రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. | Techie Arrested for hoax call in Bengaluru | Sakshi
Sakshi News home page

రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..

Oct 9 2022 9:10 AM | Updated on Oct 9 2022 9:10 AM

Techie Arrested for hoax call in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్‌ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్‌ చేశాడని అనుకున్నారు.

కేసు నమోదు చేసుకుని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్‌ ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టెక్కీని అరెస్ట్‌ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్‌లో నకిలీ బాంబు కాల్స్‌ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది.  

చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) 

Advertisement
 
Advertisement
Advertisement