బ్రసెల్స్: బ్రసెల్స్ విమానాశ్రయంలో బాంబు దాడులకు పాల్పడి 34 మంది మృతికి కారణమైన ఉగ్రవాదుల అసలు టార్గెట్ వేరే ఉందని, చివరి నిమిషంలో వారు తమ ప్రణాలికను మార్చుకోవటంతో బ్రసెల్స్ దాడి జరిగిందని తాజా విచారణలో తేలింది. బ్రసెల్స్ ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది మహమ్మద్ అబ్రిని విచారణ సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మరోసారి పారిస్ తరహా దాడులను ఫ్రాన్స్లో చేయాలని ఉగ్రవాదులు తొలుత భావించినా సెక్యురిటీ టైట్గా ఉండటంతో అప్పటికప్పుడు అత్యవసరంగా బ్రసెల్స్ విమానాశ్రయంలో దాడులకు పాల్పడినట్లు విచారణ అధికారులకు అబ్రిని వెల్లడించినట్లు మీడియా సంస్థ జిన్హువా తెలిపింది. ఉగ్రదాడులకు పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో మెంబర్ అయిన అబ్రినిని శుక్రవారం బ్రసెల్స్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ ఉగ్రవాదుల అసలు టార్గెట్ అది కాదు!
Published Sun, Apr 10 2016 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement