IT engineer
-
టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్‌పార్క్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విపిన్ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్‌లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది. -
రాత్రి 12 గంటలకు టెక్కీకి న్యూడ్ వీడియో కాల్.. రూ.1 కోటికి పైగా వసూలు
కృష్ణరాజపురం అన్నసంద్ర కు చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీర్ ఇంగ్లండ్‌లో పనిచేసి ఇటీవల బెంగళూరుకు వెనక్కి వచ్చారు. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వివరాలు పోస్ట్ చేశాడు. ఈ నెల 2వ తేదీన ఒక యువతి అతనికి ఫోన్ చేసి మాటలు కలిపింది. 4వ తేదీన ఫోన్ చేసి అమ్మకు మందుల కోసం రూ.1,500 కావాలని ఆన్లైన్లో తన అకౌంట్ కు జమచేయించుకుంది. అదేరోజు రాత్రి 12 గంటలకు టెక్కీకి న్యూడ్ వీడియో కాల్ చేసి మాట్లాడి రికార్డు చేసుకుంది. కొంతసేపటికి ఆ వీడియోను టెక్కీ వాట్సాప్‌కు పంపించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది. భయపడిన టెక్కీ ఆమె చెప్పిన రెండు ఖాతాల్లోకి లక్షలాది రూపాయలను పంపాడు. ఇలా అతన్ని దఫదఫాలుగా బెదిరించి రూ.1.14 కోట్లు వసూలు చేసింది. మరింత డబ్బు కావాలనడంతో బాధితుడు వైట్‌ఫీల్డ్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాన్వి అరోరా అనే మహిళ ఈ కథ నడిపిందని గుర్తించారు. ఈ డబ్బులో రూ.80 లక్షలను జప్తు చేశామని, మిగిలిన నగదును ఆ మహిళ డ్రా చేసిందని, ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్‌చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్ చేశాడని అనుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో టెక్కీని అరెస్ట్ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్లో నకిలీ బాంబు కాల్స్ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) -
టెక్కీ అజితాబ్ మిస్సింగ్‌పై ప్రజాందోళన
యశవంతపుర: అదృశ్యమైన టెక్కి అజితాజ్ కుమార్ సిన్హా కేసును ఛేదించటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఐటీ ఇంజినీర్లు, సిన్హా కుటుంబసభ్యులు ఆదివారం టౌన్‌హాల్ వద్ద ఆందోళన చేశారు. అజితాజ్ అదృశ్యమై నెలలు గడుస్తున్న పోలీసులు ఇంతవరకు కనిపెట్టలేదని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరులోని విదేశీ సంస్థలు మన దేశంలో అధికంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాయి, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నాయి, అలాంటి వాటిమూలంగా తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు టెక్కీలు ఆందోళన వ్యక్తం చేశారు. అజితాజ్ పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు. అతని మిస్సింగ్ ఘటనపై ప్రధాని, ముఖ్యమంత్రి, ఐజిపీ, డిజీపీలను వేడుకున్నా ఫలితం శూన్యమన్నారు. 2017 డిసెంబర్ 8న అదృశ్యమైన రోజు నుండి ఇప్పటివరకు పోలీసులు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఐటీ ఇంజినీరు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యల పరిస్థితి ఎమిటో అర్థం చేసుకోవాలన్నారు. వైట్‌ఫీల్డ్‌లో నివాసముండే అజితాబ్ ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో తన కారును అమ్మడానికి ఫోటో పెట్టాడు. ఎవరో వ్యక్తి కారు కొంటానని అజితాబ్‌ను పిలిపించాడు. ఆ తరువాత నుంచి ఆచూకీ దొరకడం లేదు. -
ఎక్కడ?
బెంగళూరు, వైట్‌ఫీల్డ్: బెంగళూరు బెళ్ళందూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్న పాట్నాకు చెందిన అజితబ్ (29) అదృశ్యం కేసు పదిరోజులు దాటినా మిస్టరీగానే ఉంది. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, మిత్రులు ఆన్లైన్లో ప్రచారాన్ని చేపట్టారు. తన కారును విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన చేసిన అజితబ్ ఎవరో దానిని కొనడానికి ఫోన్ చేయగా, కారు తీసుకొని వెళ్లాడు. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. ఈ నెల 18న ఘటన జరిగింది. అతని రూమ్మేట్ యిచ్చిన సమాచారం మేరకు టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్ ఫిర్యాదు చేయగా వైట్‌ఫీల్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అజితబ్ ఆచూకీ తెలపాలని సోషల్ మీడియాలో ప్రకటనలు, వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. అజితబ్ తండ్రి అశోక్ కుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన బిడ్డ ఎవరికీ హాని చేయలేదని అమాయకుడని అన్నారు. తన బిడ్డను వదలివేయాలని విజ్ఞప్తి చేస్తున్న వీడియోను కూడా ఆన్లైన్లో ఉంచారు. త్వరలో పెళ్లికి విషయమై కొద్దిరోజుల కిందటే తనతో మాట్లాడాడని, బెంగళూరు అంటే ప్రశాంతతకు మారుపేరని అనుకున్నామని చెప్పారు. అతని అదృశ్యం అంతుచిక్కనిదిగా మారడంతో అతని కోసం పోలీసులు ఒకవైపు, మరోవైపు అతని కుటుంబ సభ్యులు, మిత్రులు వెదుకుతున్నారు. కారు కొంటామని కాల్ చేసినవారే ఏదైనా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. కార్ కొనుగోలుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 18వ తేదీ సాయంత్రం 7:30 సమయంలో చివరిసారిగా అతని ఫోన్ వైట్‌ఫీల్డ్ పరిధిలోని గంజూరులో పనిచేసింది. ఆ తరువాత నుంచి స్విచ్ఛాఫ్ అయ్యింది. ఎంబీఏ చదవడానికి కారు అమ్ముదామని.. మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన అజితబ్ ఉన్నత చదువుల కోసం తపించేవాడు. వచ్చే ఏడాది కోల్‌కతా ఐఐఎంలో ఎంబీఏ చేయాలనే లక్ష్యంతో డబ్బు సమకూర్చుకోవడానికి తన కారును విక్రయించాలని నిర్ణయించాడు. ఈ నెల 20వ తేదీ లోగా మొదటి వాయిదా కింద ఆ డబ్బు కట్టాల్సి ఉంది. అందుకే కొత్తగా కొన్నప్పటికీ ఎంతో ఒకంతకు అమ్మేసి బంగారు భవితను నిర్మించుకోవాలని అతను కలలుగన్నాడు. అయితే విధి ఏం తలచిందోగానీ అదే విషయంలో ఎక్కడో భారీ తప్పిదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ అనుమానాస్పద కారు, ఇతరత్రా లభ్యమైనట్లు తమకు సమాచారం అందలేదని వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ అహద్ చెప్పారు. -
కారు అమ్మడానికి వెళ్లి.. టెక్కీ అదృశ్యం
వైట్‌ఫీల్డ్: ఒక ఐటీ ఇంజినీరు అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 18వ తేదీన తన కారును విక్రయించేం దుకు వెళ్ళిన అతడు కని పించడంలేదని తెలిపా రు. ఫిర్యాదు మేరకు వివరాలు యిలావున్నాయి. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ఆపార్టుమెంట్‌లో పాట్నాకు చెం దిన అజితబ్ (29) తన స్నేహితుడితో నివాసం వు న్నాడు. అజితబ్ బెళ్ళందూరులోని ఒక కంపెనీలో టెక్కీ. తన వద్దవున్న కారును విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన చేశాడు. మారుతీ క్లాజ్ కారును రూ. 12 లక్షలకు కొనుగోలు చేసినట్లు, దీన్ని 11లక్షల 80వేలకు విక్రయిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు ఈ కారు కొనడానికి ఫోన్ చేశారని, తాను వెళ్తున్నానని తన రూమ్మేట్కు తెలిపాడు. అలా వెళ్లిన వ్యక్తి తరువాత కనిపించలేదు. అతని ఫోన్ పనిచేయలేదు. అప్ప టి నుంచి అతని ఆచూకీ తెలియరాలేదని టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు కొనడానికి వచ్చిన వారే కిడ్నాప్ చేసివుంటారని అనుమానం వ్యక్తంచేశాడు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వికృత చేష్టలు!
