![Bomb threat to Stalin's residence - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/2/m.jpg.webp?itok=GTOj9r8e)
డీఎంకే నేత ఎంకే స్టాలిన్(పాత చిత్రం)
చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కాంచీపురం నుంచి ఫోన్ చేసి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్టాలిన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. స్టాలిన్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్‌కాల్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం గురించి డీఎంకే అధినేత స్టాలిన్‌ను వివరణ కోరగా..ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని చెప్పడం గమనర్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment