కృష్ణరాజపురం అన్నసంద్ర కు చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీర్ ఇంగ్లండ్‌లో పనిచేసి ఇటీవల బెంగళూరుకు వెనక్కి వచ్చారు. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో వివరాలు పోస్ట్ చేశాడు. ఈ నెల 2వ తేదీన ఒక యువతి అతనికి ఫోన్ చేసి మాటలు కలిపింది. 4వ తేదీన ఫోన్ చేసి అమ్మకు మందుల కోసం రూ.1,500 కావాలని ఆన్‌లైన్‌లో తన అకౌంట్ కు జమచేయించుకుంది.
అదేరోజు రాత్రి 12 గంటలకు టెక్కీకి న్యూడ్ వీడియో కాల్ చేసి మాట్లాడి రికార్డు చేసుకుంది. కొంతసేపటికి ఆ వీడియోను టెక్కీ వాట్సాప్‌కు పంపించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. భయపడిన టెక్కీ ఆమె చెప్పిన రెండు ఖాతాల్లోకి లక్షలాది రూపాయలను పంపాడు. ఇలా అతన్ని దఫదఫాలుగా బెదిరించి రూ.1.14 కోట్లు వసూలు చేసింది.
మరింత డబ్బు కావాలనడంతో బాధితుడు వైట్‌ఫీల్డ్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాన్వి అరోరా అనే మహిళ ఈ కథ నడిపిందని గుర్తించారు. ఈ డబ్బులో రూ.80 లక్షలను జప్తు చేశామని, మిగిలిన నగదును ఆ మహిళ డ్రా చేసిందని, ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment