దేశవ్యాప్తంగా 41 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు! | 41 Airport Across India Receives Bomb Threats Over Email, Says Reports | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 41 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు!

Published Tue, Jun 18 2024 9:45 PM | Last Updated on Wed, Jun 19 2024 10:58 AM

Forty One Airport Receives Bomb Threat Email In India

న్యూఢిల్లీ: దేశంలో 41 ఎయిర్‌పోర్ట్‌లలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో వరుస బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌తో అప్రమత్తమైన కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దేశం మొత్తం జల్లెడపట్టి అవి నకిలీ బెదిరింపులేనని నిర్ధారించారు.

దేశంలోని తమిళనాడులోని చెన్నై,కోయంబత్తూర్,బీహార్‌లోని పాట్నా, గుజరాత్‌లోని వడోదర, రాజస్థాన్‌లోని జైపూర్ 41 విమానాలలో బాంబు హెచ్చరిక ఈమెయిళ్లు వచ్చాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని,ఎలాంటి ఆధారాలు లభించలేదేని సీనియర్‌ అధికారులు వెల్లడించారు.

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఈమెయిల్‌ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంటర్‌టైన్మెంట్‌ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

    నీట్‌ పేపర్‌ లీకేజీ.. ఎన్‌టీఏ ప్రైవేట్‌ సంస్థనా?!

    Published Wed, Jun 26 2024 6:57 PM | Last Updated on Wed, Jun 26 2024 7:21 PM

    National Testing Agency Registered As Private Society

    ఢిల్లీ, సాక్షి : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో పేపర్‌ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    నీట్‌ పేపర్‌ లీకేజీతో అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లీకేజీకి పాల్పడిన నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశాలు జారీ చేసింది. అలా ఇప్పటి వరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    అదే సమయంలో ఎన్‌టీఏ చీఫ్‌ను తొలగించింది. పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నీట్‌ పేపర్‌ లీకేజీపై తమ ఆందోళనల్ని తెలుపుతూ వస్తున్నారు.

    ఈ తరుణంలో ఎన్‌టీఏ ప్రైవేట్‌ సంస్థ అని,ఎన్‌టీఏ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి అందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది.

    సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అంటే
    సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేది బ్రిటీష్ ఇండియాలో ఒక చట్టం. ఇది సాధారణంగా సమాజ శ్రేయస్సు కోరేలా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు సంబంధించిన సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

    No comments yet. Be the first to comment!
    Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement