బ్రస్సెల్స్: బ్రస్సెల్స్లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడు బెల్ట్ బాంబు ధరించి ఉన్నట్లు సమాచారం. బ్రస్సెల్స్ నడిబొడ్డున ఓ అతిపెద్ద షాపింగ్ మాల్ వద్ద ఇతడిని అరెస్టు చేసినట్లు బ్రస్సెల్స్ మీడియా వెల్లడించింది.
ఓ పక్క గతంలో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా ఉగ్రవాదులను ఏరిపారేసే చర్యల్లో నిమగ్నమైన పోలీసులకు సిటీ 2 అనే ఓ రిటెయిల్ షాపింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి తారసపడ్డాడు. అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పదుల సంఖ్యలో పోలీసులు తిరుగుతున్నా ఓ ఉగ్రవాది బయటకు రావడం ఎక్కడో బాంబుదాడి జరగవచ్చనే అనుమానానికి తావిస్తోందని, ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని బ్రసెల్స్ ప్రధాని చార్లెస్ మైఖెల్ చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
బ్రస్సెల్స్లో ఉగ్రవాది కలకలం
Published Tue, Jun 21 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement