ఆందోళన చేస్తున్న ఐటీ ఇంజినీర్లు, కుటుంబ సభ్యులు
యశవంతపుర: అదృశ్యమైన టెక్కి అజితాజ్ కుమార్ సిన్హా కేసును ఛేదించటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఐటీ ఇంజినీర్లు, సిన్హా కుటుంబసభ్యులు ఆదివారం టౌన్‌హాల్ వద్ద ఆందోళన చేశారు. అజితాజ్ అదృశ్యమై నెలలు గడుస్తున్న పోలీసులు ఇంతవరకు కనిపెట్టలేదని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరులోని విదేశీ సంస్థలు మన దేశంలో అధికంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నాయి, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నాయి, అలాంటి వాటిమూలంగా తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు టెక్కీలు ఆందోళన వ్యక్తం చేశారు. అజితాజ్ పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు.
అతని మిస్సింగ్ ఘటనపై ప్రధాని, ముఖ్యమంత్రి, ఐజిపీ, డిజీపీలను వేడుకున్నా ఫలితం శూన్యమన్నారు. 2017 డిసెంబర్ 8న అదృశ్యమైన రోజు నుండి ఇప్పటివరకు పోలీసులు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఐటీ ఇంజినీరు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యల పరిస్థితి ఎమిటో అర్థం చేసుకోవాలన్నారు. వైట్‌ఫీల్డ్‌లో నివాసముండే అజితాబ్ ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో తన కారును అమ్మడానికి ఫోటో పెట్టాడు. ఎవరో వ్యక్తి కారు కొంటానని అజితాబ్‌ను పిలిపించాడు. ఆ తరువాత నుంచి ఆచూకీ దొరకడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment