు నిర్భంధించినట్లు సమాచారం. పోలీసుల తనిఖీల వల్ల గంభీరంగా మారినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బ్రస్సెల్స్ లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకొని దాదాపు 30మందికి పైగా చనిపోగా మరో 40మందికి పైగా గాయాలపాలయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారికోసం ప్రస్తుతం బ్రస్సెల్స్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు కూడా తెలుస్తోంది.