బెంగళూరు: అతడు ఐటీ ఇంజనీరు. అయినా ఎందుకో తప్పుదారి ఎంచుకున్నాడు. తన స్నేహితుడి ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. ల్యాప్‌టాప్ చోరీ చేసిన ఆ యువకుడిని మంగళవారం బెంగళూరు మారతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్నేహితులు సతీశ్, వెంకటశేషారెడ్డిలు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
ఇటీవల సతీశ్... వెంకటశేషారెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను తస్కరించాడు. పైగా తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించాడు. ఈ విషయంపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో సతీశే ల్యాప్‌టాప్‌ను చోరీ చేసినట్లు తేలింది. దాంతో మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ల్యాప్‌టాప్ చోరీ.. ఐటీ ఇంజనీరుకు సంకెళ్లు
Published Tue, Mar 21 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
Advertisement
Advertisement