బెంగళూరు: అసహజ లైంగిక ప్రక్రియ కావాలని భార్యను వేధిస్తున్న బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఇంజినీరుపై చత్తీస్గడ్ రాయగడ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును బెంగళూరుకు బదిలీ చేశారు. బెంగళూరుకు చెందిన ఐటీ ఇంజనీరుతో చత్తీస్‌గడ్‌కు చెందిన యువతికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరు బెంగళూరు వివేకనగర పరిధిలోని ఈజీపురలో నివాసముంటున్నారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా తరువాత భర్త వికృత మనస్తత్వం గురించి భార్యకు తెలిసింది. అతడు ప్రతి రోజు నీలిచిత్రాలు చూసేవాడు, వాటిని భార్యకు కూడా చూపిస్తూ వాటిలో ఉన్నట్లుగానే శృంగారం కావాలని వేధింపులకు గురిచేసేవాడు. రానురాను అతని పైత్యం శృతిమించింది. ఇద్దరూ పడకగదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు సెల్ఫోన్లో వీడియో తీసేవాడు. భర్త చేష్టలను భరిచలేని ఆమె అలాంటి పనులకు అడ్డు చెప్పడంతో ఆ వీడియో దృశ్యాలను మీ తండ్రికి వాట్సాప్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధలు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును నగరంలోని వివేకనగర పోలీస్‌స్టేషన్‌కు బదిలీచేయడంతో వారు సోమవారం విచారణ చేపట్టారు. -
ల్యాప్‌టాప్ చోరీ.. ఐటీ ఇంజనీరుకు సంకెళ్లు
బెంగళూరు: అతడు ఐటీ ఇంజనీరు. అయినా ఎందుకో తప్పుదారి ఎంచుకున్నాడు. తన స్నేహితుడి ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. ల్యాప్‌టాప్ చోరీ చేసిన ఆ యువకుడిని మంగళవారం బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్నేహితులు సతీశ్, వెంకటశేషారెడ్డిలు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఇటీవల సతీశ్... వెంకటశేషారెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను తస్కరించాడు. పైగా తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించాడు. ఈ విషయంపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో సతీశే ల్యాప్‌టాప్‌ను చోరీ చేసినట్లు తేలింది. దాంతో మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
చెన్నైలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్
కోటి రూపాయలు డిమాండ్.. నలుగురు కిడ్నాపర్ల అరెస్టు టీనగర్(చెన్నై): చెన్నైలో తెలంగాణాకు చెందిన ఐటీ ఇంజనీర్‌ను దుండగులు కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు పక్కా వ్యూహంతో నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసి బాధితుడిని విడిపించారు. తెలంగాణ లోని ఖమ్మం జిల్లా సీతారాంపురం ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమారుడు ప్రేమ్‌కుమార్(28) చెన్నై నావలూరు హెచ్‌సీఎల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే క్రమంలో అటువైపు బైక్‌పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతనితోపాటు మరొకరు బైక్ ఎక్కారు. వెనుక కూర్చున్న వ్యక్తి ప్రేమ్‌కుమార్‌కు మత్తుమందున్న కర్చీఫ్ పెట్టడంతో మత్తులోకి జారుకున్నారు. అక్కడి నుంచి కారులో వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం... ప్రేమ్‌కుమార్ రూమ్‌లో ఉంటున్న సందీప్‌కి, తల్లి అరుణకు కిడ్నాపర్లు ఫోన్ చేసి... కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రేమ్‌కుమార్ తల్లిదండ్రులు గురువారం సాయంత్రం చెన్నై చేరుకుని కేళంబాక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్లు అరుణను రూ.10 లక్షలు తీసుకుని ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రదేశానికి రావాలని చెప్పారు. అరుణ రూ.10 లక్షల నగదుతో రాత్రి సెమ్మంజేరి ప్రాంతానికి వెళ్లగా... ఆమెను పోలీసులు రహస్యంగా వెంబడించారు. అక్కడ హెల్మెట్ ధరించిన యువకుడు అరుణ వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. విచారించగా... తయ్యూర్లోని అపార్ట్మెంట్ గదిలో ప్రేమ్‌కుమార్‌ను బంధించినట్టు తెలిపాడు. శుక్రవారం వేకువజామున రెండు గంటల సమయంలో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు విడిపించారు. దీంతో సంబంధం ఉన్న తయ్యూర్ పెరియమానగర్కు చెందిన పార్తిబన్(23), జయశీలన్(28), కేళంబాక్కం బాలాజీ(27), అరక్కోణం వివేక్ రాజ్(27)ను అరెస్టు చేశారు.