bomb alert
-
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
5 రోజుల్లో 125 విమానాలకు బాంబు బెదిరింపులు
-
దేశవ్యాప్తంగా 41 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: దేశంలో 41 ఎయిర్‌పోర్ట్‌లలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దీంతో వరుస బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌తో అప్రమత్తమైన కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. దేశం మొత్తం జల్లెడపట్టి అవి నకిలీ బెదిరింపులేనని నిర్ధారించారు.దేశంలోని తమిళనాడులోని చెన్నై,కోయంబత్తూర్,బీహార్‌లోని పాట్నా, గుజరాత్‌లోని వడోదర, రాజస్థాన్‌లోని జైపూర్ 41 విమానాలలో బాంబు హెచ్చరిక ఈమెయిళ్లు వచ్చాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని,ఎలాంటి ఆధారాలు లభించలేదేని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు. -
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
-
బెంగళూరులో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మొయిల్స్ రావడంతో విద్యార్థులు, స్కూల్స్ యాజమాన్యం వణికిపోయింది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత బాంబ్‌స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యం.. విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందించారు. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వెంటనే వారిని బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు.. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాల్లలో ఒక్క స్కూల్.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తర్వాత అది నకిలీ బెదిరింపు అని తేలింది. ఇదీ చదవండి: తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక -
ఢిల్లీ స్కూల్, పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
ఈ మధ్యకాలంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్ల ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, శివసేన నేత సంజయ్ రౌత్‌ను చంపేస్తామని బెదిరింపులు అందాయి. దీంతోపాటు వివిధ చోట్ల బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ పాఠశాలతోపాటు విమనాశ్రాయానికి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తరువాత బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. పాఠశాల లోపల, పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police More details awaited. pic.twitter.com/p6DKKeSXsl — ANI (@ANI) April 12, 2023 మరోవైపు బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు బాంబ్ స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు లోపల, బయట సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 1.47 గంటలకు ఈ బెదిరింపు అధికారులకు అందింది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తుండటంతో విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్ చేశాడని అనుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో టెక్కీని అరెస్ట్ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్లో నకిలీ బాంబు కాల్స్ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) -
రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
కాళ్లరిగేలా తిరిగి కడుపు మండి.. మంత్రాలయలో బాంబు..
సాక్షి, ముంబై: స్థలం రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఇక పని కాదని ఏకంగా మంత్రాలయలోనే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన సాగర్ మాంఢరే అనే వ్యక్తి. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులతో మంత్రాలయలో సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఫేక్ కాల్‌గా భావించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థలం విషయంలో కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల అతడి మానసిక స్థితి దెబ్బతినడంతో బెదిరింపు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. కాగా, బెదిరింపు కాల్‌తో మంత్రాలయ భవనం ఆవరణలో, భవనం బయట భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అసలేం జరిగింది? మంత్రాలయ భవనంలో బాంబు ఉందని ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. అయితే 24 గంటలు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించే మంత్రాలయలో బాంబు పెట్టడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రితోపాటు కేబినెట్, సహాయ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలను తనిఖీ చేయనిదే మంత్రాలయ భవనంలోకి అనుమతించరు. ఇలాంటి పటిష్టమైన భద్రత ఉన్న మంత్రాలయలోకి సామాన్య వ్యక్తులు బాంబు తీసుకెళ్లి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఆదివారం మంత్రాలయకు సెలవు అయినప్పటికీ పోలీసులు ఈ బెదిరింపు కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యం బృందం, డాగ్ స్క్వాడ్ మంత్రాలయలో అణువణువూ గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు గాని అనుమానాస్పద వస్తువుగాని లభించలేదు. తరువాత ఈ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని టెలిఫోన్ ఎక్ఛేంజీ నుంచి ఆరా తీయగా మహారాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగ్‌పూర్ నుంచి ఫోన్ చేసిన సాగర్ మాంఢరేను అరెస్టు చేశారు. ముంబైలో స్థానిక మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగి.. నాగ్‌పూర్‌లో కోల్ ఫిల్డ్ స్టోన్ క్రషింగ్‌కు ఆనుకుని ఉన్న స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి సాగర్ మాంఢరే అనేక సార్లు స్థానిక ప్రభుత్వం కార్యాలయాల చుట్టు తిరిగాడు. పని జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలని తహశీల్దార్, జిల్లా కలెక్టర్, రీజినల్ కమిషనర్ తదితర ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, పరిపాలనా విభాగం రికార్డుల ప్రకారం ఆ స్థలం అస్థిత్వంలో లేదు. చివరకు కొద్ది నెలల కిందట ఆ స్థలానికి సంబంధించిన పత్రాలతో మంత్రాలయకు వచ్చి ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ విభాగానికి చెందిన కార్యదర్శులతో భేటీ అయ్యాడు. ఇక్కడ కూడా నిరాశే మిగలడంతో అధికారులను, కార్యదర్శులను అరెస్టు చేయాలని మంత్రాలయలో గొడవ చేశాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. -
సత్యవేడులో బాంబు కలకలం
సాక్షి, సత్యవేడు, చత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం తెల్లవారు జామున సత్యవేడులో బాంబు కలకలం సమాచారం స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గురువారం తెల్లవారు జామున 3 గంటలకు రాష్ట్ర పోలీస్ అత్యవసర సేవ అయిన 100కు ఫోన్ చేసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపంలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన తమిళనాడు రాష్ట్ర డీజీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే పుత్తూరు డీఎస్పీ మురళీకృష్ణ, సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. హుటాహుటిన వీరందరూ కలసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపాన్ని తెల్లవారుజామున పరిశీలించారు. అక్కడ ఆ సమయానికి వివాహం జరుగుతుండగా వారిని వెలుపలికి పంపి మండపం పరిసరాలను అణువణువునా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ వివాహ కార్య క్రమానికి వచ్చిన వారిని విచారణ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు అమర్చినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడం, ఎలాంటి దుస్సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించేందుకు తమిళనాడు 100కు ఎవరో ఆగంతకుడు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనిఖీలలో సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
బాంబే అంటే బాంబు అనుకుని..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు గతంలో బాంబే కాగా ఆ పేరులో భయోత్పాతం కలిగించే శబ్ధం ఉండటంతో ఎవరు ఆ పేరును పిలిచినా ఉలిక్కిపడుతున్నారు. ఉద్యోగావకాశాల కోసం ఓ యువకుడు బొంబాయి విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇది బాంబే ఎయిర్‌పోర్టేనా అని అడగటంతో కాల్ రిసీవ్ చేసుకున్న కంట్రోల్ రూం సిబ్బందికి ‘బాంబ్ హై’ అని వినిపించడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై రెండు గంటల పాటు హడావిడి సాగింది. చివరికి విషయం తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది సైతం ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. ఓ కాలర్ బాంబే=ఢిల్లీ విమానం గురించి అడుగతూ బామ్-డెల్ ఫ్లైట్ అనగానే రిసీవర్‌కు బాంబ్ హై అని వినపడటంతో భద్రతా సిబ్బంది బాంబు కోసం ఎయిర్‌పోర్ట్‌ను జల్లెడ పట్టాల్సి వచ్చింది. కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. నకిలీ కాల్‌తో బెంబేలెత్తించాడనే అనుమానంతో అతడ్ని పలు ప్రశ్నతలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. బాంబే-ఢిల్లీ విమానాన్ని ఏవియేషన్ కోడ్స్‌లో బామ్-డెల్గా వ్యవహరిస్తారని తాను అలాగే ఉచ్ఛరించానని కాల్ చేసిన వ్యక్తి నింపాదిగా చెప్పుకొచ్చారు. -
స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు
చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కాంచీపురం నుంచి ఫోన్ చేసి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్టాలిన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. స్టాలిన్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్‌కాల్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం గురించి డీఎంకే అధినేత స్టాలిన్‌ను వివరణ కోరగా..ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని చెప్పడం గమనర్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్రస్సెల్స్‌లో ఉగ్రవాది కలకలం
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్‌లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడు బెల్ట్ బాంబు ధరించి ఉన్నట్లు సమాచారం. బ్రస్సెల్స్ నడిబొడ్డున ఓ అతిపెద్ద షాపింగ్ మాల్ వద్ద ఇతడిని అరెస్టు చేసినట్లు బ్రస్సెల్స్ మీడియా వెల్లడించింది. ఓ పక్క గతంలో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా ఉగ్రవాదులను ఏరిపారేసే చర్యల్లో నిమగ్నమైన పోలీసులకు సిటీ 2 అనే ఓ రిటెయిల్ షాపింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి తారసపడ్డాడు. అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పదుల సంఖ్యలో పోలీసులు తిరుగుతున్నా ఓ ఉగ్రవాది బయటకు రావడం ఎక్కడో బాంబుదాడి జరగవచ్చనే అనుమానానికి తావిస్తోందని, ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని బ్రసెల్స్ ప్రధాని చార్లెస్ మైఖెల్ చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. -
బోయింగ్ 777కు బాంబు బెదిరింపు
టర్కీ: టర్కీకి చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి కాకుండా మరో చోటకు తరలించి దించివేశారు. టర్కీకి చెందిన టర్కీష్ ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 777 హ్యూస్టన్ నుంచి ఇస్తాంబుల్‌కు బయలు దేరింది. మధ్యలో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో ఐర్లాండ్ వైమానిక సంస్థ అధికారుల అనుమతి తీసుకుని ఇస్తాంబుల్ వైపు వెళ్లకుండా ఐర్లాండ్ లో పైలెట్ సురక్షితంగా దించి వేశాడు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం దించినవెంటనే వారందరినీ షానాన్ ఎయిర్ పోర్ట్ లోని సురక్షిత స్థావరానికి తరలించి విమాన తనిఖీ ప్రారంభించారు. -
కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం
నిర్మల్: ఆదిలాబాద్ లోని నిర్మల్ కోర్టుకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో కలకలం రేపింది. కోర్టు, ఆవరణ ప్రాంగణాల్లో బాంబులు పెట్టినట్లు ఓ ఆకతాయి అధికారులకు మంగళవారం సాయంత్రం ఫ్యాక్స్ పంపించాడు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు బాంబ్ స్క్వాడ్ ను కోర్టు వద్దకు పిలిపించారు. ప్రస్తుతం బాంబ్ స్క్యాడ్ అక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ ఎటువంటి బాంబులు లభ్యమవ్వలేదని తెలుస్తోంది.