సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ వికృత చేష్టలు! | wife filed a case against bengaluru IT engineer | Sakshi

సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ వికృత చేష్టలు!

Published Tue, May 9 2017 8:31 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ వికృత చేష్టలు!

సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ వికృత చేష్టలు!

అసహజ లైంగిక ప్రక్రియ కావాలని భార్యను వేధిస్తున్న బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఇంజినీరుపై చత్తీస్‌గడ్‌ రాయగడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

బెంగళూరు: అసహజ లైంగిక ప్రక్రియ కావాలని భార్యను వేధిస్తున్న బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఇంజినీరుపై చత్తీస్‌గడ్‌ రాయగడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును బెంగళూరుకు బదిలీ చేశారు. బెంగళూరుకు చెందిన ఐటీ ఇంజనీరుతో చత్తీస్‌గడ్‌కు చెందిన యువతికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరు బెంగళూరు వివేకనగర పరిధిలోని ఈజీపురలో నివాసముంటున్నారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా తరువాత భర్త వికృత మనస్తత్వం గురించి భార్యకు తెలిసింది.

అతడు ప్రతి రోజు నీలిచిత్రాలు చూసేవాడు, వాటిని భార్యకు కూడా చూపిస్తూ వాటిలో ఉన్నట్లుగానే శృంగారం కావాలని వేధింపులకు గురిచేసేవాడు. రానురాను అతని పైత్యం శృతిమించింది. ఇద్దరూ పడకగదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసేవాడు. భర్త చేష్టలను భరిచలేని ఆమె అలాంటి పనులకు అడ్డు చెప్పడంతో ఆ వీడియో దృశ్యాలను మీ తండ్రికి వాట్సాప్‌ చేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధలు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును నగరంలోని వివేకనగర పోలీస్‌స్టేషన్‌కు బదిలీచేయడంతో వారు సోమవారం విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement